ఋషి పులహస్త్య, రిషి పులహస్త్య లేదా పులహస్త్య లేదా' 'పులహస్త్య మహర్షి
విష్ణుమూర్తి నాభికమలము నుండి ఉద్భవించిన బ్రహ్మ తన సంకల్పము చేత సనక, సనందన, సనాతన, సనత్కుమారులను సృష్టించుట చేసెను. బ్రహ్మకు విశ్వమును సృజించ వలెనని చిరకాల వాంఛతో మహా తపస్సు చేసి వీరిని సృష్టించిననూ, సంసారమందు ధ్యాస లేక చిన్ననాటి నుండియే హరిపరతంత్రులైనారు. పిదప బ్రహ్మ తన వామభాగము నుండి స్వాయంభువ మనువును, శతరూప అను ఒక సుందరిని పుట్టించగా, వారికి సమస్త క్షత్రియులు జన్మించారు. తరువాత బ్రహ్మ తన నుదుటి నుండి ఏకాదశరుద్రులను సృజింపగా, వారందరూ విపరీత క్రోధామూర్తులు అయినారు. తదుపరి బ్రహ్మ నేత్రముల నుండి అత్రి మహర్షి, క్రతువు లను, బ్రహ్మ నాసికము నుండి అరుణి ని, బ్రహ్మ ముఖము నుండి అంగీరస మహర్షి, బ్రహ్మ తన దక్షిణ వామ పార్శ్వముల నుండి భృగు మహర్షిలను, బ్రహ్మ మెడ నుండి నారదుని సృష్టించి, బ్రహ్మ కుడి చెవి నుండి పులస్త్య మహర్షి, ఎడమ చెవి నుండి పులహ మహర్షిని పుట్టించడము జరిగింది.
కర్దమ ప్రజాపతి, దేవహుతి లకు తొమ్మిది మంది సంతానం. కర్దమ ప్రజాపతి బ్రహ్మ దేవుని ఆజ్ఞ చేత తన తొమ్మిది మంది కుమార్తె లను నవ బ్రహ్మలకు ఇచ్చి వివాహము చేయుటకు నిశ్చయించగా, వారిలో ఒకరు అయిన హవిర్భువును పులహస్త్య మహర్షి కిచ్చి కల్యాణము జరిపించారు.
పులహస్త్య మహర్షి సంసారమును వదలి సర్వ సంగ పరిత్యాగి అయి, తీవ్ర తపము చేయ వలెనన్న ఉద్దేశముతో తృణబిందు ఆశ్రమమునకు చేరుకొని, అక్కడ మహోగ్ర తపము చేయుట జరిగింది. తపము చేయు ఆ సమయములో మద యౌవనంలో ముద్దులు మూట కట్టుకున్న యువతులు విలాస హాసములతో విచ్చలవిడిగా ఆ ప్రదేశములో పులహస్త్య మహర్షికి తపోభంగము జరుగు విధముగా తిరుగు చుండగా, పులహస్త్య మహర్షి తన మనస్సు చలించు చుండగా, వెను వెంటనే వారిని ఉద్దేశించి, ఓ లీలావతులారా! ఇది మొదలు నా కంటబడిన ఏ స్త్రీ అయిననూ తన కన్యత్వము పోగొట్టుకొని వెంటనే గర్భము కలుగునని శపించుట జరిగి పోయింది. ఈ మాటలు విన్న చేఁపలవంటి కన్నులుగల ఆఁడువారు అచ్చట నున్న ప్రదేశము నుండి వెంటనే వదలి, వెడలి పోయారు.
Buck, William. Ramayana. Berkeley: University of California Press, 1976.
Dowson, John (1820-1881). A classical dictionary of Hindu mythology and religion, geography, history, and literature. London: Trübner, 1879 [Reprint, London: Routledge, 1979]. This book is in the public domain (and no copyright notice appears in the latest edition).