పి. శివశంకర్

(పి.శివశంకర్ నుండి దారిమార్పు చెందింది)

పుంజల శివశంకర్ (ఆగష్టు 10, 1929 - ఫిబ్రవరి 27, 2017) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు మరియు కేంద్ర మాజీ మంత్రి. 1978, 80, 85లలో భారత జాతీయ కాంగ్రెస్ ఎం.పి.గా పనిచేశాడు.

పుంజల శివశంకర్
పి. శివశంకర్


ఎం.పి.
నియోజకవర్గము సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1929-08-10) 1929 ఆగస్టు 10 (వయస్సు: 90  సంవత్సరాలు)
మామిడిపల్లి, హైదరాబాద్ జిల్లా, తెలంగాణ
మరణం ఫిబ్రవరి 27, 2017
హైదరాబాద్, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సంతానము వినయ్ పుంజాల
నివాసము హైదరాబాద్, తెలంగాణ

జననంసవరించు

శివశంకర్ 1929, ఆగష్టు 10న హైదరాబాద్ జిల్లా మామిడిపల్లిలో జన్మించాడు.

విద్యాభ్యాసం - ఉద్యోగంసవరించు

అమృత్‌సర్ నుంచి బి.ఏ. పట్టాను, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టాను పొందాడు. 1974-75 మధ్యకాలంలో హైకోర్టు న్యాయవాదిగా పనిచేశాడు.

కుటుంబ వివరాలుసవరించు

ఇతని కుమారుడు వినయ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యనిపుణులగా పనిచేస్తుండగా, కోడలు అలేఖ్య పుంజాల కూచిపూడి కళాకారిణిగా, నాట్య గరువుగా ఉన్నారు.[1]

రాజకీయ ప్రస్థానంసవరించు

1979 సంవత్సరంలో జరిగిన ఆరో లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందాడు.[2] 1980లో నిర్వహించిన రీ ఎలక్షన్‌లో తిరిగి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. 1985, 1993 సంవత్సరాల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.

రెండోసారి విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశాడు. 1987-88 సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ చైర్మన్‌గా పనిచేశాడు. 1994-95 సంవత్సరంలో సిక్కిం గవర్నర్‌గా, 1995-96 వరకు కేరళ గవర్నర్‌గా పనిచేశాడు. 1998లో తెనాలి లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకువచ్చి 2008లో చిరంజీవి ఏర్పాటుచేసిన ప్రజారాజ్యం పార్టీ పార్టీలో చేరి, కొంతకాలం పనిచేశాడు.[3][4] శివశంకర్ కుమారుడు, ప్రముఖ వైద్యులు పి. వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ ఇన్ ఛార్జ్ గా ఉన్నాడు.

మరణంసవరించు

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివశంకర్ 2017, ఫిబ్రవరి 27 ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 52లోని తన స్వగృహంలో తుడి శ్వాస విడిచాడు.[5]

మూలాలుసవరించు

  1. ఆంధ్రజ్యోతి, నవ్య - ఓపెన్ పేజి (1 January 2018). "అప్పుడు విద్యార్థిని.. ఇప్పుడు రిజిస్ట్రార్‌ని." వెంకటేశ్‌. మూలం నుండి 14 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 14 May 2019. Cite news requires |newspaper= (help)
  2. భారత్ టుడే. "న్యాయవాది వృత్తి నుంచి రాజకీయాల్లోకి…". /www.bhaarattoday.com. Retrieved 27 February 2017.[permanent dead link]
  3. తెలుగు వెబ్ దునియా. "పీఆర్పీ తీర్థం పుచ్చుకున్న శివశంకర్". telugu.webdunia.com. Retrieved 27 February 2017.
  4. తెలుగు వన్ ఇండియా. "15న చిడు పార్టీలో శివశంకర్". telugu.oneindia.com. Retrieved 27 February 2017.
  5. తెలంగాణ హెడ్ లైన్స్. "కాంగ్రెస్ సీనియర్ నేత పి.శివశంకర్ మృతి". telanganaheadlines.in. మూలం నుండి 27 ఫిబ్రవరి 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 27 February 2017.

ఇతర లంకెలుసవరించు