ఎంజీఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్

భారతీయ సినిమా, టెలివిజన్ శిక్షణా కేంద్రం

ఎమ్.జి.ఆర్. గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, ఇది ఆసియాలో మొట్టమొదటి సినిమా, టెలివిజన్ శిక్షణా సంస్థ. 1945లో అడయార్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌గా స్థాపించబడింది. చెన్నైలోని తారామణిలో ఉన్న ఇది భారతదేశంలోని అగ్రగామి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటి.[1] దీనిని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.[2]

మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్
రకంఫిల్మ్ స్కూల్
స్థాపితం1945; 79 సంవత్సరాల క్రితం (1945)
విద్యాసంబంధ affiliations
ది తమిళనాడు డా. జె. జయలలిత మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ
అధ్యక్షుడురాజేష్
స్థానంసి.ఐ.టి. క్యాంపస్, తారామణి, చెన్నై – 600113, తమిళనాడు, భారతదేశం
కాంపస్పట్టణ

కోర్సులు

మార్చు

ఇది నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను అందిస్తుంది.

  • బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ (సినిమాటోగ్రఫీ)
  • బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ (డిజిటల్ ఇంటర్మీడియట్)
  • బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ (ఆడియోగ్రఫీ)
  • బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ (దర్శకత్వం, స్క్రీన్ ప్లే రైటింగ్)
  • బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ (ఫిల్మ్ ఎడిటింగ్)
  • బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్)

క్యాంపస్

మార్చు

స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, సౌండ్ రికార్డింగ్, సౌండ్ ఇంజినీరింగ్, ఫిల్మ్ ఎడిటింగ్, ఫిల్మ్ ప్రాసెసింగ్ తదితర విభాగాలకు చెందిన ఒక్కో కోర్సులో 14 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.

ఇక్కడ అందించే డిప్లొమాలను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆమోదించింది, అయితే సర్టిఫికేట్‌లను తమిళనాడు ప్రభుత్వంలోని సాంకేతిక విద్యా శాఖ ప్రదానం చేస్తుంది.[3][4]

నిర్వహణ

మార్చు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ సెప్టెంబరు 2022లో నటుడు రాజేష్‌ను ఇన్‌స్టిట్యూట్ హెడ్‌గా నియమించాడు.

చరిత్ర

మార్చు

ఈ సంస్థ 1945లో సెంట్రల్ పాలిటెక్నిక్‌లో భాగంగా అడయార్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌గా స్థాపించబడింది. 1965లో, ఇది మద్రాస్‌(చెన్నై)లోని తారామణి ప్రాంతంలో ప్రస్తుత క్యాంపస్‌లోకి మారింది. ఆ సమయంలో, క్యాంపస్ 54 ఎకరాలలో విస్తరించి ఉండగా ప్రస్తుతం పట్టణీకరణ కారణంగా తగ్గింది. మద్రాస్‌లోని ఐఐటీకి, అనేక ఐటీ కంపెనీలకు భూములు కేటాయించడంతో ఇప్పుడున్న 10 ఎకరాలకు మిగిలింది.

దేశంలోనే పూర్తి స్థాయి ఫిల్మ్ సిటీని 1994 ఆగస్టు 31న అప్పటి ముఖ్యమంత్రి దివంగత జె. జయలలిత ప్రారంభించింది. ఫిల్మ్ సిటీ దాని 21 కోట్ల రూపాయల విలువైన సమగ్ర మౌలిక సదుపాయాలతో సినిమా నిర్మాణంనకు అవసరమైన అన్ని హంగులు ఉన్నాయి.

ఎం.జి.ఆర్. ఫిల్మ్ సిటీ తారామణిలో ఉంది. ఇది సమాచారం, ప్రజా సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న భారతీయ చలనచిత్రం, టీవీ శిక్షణా సంస్థ. దీనికి కొంత కాలం జయలలిత ఫిల్మ్ సిటీ అని పేరు పెట్టారు. ఆ తరువాత 2006లో, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎం. జి. రామచంద్రన్ పేరు మీదుగా దీనికి ఎం.జి.ఆర్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ గా నామకరణం చేసారు.[5] 1994లో, నగరంలో మరిన్ని సినిమా నిర్మాణ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఎంజీఆర్ ఫిల్మ్ సిటీని ప్రారంభించింది. 1997 అక్టోబరు 16న క్వీన్ ఎలిజబెత్ II ఎంజీఆర్ ఫిల్మ్ సిటీని సందర్శించింది.[6] 1971లో ఎం.జి.ఆర్‌ కోరిక మేరకు ప్రారంభమైన యాక్టింగ్‌ కోర్సు 2002లో నిలిపివేయబడింది.[7] ఈ కోర్సును పునరుద్ధరించాలనే చర్చ చాలా ఏళ్లుగా సాగుతోంది.[8]

