పి.సి.శ్రీరామ్
పి.సి.శ్రీరామ్ (జననం 1956 జనవరి 26) భారతీయ సినిమాటోగ్రాఫర్, చిత్ర దర్శకుడు. అతను డిజిటల్ సినిమా టెక్నాలజీ కంపెనీ అయిన క్యూబ్ సినిమాస్‌కి ప్రెసిడెంట్ కూడా. అతను మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పూర్వ విద్యార్థి. సినిమాటోగ్రాఫర్‌గా పని చేయడంతో పాటు పి.సి.శ్రీరామ్ తన దర్శకత్వం వహించిన కురుతిపునల్‌కు దేశంలోనే కాక అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాడు. భారతదేశం 1996లో ఈ చిత్రం ఆస్కార్‌కి అధికారిక ఎంట్రీగా సమర్పించింది. భరతన్, మణిరత్నం, ఆర్ బాల్కీ, విక్రమ్ కుమార్‌లతో తను మంచి అనుబంధం కలిగి ఉన్నాడు. మగన్, మౌన రాగం, నాయకన్, చీనీ కమ్, అగ్ని నక్షత్రం, పా, గీతాంజలి, అలైపాయుతే, నేను, ప్యాడ్మాన్, ఓ కాదల్ కన్మణి, తిరుడా తిరుడా, ఇష్క్, రెమో. తేవర్ వంటి చిత్రాలలో చేసిన పనికి పి.సి.శ్రీరామ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇలా పి.సి.శ్రీరామ్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో 30 చిత్రాలకు పైగా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. మూడు సినిమాలతో పాటు కొన్ని టీవీ వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించాడు. ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ (ISC) వ్యవస్థాపక సభ్యులలో ఆయన కూడా ఒకరు.
పి.సి.శ్రీరామ్ | |
---|---|
జననం | చెన్నై, భారతదేశం | 1956 జనవరి 26
ఇతర పేర్లు | పి.సి. |
విద్యాసంస్థ | మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ |
వృత్తి | సినిమాటోగ్రాఫర్, చిత్ర దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1982 - ఇప్పటి వరకు |
పిల్లలు | 2 |
బంధువులు | పి. ఆర్. సుందరం అయ్యర్ (తాత)[1] ప్రీతా జయరామన్ (మేనకోడలు) |
పురస్కారాలు | నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రఫీ (1987) |
ప్రారంభ జీవితం, కుటుంబం
మార్చు1956 జనవరి 26న మద్రాసు (ప్రస్తుతం చెన్నై)లో పి.సి.శ్రీరామ్ జన్మించాడు. అక్కడే మైలాపూర్‌లోని విద్యా మందిర్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నాడు. తనకు చిన్ననాటి నుంచే సినిమాల పట్ల ఆసక్తి ఎక్కువ.[2] అతను సినిమాటోగ్రఫీలో కోర్సును అభ్యసించడానికి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో చేరాడు.[2][3][4] కమల్ హాసన్, సి. రుద్రయ్య, సంతాన భారతి, రాధారవి, ఆర్.సి. శక్తి, మణిరత్నం.. మరికొంత మందితో కూడిన సామ్‌కో (Samco) బృందం తరచూ కలుసుకునేవారు.
