పూరి జిల్లా

ఒడిశా లోని జిల్లా

ఒడిషా రాష్ట్ర 39 జిల్లాలలో పూరీ (ఒడిషా) జిల్లా ఒకటి. ఈ జిల్లా చారిత్రాత్మకంగా, మతపరంగా, పురాతన నిర్మాణశైలికి, సముద్రతీర సౌందర్యానికి, ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రత్యేకత కలిగి ఉంది. ఈ నగరం పలు పర్యాటక ఆకర్షణలను స్వంతంచేసుకుని ఉంది. క్రీ.పూ. 3వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతం చారిత్రక వైభవం కలిగి ఉందని ఇక్కడి ప్రజలు సగర్వంగా చెప్పుకుంటున్నారు. జిల్లాలోని పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్‌లోని సూర్యదేవ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి కలిగి ఉన్నాయి. జిల్లాలో ఉన్న చిల్కా సరస్సు భారత్‌లోని అతి పెద్ద ఉప్పునీటి సరసుగా గుర్తించబడుతుంది. ఈ సరోవర సహజ సౌందర్యం పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తూ ఉంది. పూరీ జిల్లా వాతావరణం సంవత్సరం అంతా సమానంగా ఉంటుంది. అనుకూల వాతావరణం కారణంగా ఈ సరోవరానికి ఖండాంతరాల నుండి పక్షులు వలస వచ్చి ఇక్కడ కొంతకాలం నివసించి పోతుంటాయి. ఇక్కడ పక్షులు నివసించడానికి వాటికి అనుకూలమైన నివాస పరిస్థితులు కల్పించబడ్డాయి.జిల్లాలో 1714 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో పూరి సాదర్ అనే ఒక ఉపవిభాగం, 11 మండలాలు, ఒక పురపాలకం (పూరీ) ఉన్నాయి.

పూరి జిల్లా
జిల్లా
పూరిలో జగన్నాథాలయం
పూరిలో జగన్నాథాలయం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిశా
ప్రధాన కార్యాలయంపూరి (ఒడిశా)
Government
 • కలెక్టరుDhiren Kumar Pattnaik
 • Members of Lok SabhaPinaki Misra, BJD
విస్తీర్ణం
 • Total3,051 కి.మీ2 (1,178 చ. మై)
జనాభా
 (2001)
 • Total15,02,682
 • జనసాంద్రత492/కి.మీ2 (1,270/చ. మై.)
భాషలు
 • అధికారఒరియా, హిందీ,ఇంగ్లీషు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
752 xxx
Vehicle registrationOD-13
Coastline150.4 కిలోమీటర్లు (93.5 మై.)
సమీప పట్టణంభువనేశ్వర్
లింగ నిష్పత్తి1.032 /
అక్షరాస్యత73.86%
లోక్ సభ నియోజకవర్గం2; Puri, Jagatsinghpur
Vidhan Sabha constituency7;
 
  • Brahmagiri
    Chilika
    Nayagarh
    Pipili
    Puri
    Ranpur
    Satyabadii
శీతోష్ణస్థితిAw (Köppen)
సగటు వేసవి ఉష్ణోగ్రత37 °C (99 °F)
సగటు శీతాకాల ఉష్ణోగ్రత13.9 °C (57.0 °F)

పేరువెనుక చరిత్ర

మార్చు

జిల్లాకు పూరీ పట్టణం కేంద్రంగా ఉన్నందున జిల్లాకు ఈ పేరు వచ్చింది. కన్నింగం వ్రాతలను అనుసరించి ఈ ప్రాంతం చారిత్ర అని పిలువబడేదని భావిస్తున్నారు. చైనా యాత్రికుడు హూయంత్సాంగ్ ఈ ప్రాంతాన్ని చెలితాలో అని పేర్కొన్నాడు. కాలక్రమంలో ఇది చారిత్రగా మారింది. అయినప్పటికీ ఈ ప్రాంతానికి పూరీ అని ఎందుకు వచ్చిందో సందేహాస్పదంగా ఉంది. ఈ పట్టణం వైష్ణవసంప్రదాయానికి ప్రతీక. ఇక్కడ చోడగొండ దేవా పురుషోత్తమక్షేత్ర జగన్నాథ్ అనే ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేయించాడు. తరువాత ఇది పురుషోత్తమ నిలయమై పురుషోత్తమ క్షేత్రంగా మారింది.

