ప్రధాన మెనూను తెరువు

గీతాంజలి (1989 సినిమా)

1989 తెలుగు సినిమా

గీతాంజలి , 19 మే 1989 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇది. అక్కినేని నాగార్జున, గిరిజ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం ఇళయరాజా సమకూర్చారు. ఈ చిత్రం తమిళం మరియు మలయాళం భాషలలోకి కూడా అనువదించబడింది. చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి.

గీతాంజలి
(1989 తెలుగు సినిమా)
Geetanjali film.jpg
దర్శకత్వం మణిరత్నం
నిర్మాణం నరసారెడ్డి
కథ మణిరత్నం
తారాగణం అక్కినేని నాగార్జున (ప్రకాష్),
గిరిజ (గీతాంజలి),
విజయకుమార్,
షావుకారు జానకి (ఛాన్సలర్),
ముచ్చెర్ల అరుణ (డాక్టర్),
రాధాబాయి,
డిస్కో శాంతి,
సిల్క్ స్మిత,
సుమిత్ర,
విజయచందర్
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం బాలు,
ఎస్. జానకి
సంభాషణలు రాజశ్రీ
ఛాయాగ్రహణం పి.సి.శ్రీరాం
నిర్మాణ సంస్థ భాగ్యలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

చిత్ర కథానాయకుడు ప్రకాష్ (అక్కినేని నాగార్జున) పరిచయంతో కథ మొదలవుతుంది. ప్రకాష్ ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరిగే యువకుడు. కాలేజీ లో చదువుతుంటాడు. అయితే అతనికి ప్రాణాంతకమైన వ్యాధి ఒకటి ఉంది అని తెలుస్తుంది. విరక్తి చెందిన ప్రకాష్ అన్నింటినీ వదిలేసి ఊటీ వెళ్ళిపొతాడు. అక్కడ అతనికి గీతాంజలి (గిరిజ) పరిచయం అవుతుంది. గీతాంజలి తండ్రి ఊటీ లో పెద్ద వైద్యుడు. గీతంజలి చాలా చురుకైన అమ్మాయి. ఎప్పుడూ అందరిని ఆటపట్టిస్తూ, నవ్వుతూ ఉంటుంది. అయితే ఆమె కూడా ఒక వ్యాధి తో బాధ పడుతుంది. అయితే ప్రకాష్ కు భిన్నంగా వ్యాధి గురించి ఎక్కువగా ఆలొచించకుండా జీవితాన్ని చలాకీగా గడుపుతుంది. ప్రకాష్, గీతంజలి ల మధ్య పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. కానీ ప్రకాష్‌కి వ్యాధి ఉన్న విషయం గీతాంజలికి తెలియదు.

కథ అభివృద్ధి మరియు చిత్రీకరణసవరించు

 
"గీతాంజలి" సినిమా విజయాన్ని పురస్కరించుకొని అభిమానులు ఇచ్చిన ప్రకటన

"యంగ్ డై ఫస్ట్" అనే అంగ్ల చిత్రాన్ని చూసి ప్రేరణ పొందిన దర్శకుడు మణిరత్నం అదే తరహాలో ఈ కథ రాసుకున్నాడు.[1] కథానాయిక పేరు గీతాంజలి ఢిల్లీ కి చెందిన 11 సంవత్సరాల బాలిక పేరు. త్వరలో చనిపోనున్నాని తెలిసి ఆమె రాసుకున్న డైరీలు ఒక పత్రికలో ప్రచురితం అయ్యాయి. అవి చూసి చలించిన దర్శకుడు కథకు అదే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. 12అక్టోబర్,1988 నాడు చిత్రీకరణ మొదలయింది. చిత్రీకరణ మొత్తం 60 రోజుల్లో పూర్తి అయింది. గిరిజ పాత్రకు ఎస్.పి.శైలజ, గిరిజ నానమ్మ పాత్రకు జానకి పాటలు పాడారు.

పాటలుసవరించు

గీతాంజలి :
The Original Motion Picture Soundtrack
ఇళయరాజా స్వరపరచిన Soundtrack
విడుదల1989
సంగీత ప్రక్రియSoundtrack
నిర్మాతఇళయరాజా

అన్ని పాటల రచయిత వేటూరి, ఈ చిత్రం లోని అన్ని పాటలు స్వరపరిచి సంగీతము అందించినది ఇళయరాజా.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "జగడ జగడ జగడం"  బాలు  
2. "జల్లంత కవ్వింత కావాలి లే"  చిత్ర  
3. "ఆమనీ పాడవే"  బాలు  
4. "నందికొండ వాగుల్లో"  బాలు, చిత్ర  
5. "ఓం నమః"  బాలు, ఎస్. జానకి  
6. "ఓ పాపా లాలీ"  బాలు  
7. "ఓ ప్రియా ప్రియా"  బాలు, చిత్ర  

చిత్ర గొప్పదనంసవరించు

ఈ చిత్రం విడుదల నాగార్జున యొక్క మరొక అపూర్వ విజయం సాధించిన శివ చిత్రం విడుదలకు ఆరునెలల ముందు జరిగినది. రెండు చిత్రాల కథలలో వ్యత్యాసం, చిత్రీకరించిన విధానము తెలుగు సినిమాకు నూతనముగా ఉండటము చేత గొప్ప విజయాలుగా నిలిచాయి. ఈ చిత్ర విడుదల తరువాత నాగార్జున ఆంధ్ర అందగాడుగా కీర్తిగాంచాడు. ఎందరో అమ్మాయిల మనస్సు దోచుకున్న మన్మధునిగా నాగార్జున నిలిచిపోయారు. ఈ చిత్రము నుండి నాగార్జునకు కొత్తదనాన్ని అభిలషించే వ్యక్తిగా ప్రశంసలు పొందారు.

మూలాలుసవరించు