పి. నిరూప్ రెడ్డి

పి. నిరూప్‌ రెడ్డి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2021 డిసెంబరున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యాడు.[1][2]

పి. నిరూప్‌ రెడ్డి

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
11 డిసెంబర్ 2021
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1 అక్టోబరు 1959
మారేపల్లి గ్రామం, కొండాపూర్‌ మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జీవిత భాగస్వామి మీరా రెడ్డి
పూర్వ విద్యార్థి ఢిల్లీ విశ్వవిద్యాలయం

జననం, విద్యాభాస్యం

మార్చు

పి.నిరూప్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, కొండాపూర్‌ మండలం, మారేపల్లి గ్రామంలో 1959 అక్టోబరు 1లో జన్మించాడు. ఆయన తండ్రి పి. రామచంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్థన్‌ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశాడు.

క్లాస్ స్కూల్ / కాలేజీ ప్రదేశం సంవత్సరం
1 – 5వ తరగతి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ గన్ ఫౌండ్రి, హైదరాబాద్ 1962 - 1967
5 – 10 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట, హైదరాబాద్ 1967– 1974
ఇంటర్మీడియట్ న్యూ సైన్స్ జూనియర్ కాలేజీ నారాయణగూడ, హైదరాబాద్ 1974–76
డిగ్రీ నిజాం కాలేజ్ బషీర్‌బాగ్, హైదరాబాద్ 1988–89
ఎంఏ జవహర్ లాల్ యూనివర్సిటీ ఢిల్లీ 1980– 81
ఎల్.ఎల్.బి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ 1982–85

వృత్తి జీవితం

మార్చు

పి.నిరూప్‌ రెడ్డి న్యాయవిద్య పూర్తి చేసిన అనంతరం 1985లో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని సంగారెడ్డిలోని మున్సిఫ్‌ కోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఆయన సీనియర్‌ న్యాయవాది వీఆర్‌ రెడ్డి, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ గోపాల సుబ్రమణ్యం దగ్గర జూనియర్‌గా ప్రాక్టీస్‌ చేశాడు. నిరూప్‌ రెడ్డి రాజ్యాంగపరమైన కేసులతోపాటు ఇంటర్నేషనల్‌ లా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లా, భూములు, వ్యవసాయ చట్టాలకు సంబంధించిన కేసులను వాదించాడు.

పి.నిరూప్‌ రెడ్డి 2013-2018 మధ్యకాలంలో గోవా, ఢిల్లీ రాష్ట్రాల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాడు. ఆయన 2017 నుండి 2018కి ఢిల్లీలోని మేఘాలయ, షిల్లాంగ్ రాష్ట్రానికి 2013 నుండి 2016 సంవత్సరాల్లో సుప్రీంకోర్టులో గోవా, ఢిల్లీలోని ఇతర ఫోరంలకు సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌ మెంబర్‌గా, అదనపు అడ్వకేట్ జనరల్‌గా ప్రాతినిధ్యం వహించాడు. ఆయనను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా 2021 డిసెంబరు 8న సుప్రీంకోర్టు ఫుల్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. నిరూప్‌ రెడ్డి తెలంగాణ నుంచి సుప్రీంకోర్టు ఎంపిక చేసిన మొట్ట మొదటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితుడయ్యాడు.[3][4]

రాజకీయ జీవితం

మార్చు

పి.నిరూప్‌ రెడ్డి 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

మూలాలు

మార్చు
  1. Mana Telangana (11 December 2021). "సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నిరూప్‌రెడ్డి నియామకం". Archived from the original on 16 December 2021. Retrieved 16 December 2021.
  2. NTV (12 December 2021). "సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాదిగా నిరూప్‌ నియామకం". Archived from the original on 2021-12-12. Retrieved 16 December 2021.
  3. TeluguTV9 Telugu (11 December 2021). "తెలంగాణ అడ్వకేట్‌కు అరుదైన గౌరవం.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నిరూప్‌ నియామకం". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (12 December 2021). "నిరూప్‌రెడ్డికి సీనియర్‌ న్యాయవాది హోదా". Archived from the original on 13 జనవరి 2022. Retrieved 13 January 2022.