చరిత్ర

మార్చు

చారిత్రక కాలానికి ముందు

మార్చు

ఒడిషా రాష్ట్రంలోని ఇతరప్రాంతాలలో ఉన్నట్లే నదీతీర శిలలు, బీటలు హిమయుగానికి చెందినవని భావిస్తున్నారు. అయినప్పటికీ ధేన్‌కనల్, మయూర్భంజ్, కెయోంఝర్, సుందర్బన్ ప్రాంతాలలో ఉన్నట్లు చారిత్రకపూర్వపు రాతి పనిముట్లు లభించ లేదు. 9వ శతాబ్ధానికి చెందిన అనర్ఘర్ఘవా నాటకంలో ఈ ప్రాంతానికి పురుషోత్తమ అనేపేరు పేర్కొనబడింది. 1151-1152 నాటి మూడవ అనంగభీమ కాలానికి చెందిన తామ్రపత్రాలలో ఈ ప్రాంతం పురుషోత్తమ క్షేత్రమని పేర్కొనబడింది. పురుషోత్తమ క్షేత్రం, చాటర్ అనేపేరు ముస్లిం, బ్రిటిష్ పాలకుల రికార్డులలో పేర్కొనబడి ఉంది. యోగినితంత్ర, కలికపూర్ణాలలో ఈ ప్రాంతం పురుషోత్తం అని పేర్కొనబడింది. పూరీ ప్రాంతం ఉత్కల్‌గా గుర్తించబడుతుంది.

పురుషోత్తం క్షేత్రం కొంతకాలం పురుషోత్తమపురిగా పిలువబడిందని భావిస్తున్నారు. ప్రురుషోత్తం క్షేత్రం క్షేత్రా, చాటర్‌గా పిలువబడింది. అందువలన పురుషోత్తమ క్షేత్రం కాలక్రమంలో పూరీగా మారి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆరంభకాల బ్రిటిష్ రికార్డులలో ఈ ప్రాంతం పూరీగా పేర్కొనబడింది. ఆధునిక కాలంలో ఈ ప్రాంతం పూరీ మిగిలిన సకల నామాలతో ఖ్యాతి గడించింది.

జిల్లా చరిత్ర

మార్చు

మొగల్ పాలనలో (1592-1751) ఒడిషా పాలనా సౌలభ్యం కొరకు జలేశ్వర్, భద్రక్, కటక అనే మూడు భాగాలుగా విభజించబడింది. పూరీ ప్రాంతం కటక్ సర్కారులో భాగంగా మారింది.1751లో మరాఠీలు ఈ ప్రాంతంలో పాలనాపరంగా కొంత మార్పులు చేసారు. వారి పాలనలో ఈ భూభాగం ఉత్తరంగా సువర్ణరేఖ, దక్షిణంగా చిల్కా సరసు మద్య విస్తరించి ఉంది.మరాఠీ పాలకులు ఈ ప్రాంతాన్ని పిప్లి,కటక, సొరొ, బాలాసోర్ అనే చకలాలుగా విభజించారు. పిప్లి చకలా ఆధునిక పూరీ (ఒడిషా) జిల్లాగా మార్చబడింది. చకలాలు పరగణాలు, తాలూకాలుగా విభజించబడ్డాయి.