పూర్వ విద్యార్థులు

మార్చు
సంవత్సరం పేరు విభాగం
కె. ఎస్. ప్రసాద్ సినిమాటోగ్రాఫర్
మంకాడ రవివర్మ సినిమాటోగ్రాఫర్
1968 అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్
పి. ఎస్. నివాస్ సినిమాటోగ్రాఫర్
1972 కీయార్ చిత్ర దర్శకుడు
ఆబవనన్ చిత్ర దర్శకుడు
ఆర్వీ. ఉదయకుమార్ చిత్ర దర్శకుడు
1973 రజనీకాంత్ నటుడు
జి.వి.నారాయణరావు నటుడు
మోహన్ బాబు నటుడు
కె. నటరాజ్ నటుడు
రాంకీ నటుడు
సి. రుద్రయ్య స్క్రీన్ రైటర్, సినిమా దర్శకుడు
కె. రాజేశ్వర్ స్క్రీన్ రైటర్, సినిమా దర్శకుడు
1974 జోస్ నటుడు
1976 రాజేంద్ర ప్రసాద్ నటుడు
సుజాత విజయ్‌కుమార్ నిర్మాత
చక్రపాణి నటుడు
1977 సుధాకర్ నటుడు
చిరంజీవి నటుడు
నాజర్ నటుడు
1978 శ్రీనివాసన్ నటుడు
1979 పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్
1981 సుహాసిని మణిరత్నం సినిమాటోగ్రాఫర్
1980 రఘువరన్ నటుడు
1983 అర్చన నటి
యుగి సేతు చిత్ర దర్శకుడు
ఆర్. వి. ఉదయకుమార్ చిత్ర దర్శకుడు
1984 రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్
జి పి కృష్ణ సినిమాటోగ్రాఫర్
అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్
వి.మణికందన్ సినిమాటోగ్రాఫర్
బూపతి పాండియన్ దర్శకుడు
శక్తి శరవణన్ సినిమాటోగ్రాఫర్
1986 ఆనందరాజ్ నటుడు
శివ రాజ్‌కుమార్ నటుడు
ఎస్. శరవణన్ సినిమాటోగ్రాఫర్
ఎం. వి. పన్నీర్ సెల్వం సినిమాటోగ్రాఫర్
1987 రవీంద్రన్ నటుడు
కుమార్ బంగారప్ప నటుడు
అజయన్ సినిమాటోగ్రాఫర్
ఎన్ హరికుమార్ సౌండ్ ఎడిటర్
యు.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్
జీవా సినిమాటోగ్రాఫర్
ఎస్. శరవణన్ సినిమాటోగ్రాఫర్
ఎం. వి. పన్నీర్ సెల్వం సినిమాటోగ్రాఫర్
ఎస్.డి. విజయ్ మిల్టన్ సినిమాటోగ్రాఫర్
ఆర్. రత్నవేలు సినిమాటోగ్రాఫర్
1990 శరవణన్ నటుడు
1993 ఇ. ఎజిల్బాబు సినిమాటోగ్రాఫర్, కెమెరామెన్, ఇస్రో, అహ్మదాబాద్
ఆల్బర్ట్ ఆంటోని చిత్ర దర్శకుడు
వైది ఎస్. సినిమాటోగ్రాఫర్
ఆర్. దివాకరన్ సినిమాటోగ్రాఫర్
పి.వి. సునీల్‌కుమార్ సినిమాటోగ్రాఫర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇస్రో
1996 చంద్రు మాణికవాసగం రచయిత, సినిమా దర్శకుడు
ఆర్. టి. నీసన్ దర్శకుడు
1997 ఎన్. కె. ఏకాంబరం సినిమాటోగ్రాఫర్
1998 జె. శివకుమార్ దర్శకుడు
వెట్రి సినిమాటోగ్రాఫర్
నందా దురైరాజ్ నటుడు
1999 మోహన్ రాజా చిత్ర దర్శకుడు
బొమ్మరిల్లు భాస్కర్ చిత్ర దర్శకుడు
అళగం పెరుమాళ్ దర్శకుడు, నటుడు
పి. ఎస్. వినోద్ సినిమాటోగ్రాఫర్
అరివళగన్ వెంకటాచలం దర్శకుడు
ఎం. అన్బళగన్ దర్శకుడు
2000 నరైన్ సినిమాటోగ్రాఫర్
ఇ.కృష్ణసామి సినిమాటోగ్రాఫర్
2001 మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్
2002 జ్ఞానం సుబ్రమణియన్ సినిమాటోగ్రాఫర్
2004 అరుళ్ శక్తి జయం నీటి అడుగున DOP/ సినిమాటోగ్రాఫర్
2005 మహేష్ నారాయణన్ సినిమా ఎడిటర్, స్క్రీన్ ప్లే రైటర్
మనుష్ నందన్ సినిమాటోగ్రాఫర్
2006 విష్ణు గోవింద్ సౌండ్ ఇంజనీర్, సౌండ్ డిజైనర్
విజయ్ ఉలగనాథ్ సినిమాటోగ్రాఫర్
2008 దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రాఫర్
2009 సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్
2011 రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్
శ్రీహరి నటుడు
బక్కియరాజ్ కన్నన్ దర్శకుడు
2012 గోపీ కృష్ణ ఎడిటర్
2014 జె. ధర్మేంద్ర టెలివిజన్ ప్రెజెంటర్, నటుడు
2016 కవిన్ రాజ్ సినిమాటోగ్రాఫర్
2019 సూర్య ప్రధమన్ ఎడిటర్

మూలాలు

మార్చు
  1. One among the Pioneer film institutes Archived 2013-03-19 at the Wayback Machine
  2. "Courses Offered". Archived from the original on 2013-02-07. Retrieved 2023-09-25.
  3. "Courses Offered". Archived from the original on 2013-02-07. Retrieved 2023-09-25.
  4. "CAREER GUIDE: Shooting for the stars". The Hindu. 1 November 2010. Archived from the original on 8 November 2010. Retrieved 22 February 2013.
  5. "Modernisation of Government printing presses under way: Minister". The Hindu. 29 August 2006. Archived from the original on 13 November 2007. Retrieved 22 February 2013.
  6. Queen Elizabeth's Visit to MGR Film City Archived 2003-12-31 at the Wayback Machine
  7. "MGR Film and TV Institute losing land to urbanisation". The Times of India. 12 June 2009. Archived from the original on 11 April 2013. Retrieved 22 February 2013.
  8. "New dreams for MGR Film Institute". The Hindu. 5 July 2009. Archived from the original on 9 July 2009. Retrieved 22 February 2013.