వినీత్
నటుడు
వినీత్ ప్రముఖ చలన చిత్ర నటుడు. తెలుగు, తమిళం,కన్నడ మళయాల, హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించాడు. తెలుగులో అబ్బాస్తో కలిసి నటించిన ప్రేమ దేశం చిత్రం ఇతనికి మంచిపేరు తెచ్చింది.
వినీత్ | |
![]() 2008 సంవత్సరములో వినీత్ | |
జననం | [1] కన్నూర్, కేరళ, భారతదేశం | 1969 ఆగస్టు 23
క్రియాశీలక సంవత్సరాలు | 1985 - ఇప్పటివరకు |
భార్య/భర్త | ప్రిస్కిలా మీనన్ (2004 - ఇప్పటివరకు) |
వెబ్‌సైటు | http://www.actorvineeth.com |
వ్యక్తిగత జీవితం సవరించు
ట్రావెంకూర్ సిస్టర్స్ గా పేరు గాంచిన రాగిణి, పద్మిని లలో పద్మిని భర్తయైన డాక్టర్ రామచంద్రన్ కు వినీత్ మేనల్లుడు. వీరిద్దరి ప్రోద్భలంలో వినీత్ తల్లిదండ్రులు అతన్ని ఆరేళ్ళ వయసు నుంచే నాట్య తరగతులకు పంపించడం ప్రారంభించారు. అలా చిన్న వయసులోనే భరతనాట్యం నేర్చుకున్నాడు.[2] పలు పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు సాధించాడు. కేరళ యూత్ ఫెస్టివల్ పోటీల్లో వరుసగా నాలుగేళ్ళ పాటు మొదటి బహుమతి పొందాడు. 1986 లో కళాప్రతిభ పురస్కారాన్ని పొందాడు.
కెరీర్ సవరించు
వినీత్ 1985 లో ఐ. వి. శశి దర్శకత్వంలో వచ్చిన ఇదనిళంగ అనే సినిమాతో చిత్ర సీమలోకి ప్రవేశం చేశాడు.
నటించిన చిత్రాలు సవరించు
తెలుగు సవరించు
- రంగ్ దే (2021)
- చంద్రముఖి
- లాహిరి లాహిరి లాహిరిలో (2002)
- నీ ప్రేమకై (2002)
- టు లేడీస్ అండ్ జెంటిల్ మేన్ (2001)
- W/O వి. వర ప్రసాద్ (1998)
- రుక్మిణి (1997)
- కాలాపానీ (1996)
- ప్రేమ దేశం (1996)
- ఆరో ప్రాణం (1997)
- సరిగమలు (1994)
- జెంటిల్ మేన్ (1993)
తమిళం సవరించు
కన్నడ సవరించు
- ఆప్తరక్షక (2010)
మళయాలం సవరించు
హిందీ సవరించు
- భూల్ భులయ్యా (2007)
- దౌడ్ (1997)
- సర్గం (1992)
మూలాలు సవరించు
- ↑ http://www.celebrities-galore.com/celebrities/vineeth/home/
- ↑ Rediff On The Net, Movies: Winning, vulnerable Vineeth. Rediff.com (16 October 1997). Retrieved on 2012-02-26.