బ్రిటిష్ పాలన

మార్చు

1803 బ్రిటిష్ ఒడిషాను జయించిన తరువాత గొప్ప రెవెన్యూ విభాగాలు, రాజకీయ సంబంధాలలో మార్పులు చేపట్టబడ్డాయి. 1804 జూన్ మాసంలో ఈ ప్రాంతం ఉత్తర భూభాగం, దక్షిణ భూభాగం అని 2 భాగాలుగా విభజించబడింది. రెండు భాగాల మద్య మహానది సరిహద్దుగా ఉంచబడింది. ఉత్తర విభాగానికి రాబర్ట్ కెర్‌ను జడ్జ్, మెజిస్ట్రేట్, కలెక్టర్‌గా నియమించారు. దక్షిణ భూభాగానికి చార్లెస్ జెరోం జడ్జ్, మెజిస్ట్రేట్, కలెక్టర్‌గా నియమించబడ్డాడు. 1805 నాటికి రెండు విభాగాలు ఒకటిగా మిశ్రితం చేయబడ్డాయి.

ఖుర్ధా

మార్చు

1804తిరుగుబాటు చేసిన ఖుర్దా రాజా ఖైదుచేయబడి కటక్‌లోని " బరబతి " కోటలో బంధించబడ్డాడు. ఖుర్దా రాజ్యం బ్రిటిష్ ఆక్రమణకు గురైంది. చివరకు రాజా విడుదల చేయబడ్డాడు.తరువాత రాజా పూరీలోని బలిషాహి వద్ద నివసించడామికి అనుమతించబడ్డాడు. తరువాత రాజా జగన్నాథ ఆలయపర్యవేక్షకుడిగా నియమించబడ్డాడు. 1816 వరకు ఒడిషా భూభాగానికి పూరి రాజధానిగా ఉండేది. అంతేకాక ఇక్కడ కలెక్టర్ కార్యాలయం కూడా ఏర్పాటుచేయబడింది. 1806లో కలెక్టర్ కార్యాలయం జాజ్‌పూర్‌కు మార్చాలని ప్రతిపాదించబడింది. అయినప్పటికీ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. 1814 నాటికి కలెక్టర్ కార్యాలయంలో కొంతభాగం కటక్కు తరలించబడింది. అయినప్పటికీ అది తిరిగి పూరికి మార్చబడింది.1816 నాటికి కలెక్టర్ కార్యాలయం శాశ్వతంగా మొగల్, మరాఠీల రాజధాని అయిన కటక్‌కు తరలించబడింది. 1818 నాటికి కమీషనర్ కార్యాలయం స్థాపించబడింది.

జిల్లాల విభజన

మార్చు

1828 అక్టోబరు 23 న చివరగా ఈ భూభాగం బాలాసోర్, కటక్, జగన్నాథ్‌గా విభజన జరిగింది.

ఒడిషా భూభాగం

మార్చు

1912లో బిహార్, ఒడిషా భూభాగం ఏర్పాటు చేయబడింది. 1936 నాటికి ఒడిషా ప్రత్యేక భూభాగంగా ఏర్పాటు చేయబడింది. 1948 జనవరి 1 న ఒడిషా రాష్ట్రం ఏర్పాటు చేయబడిన తరువాత నయాగఢ్, దాస్పల్లా, ఖందపరా, రాణాపూర్ ఆస్థానాలు కలిపి మొత్తంగా 3941 చ.కి.మీ. భూభాగం ఒడిషా రాష్ట్రంలో మిళితం చేయబడ్డాయి. మునుపటి ఆస్థానాలను మొత్తంగా చేర్చి ఉపవిభాగంగా చేర్చి నయాగఢ్ రాజధానిగా పూరీ (ఒడిషా) జిల్లా ఏర్పాటు చేయబడింది. 1959 జనవరి 26న జిల్లా పూరి సాదర్, ఖుర్ధ, భువనేశ్వర్, నయాగఢ్ ప్రాంతాలతో 4వ ఉపవిభాగం పూరీ జిల్లా ఏర్పాటు చేయబడింది. 4వ విభాగంలో కృష్ణ ప్రసాద్, సాదర్, పిప్లి, నిమపరా తాలూకాలు ఉన్నాయి.

