ఇష్క్ 2012, ఫిబ్రవరి 24న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్ గౌడ్, సుధాకర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో విక్రం కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, నిత్య మీనన్ ప్రధాన పాత్రలు పోషించగా, అనూప్ రూబెన్స్, అరవింద్ శంకర్ సంగీతం అందించారు. ఈ చిత్రం 2012లో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నంది అవార్డు అందుకుంది.

ఇష్క్
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం విక్రమ్ కే కుమార్
నిర్మాణం విక్రమ్ గౌడ్
సుధాకర్ రెడ్డి
కథ విక్రమ్ కే కుమార్
చిత్రానువాదం విక్రమ్ కే కుమార్
తారాగణం నితిన్
నిత్య మీనన్
అజయ్
శ్రీనివాస రెడ్డి
సంగీతం అనూప్ రూబెన్స్
అరవింద్ శంకర్
సంభాషణలు ఆర్. సామల
ఛాయాగ్రహణం పి.సి.శ్రీరామ్
కూర్పు అక్కినేని శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్
పంపిణీ మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి.
అవార్డులు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం (నంది అవార్డు 2012)
భాష తెలుగు
పెట్టుబడి ₹7.8 కోట్లు (US$1.1 మిలియన్)
వసూళ్లు ₹28.02 కోట్లు (US$3.9 మిలియన్)

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
ఇష్క్
పాటలు by
Released2 ఫిబ్రవరి 2012
Recorded2012
Genreసినిమా పాటలు
Length24.55
Languageతెలుగు
Labelఆదిత్యా మ్యూజిక్
Producerఅనూప్ రూబెన్స్

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అరవింద్ శంకర్ సంగీతం అందించారు.[2] 2012, ఫిబ్రవరి 22న ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. పాటల విడుదల కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వచ్చాడు.[3] కృష్ణచైతన్య నాలుగు పాటలు, అనంత శ్రీరామ్ రెండు పాటలు రాశారు. నితిన్, నిత్యా మీనన్ కూడా పాటలు పాడారు. సినిమా ప్రచారంకోసం ఇంటర్నెట్ లో విడుదలచేసిన "లచ్చమ్మ" పాటకు మంచి స్పందన వచ్చింది.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "లచ్చమ్మ (రచన: నితిన్, కృష్ణ చైతన్య)"  అనూప్ రూబెన్స్, నితిన్, తాగుబోతు రమేష్, మురళి 03:45
2. "ఓ ప్రియా ప్రియా (రచన: కృష్ణ చైతన్య)"  అద్నాన్ సమీ, నిత్యా మీనన్ 04:22
3. "సూటిగా చూడకు (రచన: అనంత శ్రీరాం)"  హరిహరన్, సైంధవి 05:05
4. "చిన్నాదనా నీకోసం (రచన: కృష్ణ చైతన్య)"  రాజ్ హాసన్, అనూప్ రూబెన్స్, శ్రావణి 03:42
5. "ఏదో ఏదో (రచన: అనంత శ్రీరాం)"  ప్రదీప్ విజయ్, కళ్యాణి నాయర్ 04:32
6. "లచ్చమ్మ రిమిక్స్ (రచన: నితిన్, కృష్ణ చైతన్య)"  అనూప్ రూబెన్స్, నితిన్, తాగుబోతు రమేష్, మురళి 03:29
24.55

స్పందన

మార్చు

ఈ చిత్రం అభిమానులు, విమర్శకుల నుండి మంచి స్పందనను పొందింది. నితిన్ కెరీర్‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం 2012 ఏప్రిల్ 13 నాటికి 50 రోజులు, 2012 జూన్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ లోని 11 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. 123తెలుగు, కొన్ని ఇతర సినిమా వైబ్సైట్లు ఇష్క్ మూవీని అరుదైన ఘనత సాధించిన చిత్రంగా ప్రశంసించాయి. చిత్ర విజయం గురించి నితిన్ కూడా ట్వీట్ చేశాడు.[4]

పురస్కారాలు

మార్చు
  1. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలులో ఉత్తమ కుటుంబ కథా చిత్రం, ఉత్తమ సహాయ నటుడు (అజయ్) విభాగంలో అవార్డులు వచ్చాయి.[5][6][7][8]
పురస్కారం విభాగం గ్రహీత ఫలితం
2012 నంది పురస్కారాలు[9] ఉత్తమ కుటుంబ కథా చిత్రం సుధాకర్ రెడ్డి గెలుపు
ఉత్తమ సహాయనటుడు అజయ్ గెలుపు
2వ దక్షణభారత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ చిత్రం విక్రమ్ గౌడ్ ప్రతిపాదించబడింది
ఉత్తమ దర్శకుడు విక్రమ్ కుమార్ ప్రతిపాదించబడింది
ఉత్తమ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ప్రతిపాదించబడింది
ఉత్తమ సహాయ నటుడు అజయ్ ప్రతిపాదించబడింది
ఉత్తమ సహాయ నటి సింధు తులానీ ప్రతిపాదించబడింది
ఉత్తమ హాస్యనటుడు ఆలీ ప్రతిపాదించబడింది

మూలాలు

మార్చు
  1. "ఇష్క్ సినిమా సమీక్ష". movies.fullhyderabad.com. Archived from the original on 18 June 2017. Retrieved 15 November 2016.
  2. http://www.idlebrain.com/news/2000march20/chitchat-aravindshankar.html
  3. "Ishq Audio Launch". idlebrain. Retrieved 17 August 2020.
  4. "Ishq completes 100 days". 123telugu.com. Retrieved 17 August 2020.
  5. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 30 June 2020.
  6. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
  7. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
  8. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
  9. Upadhyaya, Prakash (1 March 2017). "Nandi Awards 2012-2013: Here is the complete list of winners". International Business Times India. Archived from the original on 2 March 2017. Retrieved 17 August 2020.

ఇతర లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఇష్క్&oldid=4364382" నుండి వెలికితీశారు