పాదుకా పట్టాభిషేకం (1966 సినిమా)

పాదుకా పట్టాభిషేకం 1966, జూన్ 16వ తేదీన విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. వసంత కుమార్ రెడ్డి దర్శకత్వంలో , కాంతారావు , కృష్ణకుమారి, వాణీశ్రీ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి,సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు, అశ్వత్థామ సమకూర్చారు.

పాదుకా పట్టాభిషేకం
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం టెక్నికల్ యూనిట్
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు & అశ్వద్దామ
నిర్మాణ సంస్థ అమరావతి చిత్ర
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు, పద్యాలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలు పద్యాలను కె.వడ్డాది రచించగా ఘంటసాల సంగీతాన్ని అందించాడు.[1]

  1. రామయను దివ్య నామము నీ మనంబున జపము చేసి (పద్యం) గానం. ఘంటసాల
  2. శ్రీవత్సాంకం చిదానందం యోగనిద్రా విలోలితం (పద్యం,) గానం. ఘంటసాల
  3. పాలించితి నేను పలు వర్షములు ప్రజలు రంజిల్ల (పద్యం) గానం. పి. బి.శ్రీనివాస్
  4. సుగుణాభి రాముని నగుమోము చూడక పదునాలుగేండ్లెట్లు బ్రతుకగలను (పద్యం), గానం. పి. బి.శ్రీనివాస్
  5. సర్వమంగళ గుణదీప సత్యరూప (పద్యం) గానం. ఎస్. జానకి
  6. అమ్మలగన్నయమ్మ హృదయమ్మున నీ చరణద్వయమ్ములే నమ్మితినమ్మ (పద్యం), గానం. ఎస్.జానకి
  7. ఆలుబిడ్డల వీడి కారడవులందు మీరు వెతలొంద చూచి నేనోర్వజాల (పద్యం), గానం. ఘంటసాల
  8. సార్వభౌములైన సర్వజ్ఞులైనను మృత్యువు నెదిరింప సాధ్యమగునే? (పద్యం), గానం. ఘంటసాల
  9. శ్రీరామచంద్ర వరకౌముది భక్తలోక (పాట)
  10. పరమపూజ్యుండైన భర్తను వేధించి పసుపు కుంకుమలను బాపినాను (పద్యం) గానం. ఎస్. జానకి
  11. నీదు చరితము ఆదర్శనీయమగును (పద్యం) గానం . పి. బి. శ్రీనివాస్
  12. సూర్యచంద్రులు గతితప్పి చెలగుగాక (పద్యం), గానం. ఘంటసాల
  13. కులగిరులు తల్లక్రిందులై కూలుగాక (పద్యం), గానం. రాఘవులు
  14. చరితార్థుడైన భరతుడు అరయగ బ్రహ్మాదులకు అతి దుర్లభమౌ (పద్యం) గానం ఘంటసాల
  15. శ్రీ రామచంద్రుడు రాజౌనట మన సీతమ్మ తల్లి రాణౌనట (పాట) గానం. పిఠాపురం, వైదేహి బృందం
  16. వెడలు చుంటివా కారడవులకు శ్రీహరివైనను సామాన్యునివలె (పాట) గానం ఘంటసాల
  17. ఈశ్వర మాయలె చిత్రము పరమేశ్వర లీలలె నిగూఢము (పాట) గానం. ఎస్. జానకి
  18. వినరయ్య శ్రీరాముని గాధ కనరయ్య రఘురాముని లీల (పాట) గానం. వైదేహి, సౌమిత్రి
  19. రామయ్య తండ్రీ రఘురామయ్య తండ్రీ ఎంత గొప్పవాడవయ్య రామయ్య తండ్రీ (పాట), గానం. ఘంటసాల బృందం
  20. ఓహో ప్రేయసీ అరుదెంచినావా నా ఊర్వశీ (పాట) గానం. పి. బి.శ్రీనివాస్ , ఎస్. జానకి కోరస్
  21. ఓహో సుందర ప్రకృతీ జగతీ (పాట), గానం. ఘంటసాల, ఎస్. జానకి కొరస్
  22. నేను నీ యెడ చేసిన , గానం.ఘంటసాల .

మూలాలు

మార్చు
  1. కె.వడ్డాది. పాదుకా పట్టాభిషేకం. p. 12. Retrieved 22 August 2020.

బయటి లింకులు

మార్చు