  • 1995 పూరీ జిల్లా 3 జిల్లాలుగా విభజించబడింది.
  • నయాగఢ్ ఉపవిభాగం నయాగఢ్ జిల్లాగా ఏర్పాటు చేయబడింది.
  • ఖుర్దా, భువనేశ్వర్ ఉపవిభాగాలు ఖుర్దా జిల్లాగా ఏర్పాటు చేయబడింది.
  • పూరీ ఉపవిభాగం పూరి (ఒడిషా) జిల్లాగా ఏర్పాటు చేయబడింది.

భౌగోళికం

మార్చు

పూరీ జిల్లా 19° డిగ్రీల అక్షాంశం, 84°29' డిగ్రీల రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం 3051 చ.కి.మీ. ఇది వైవిధ్యమైన భౌగోళిక, నైసర్గిక భూభాగాలను కలిగి ఉంది.

  • జిల్లా మొత్తం రెండు విభిన్నమైన విభాగాలుగా విభజించబడి ఉంది.
  • సముద్రతీర భూభాగం
  • ఒండ్రు భూభాగం

సముద్రతీర భూభాగం

మార్చు

సముద్రతీర భూభాగం సారవంతమైన భూమి, బంగాళాఖాతం సముద్రతీర ప్రాంతాలు కలిసిన భూభాగం ఇది. ఇది ఎలుగుబంటు ఆకారంలో ఉంటుంది. సముద్రతీరం పక్కన ఇసుకతిన్నెల శ్రేణి ఉంటుంది. 6.5 కి.మీ పొడవున కొన్ని మీటర్ల వెడల్పున ఉంటుంది. వేగవంతమైన సముద్రగాలుల వలన ఇసుక ఎత్తుగా సముద్రతీరంవెంట సమాంతరంగా గీతలా ఏర్పడింది. ఇది చిలుకా సరసు, సముద్రాన్ని విడదీస్తున్న సరిహద్దురేఖలా ఉంటుంది.

నల్లరేగడి మట్టి

మార్చు

నల్లరేగడి మట్టి భూభాగం పూర్తిగా గ్రామాలు, వరిపొలాలతో నిండి ఉంటుంది. ఈ భూభాగంలో మహానది నుండి ప్రవహించే నీటి కాలువలు ఉన్నాయి. పూరీ జిల్లాలో కొండలు లేవు. సాధారణంగా ఆకురాలు కాలంలో బైలి వరిపంట, శీతాకాలంలో సారదా వరిపంట, వసంతకాలంలో దలౌ వరిపంటను పండిస్తారు.

సీ కోస్ట్ బాయ్స్

మార్చు

పూరీ జిల్లా సముద్రతీరం పొడవు 150కి.మీ. సముద్రతీరం వెంట ఉన్న ఇసుకతిన్నెల శ్రేణి జగత్సిగ్పూర్, గంజాం జిల్లా వరకు సాగుతున్నాయి. జిల్లాలో సంవత్సరానికి 8 మాసాల కాలం బలంగా వీచే గాలుల కారణంగా ఈ ఇసుకతిన్నెల శ్రేణి ఏర్పడింది. ఇసుక తిన్నె పొడవు 6.5 కి.మీ పొడవు కొన్ని మీటర్ల వెడల్పు ఉంటుంది. జిల్లాలో నదులు సముద్రంలో సంగమించకుండా ఈ ఇసుక తిన్నెల రేఖ అడ్డుకుంటుంది.

ద్వీపం

మార్చు

జిల్లాలో సముద్ర ద్వీపాలు లేనప్పటికీ సముద్రం నుండి వేరుపడి ఉన్న చిల్కా సరసులో మాత్రం పలు ద్వీపాలు ఉన్నాయి.

నదులు

మార్చు

పూరీ జిల్లాలో నదులన్నీ ఒకే విధంగా ఉంటాయి. వేసవిలో ఇసుకతిన్నెల మద్య సన్నని ప్రవాహంగా ప్రవహిస్తున్నాయి. వర్షాకాలంలో నదులన్నీ నిండుగా ప్రవహిస్తుంటాయి. సాధారణంగా జిల్లాలో నదులన్నీ మహానదికి ఉపనదులుగా ఉన్నాయి.

