పి.శశిధర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

పట్టోళ్ళ శశిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో మెదక్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3]

పట్టోళ్ళ శశిధర్ రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2004 – 2009
ముందు కె.ఉమాదేవి
తరువాత మైనంపల్లి హన్మంతరావు
నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం మే 05
యూసుఫ్‌పేట్, పాపన్నపేట మండలం, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ బీఆర్ఎస్
ఇతర రాజకీయ పార్టీలు జనతా పార్టీ , ఎన్సీపీ , భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు పట్లోళ్ల నారాయణ రెడ్డి
జీవిత భాగస్వామి సునీత[1]
సంతానం విశ్వార్త్, వశిష్ఠ్
నివాసం మెదక్

రాజకీయ జీవితం

మార్చు

పట్లోళ్ల శశిధర్ రెడ్డి 2004లో జనతా పార్టీ నుండి మెదక్ శాసనసభ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అసెంబ్లీలో కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా పని చేశాడు. ఆయన 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు చేతిలో ఓడిపోయాడు. శశిధర్ రెడ్డి 2014, 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో 2018 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరాడు.[2]

పట్లోళ్ల శశిధర్ రెడ్డి 2023 మే 26న హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4] ఆయన ఆ తరువాత 2023 ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.

పట్లోళ్ల శశిధర్ రెడ్డి 2023 అక్టోబర్ 13న తన్నీరు హరీశ్ రావు సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. CEO Telangana (2009). "P.Shashidhar Reddy" (PDF). Archived from the original (PDF) on 28 June 2022. Retrieved 28 June 2022.
  2. 2.0 2.1 Andhra Jyothy (26 May 2023). "తెలంగాణ బీజేపీకి ఊహించని ఝలక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కీలక నేత.. స్క్రిప్ట్ మారుతోందే..!". Archived from the original on 27 May 2023. Retrieved 27 May 2023.
  3. Eenadu (6 November 2023). "భార్యాభర్తలు.. తండ్రీకొడుకులు.. ఎమ్మెల్యేలుగా..." Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  4. 10TV Telugu (26 May 2023). "కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి" (in Telugu). Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. V6 Velugu (13 October 2023). "బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్రెడ్డి". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Andhrajyothy (13 October 2023). "శశిధర్ రెడ్డి చేరికతో మెదక్‌లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.