పూజ 1975లో విడుదలైన ఒక సంగీతప్రథమైన కుటుంబ కథా చిత్రం. రామకృష్ణ, వాణిశ్రీ, సావిత్రి, కన్నడ మంజుల, కాంతారావు, సూర్యకాంతం, మిక్కిలినేని మొదలైన వారు నటించారు. రేలంగి వెంకట్రామయ్య నటించిన చివరి చిత్రం ఇది.[1]

పూజ
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం మురగన్ కుమరన్
తారాగణం జి.రామకృష్ణ ,
వాణిశ్రీ,
కన్నడ మంజుల,
సావిత్రి,
కాంతారావు,
సూర్యకాంతం,
మిక్కిలినేని,
కృష్ణకుమారి,
రేలంగి,
అల్లు రామలింగయ్య,
కె.వి.చలం
సంగీతం రాజన్-నాగేంద్ర
గీతరచన దాశరథి,
కొసరాజు
సంభాషణలు ఎన్.ఆర్.నంది
నిర్మాణ సంస్థ ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్
భాష తెలుగు

చిత్రకథ

మార్చు
 
పూజ సినిమాలో ఒక సన్నివేశం

జి. రామకృష్ణ, మంజుల ప్రేమించుకుంటారు. వారి పెళ్ళి పెద్దలకి ఇష్టం లేక జరగదు. రామకృష్ణకు వాణిశ్రీకి వివాహమౌతుంది. ఆరతి పట్ల ప్రేమతో రామకృష్ణ, వాణిశ్రీతో సరిగా ఉండడు. కొంత కాలానికి రామకృష్ణ మంజులని కలుస్తాడు. అతనికి ఆశ్చర్యం కలిగేలా మంజుల ఏమీజరగనట్లు జీవిస్తుంటుంది. రామకృష్ణకు తను కోల్పోయిందేమిటో తెలిసి వాణిశ్రీని ఆదరిస్తాడు.

పాటలు

మార్చు
  1. పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను
    తీయరా తలుపులను రామా ఈయరా దరిశెనము రామా - (గాయకురాలు: వాణీ జయరాం; గీతరచన: దాశరథి)
  2. మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా
    తీగతెగిన హృదయవీణ తిరిగి పాటపాడునా - (గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం) - గీతరచన: దాశరథి
  3. నింగీ నేలా ఒకటయేనే (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం) - గీతరచన: దాశరథి
  4. ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ; ఎన్నటికీ మాయని మమత నీదీ నాదీ - (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం) - గీతరచన: దాశరథి
  5. నీ దయ రాదా రామ నీ దయ రాదా (గాయకురాలు: పి.సుశీల) - త్యాగరాజ కీర్తన
  6. అంతట నీ రూపం నన్నే చూడనీ ఆశలు పండించే నిన్నే చేరనీ - (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం) - గీతరచన: దాశరథి

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు

మార్చు