  • కుషభద్రా నది :- ఇది కుయాఖై నదీ శాఖ. బలంటియా వద్ద ఆరంభమై పూరీకి 15కి.మీ దూరంలో ఉన్న రామచండి ఆలయం సమీపంలో బంగాళాఖాతంలో సంగమిస్తుంది. ఈ నదికి ముగెయి అనే ఉపనది ఉంది.
  • డయా నది : కుయాఖై నది శాఖ. ఇది చిల్కా సరసులో సంగమిస్తుంది. ఈ నదికి కనాస్‌కు దిగువన గంగుయా, మనగుని అనే ఉపనదులున్నాయి. డయా నది తీసుకువస్తున్న ఒండ్రుమట్టి

చిలుకా సరసులో పూడడానికి కారణమౌతూ ఉంది.

  • భార్గవి నది ఇది కుయాఖై నదిలోని శాఖ. ఇది బంగాళాఖాతంలో సంగమిస్తుంది. ఇది సముద్రంలో కలిసే 2.5కి.మీ ముందు పలు శాఖలుగా విడిపోతుంది. వీటిలో కంచి, ఈస్ట్‌కనియా, సౌత్‌కంచి, మయానది ప్రధానమైనవి. మొదటి రెండు ఒకటై చివరికి సునాముని నదిలో సంగమిస్తాయి. అది బాలి హరిచండిలో సంగమించి చివరకు బంగాళాఖాతం చేరుకుంటుంది. సౌత్ కనియా నది చిలికా సరస్సు పశ్చిమ తీరంలో సరసులో సంగమిస్తుంది.
  • కడుయా నది :- ఇది వర్షాధార నది. ఇది ప్రాచి నదిలో సంగమిస్తుంది.
  • ప్రాచి నది :- ఇది కాంతపురాలో జన్మించి పూరీ, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలలో ప్రవహించి కాకత్పూర్ గ్రామం గుండా ప్రవహించి బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
  • దేవీ నది:- ఇది కథజోరి నిది శాఖ. ఇది పూరీలో ప్రవహించి తూర్పు దిశగా ప్రవహిస్తూ రత్నచిరా, నూనా మొదలైన పలుశాఖలుగా విడిపోయి భర్గవి నది, దయానదులలో సంగమిస్తుంది.

సరసులు

మార్చు
 
Map of lake Chilka with near-by settlement of Puri.

1. చిల్కా సరసు 2. సార్ సరసు

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,697,983,[1]
ఇది దాదాపు. గునియా- బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. ఇదాహో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 291 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 488 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 963:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 85.37%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

సంస్కృతి, సంప్రదాయం

మార్చు

ఒడిషా రాష్ట్ర మనోహరమైన సముద్రతీరాలలో పూరి సముద్రతీరం ఒకటి. క్రీ.పూ. నుండి ప్రస్తుత కాలం వరకు పూరి సంప్రదాయ చరిత్ర నమోదై ఉంది. స్మారక చిహ్నాలు, మతపరమైన పవిత్రత, ప్రజల జీవన సరళి, సంప్రదాయం పూరిని ఒడిషా సంప్రదాయ కేంద్రంగా మార్చింది. పలు ప్రక్రియల ద్వారా ఇక్కడ సంప్రదాయం వర్ధిల్లుతుంది. జిల్లా సర్వమతాలు సమైక్యతకు చిహ్నంగా భాసిల్లుతుంది. జిల్లాలో హిందువులు అధికంగా ఉన్నారు. జిల్లాలో అదనంగా ముస్లిములు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు, గిరిజనులు ఉన్నారు. జిల్లాలో హిదూయిజం, శైవం, వైష్ణవిజం, శాక్తేయం, గణపత్య, మహాబీర్ మొదలైన మతాలు ఉనికిలో ఉన్నాయి.