ఫిల్మోగ్రఫీ
మార్చుసినిమాటోగ్రాఫర్గా
మార్చుYear | Film | Notes |
---|---|---|
1981 | వా ఇంధ పక్కం | తొలి తమిళ చిత్రం |
1982 | ఓరు వరిసు ఉరువగిరదు | |
1982 | నంద్రి, మీఁడుఁ వరుగ | |
1985 | మీండుమ్ ఒరు కాతల్ కథై | |
1985 | కూడం తేది | తొలి మలయాళ చిత్రం |
1985 | పూవే పూచూడ వా | |
1986 | మౌన రాగం | |
1986 | నీ తానా అంతా కుయిల్ | |
1987 | నాయకన్ | |
1988 | అగ్ని నక్షత్రం | |
1989 | అపూర్వ సగోధరార్గల్ | |
1989 | గీతాంజలి | తొలి తెలుగు సినిమా |
1990 | ఇధయ తామరై | |
1991 | గోపుర వాసలిలే | |
1992 | అమరన్ | |
1992 | తేవర్ మగన్ | |
1993 | తిరుడా తిరుడా | |
1994 | మే మేడం | |
1995 | శుభ సంకల్పం | తెలుగు సినిమా |
1998 | శాంతి శాంతి శాంతి | తొలి కన్నడ చిత్రం |
1999 | ముగం | |
1999 | కధలర్ ధీనం | |
2000 | ముగావారే | |
2000 | అలైపాయుతే | |
2001 | కుషీ | తెలుగు సినిమా |
2005 | కంద నాల్ ముదల్ | |
2006 | వరాలారు | ఒక పాట |
2007 | చీని కం | హిందీ సినిమా |
2008 | ధామ్ ధూమ్ | |
2009 | 13B | హిందీ సినిమా |
2009 | యవరుం నలం | |
2009 | పా | హిందీ సినిమా |
2012 | ఇష్క్ | తెలుగు సినిమా |
2015 | I | |
2015 | షమితాబ్ | హిందీ సినిమా |
2015 | ఓ కాదల్ కన్మణి | |
2016 | కి & కా | హిందీ సినిమా |
2016 | రెమో | |
2018 | ప్యాడ్ మ్యాన్ | హిందీ సినిమా |
2018 | నా... నువ్వే | తెలుగు సినిమా |
2018 | ప్రాణ | మలయాళ చిత్రం[5] |
2020 | సైకో | |
2020 | పుతం పుదు కాళై | |
2021 | నవరస | నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ |
2021 | రంగ్ దే | తెలుగు సినిమా |
2022 | థ్యాంక్యూ | తెలుగు సినిమా |
దర్శకుడిగా
మార్చుYear | Film | Notes |
---|---|---|
1992 | మీరా | దర్శకుడిగా తొలి సినిమా |
1995 | కురుతిపునల్ | |
2004 | వనం వాసప్పడుం |
అవార్డులు
మార్చుసంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం | |
---|---|---|---|---|
1987 | నాయకన్ | నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రఫీ | గెలుపు | |
1990 | గీతాంజలి (1989 చిత్రం) | ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా నంది అవార్డు | గెలుపు | |
2000 | అలైపాయుతే | ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - సౌత్ | గెలుపు | [6] |
2006 | వరలారు | విజయ్ అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ (స్పెషల్ జ్యూరీ) | గెలుపు | [7] |
2013 | ఇష్క్ (2012 చిత్రం) | సినిమా అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ | గెలుపు | |
2013 | CineMAA అవార్డు లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్ | గెలుపు | [8] | |
2013 | ఇష్క్ (2012 చిత్రం) | SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ (తెలుగు) | ప్రతిపాదించబడింది |
మూలాలు
మార్చు- ↑ S., Muthiah (15 May 2006). "Helping green Madras". The Hindu. Retrieved 15 May 2015.
- ↑ 2.0 2.1 Pain, Paromita (28 February 2004). "Beyond the future". The Hindu. Archived from the original on 30 December 2004. Retrieved 12 August 2012.
- ↑ "P C Sreeram – He can make pictures look real, pretty, stark". Sify. Archived from the original on 28 April 2014. Retrieved 12 August 2012.
- ↑ "P. C. Sriram" (PDF). cameraworking.raqsmediacollective. Archived from the original (PDF) on 2 డిసెంబరు 2012. Retrieved 15 August 2012.
- ↑ R, Manoj Kumar (20 February 2018). "Nithya Menen's Praana is a one-actor movie made in four languages". The Indian Express. Retrieved 16 September 2018.
- ↑ "Archived copy". Archived from the original on 6 September 2004. Retrieved 11 June 2020.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Winners: Reliance Mobile Vijay Awards 2006". starboxoffice.com. Archived from the original on 26 July 2008. Retrieved 15 March 2014.
{{cite web}}
: CS1 maint: unfit URL (link) - ↑ "CineMAA Awards 2013 Winners". Idlebrain.com. 16 June 2013. Archived from the original on 15 November 2017. Retrieved 11 June 2020.