దేవాలయాలు

మార్చు
 
Konark Sun Temple

జిల్లా యొక్క ముఖ్యమైన స్మారక ఉన్నాయి: -

  • జగన్నాథ్ ఆలయం (పూరి)
  • గుందీచా ఆలయం, పూరి
  • లొకొనాథ్ ఆలయం, పూరి
  • జంబేశ్వర్ ఆలయం, పూరీ మార్కండేశ్వర పుష్కరిణి పూరీ సమీపంలో
  • సప్త మాతృక చిత్రాలు
  • సూర్య దేవాలయం, కోణార్క్
  • నిమపరా బ్లాక్లోని చౌరాశి వద్ద బరహి దేవాలయం.
  • మంగళ ఆలయం, కాకత్పూర్
  • సఖిగోపాల్ ఆలయం, అమరేశ్వర్ వద్ద
  • అమరేశ్వర్ ఆలయం, నిమపరా బ్లాక్ బిష్ణుపూర్ నిమపరా కొట్టాయి
  • శిల్పకళ
  • గ్రామేశ్వర్ ఆలయం, తెరుండియా, నిమపరా
  • అలర్నాథ్ ఆలయం, బ్రహంగిరి
  • బలిహరచండి ఆలయం, ఆలయం, బ్లాక్
  • కుంటేశ్వర్ ఆలయం, అరారో, పిపిల్ బ్లాక్ పిపిల్ సమీపంలో
  • హరిహర్ ఆలయం,
  • డెలాంగ్ బ్లాక్ వద్ద జగదల్పూర్ శివాలయం,
  • బదతర, జి.ఒ.పి వద్ద తారా చిత్రం జి.ఒ.పి సమీపంలో
  • బయలిసబతి ఆలయం,
  • మొహబిర్ ఆలయం,సిరులి సదర్ బ్లాక్
  • బలంగ శ్రీ శ్రీ బకరెశ్చర్ ఆలయం, నింపర బ్లాక్

పండుగలు ఉత్సవాలు

మార్చు

పూరీ ప్రజలు సంవత్సరంలో 13 పండుగలు జరుపుకుంటున్నారు. వీటిలో కొన్ని జగన్నాథునికి సంబంధించిన పండుగలు. మిగిలినవి ఇతర దైవాలకు సంబంధించినవి.

  • రథ యాత్ర (కార్ ఫెస్టివల్) జూలైలో
  • చందన్ యాత్ర ఏప్రిల్ లో
  • గొసని యాత్ర, దసహరా సెప్టెంబరు / అక్టోబరు లో.
  • రామ నవమి మార్చిలో / ఏప్రిల్ నుండి 7 రోజులు సాహి యాత్ర
  • శివరాత్రి పండుగను ఫిబ్రవరిలో అన్ని శైవ పిథాస్‌లో జనవరి కోణార్క్ వద్ద
  • మాఘ మేలా
  • అక్టోబరు / నవంబరులో కోణార్క్ వద్ద బొయిట బందన్.
  • మార్చి హరిరాజ్పూర్ వద్ద హరిరాజ్పూర్ మెలాన్
  • ఝము యాత్రలో కకతపూర్ మేలో
  • పిపిల్లిన్ బ్లాక్లోని ఘొరొడియా వద్ద డయానా చోరి
  • అవున్ల నవమిలో సాక్షిగోపాల్ మార్చిలో
  • జనవరి చిల్కా వద్ద మకర మేళా
  • బలి హరచండి మేళా సమయంలో రాజా జూన్ లో ఫెస్టివల్ బ్రహ్మగిరి (ఒడిషా)
  • అంబసర్ యాత్ర అల్రనాథ్ పీట, బ్రహ్మగిరి . ఏప్రిల్ లో సిరులి, సదర్ బ్లాక్ - పన సంక్రాంతి సమయంలో
  • సిరులి మహావీర్ మేళా బలంగ మెలాన్ ఫీల్డ్ వద్ద
  • పంచుదొల బలంగ మెలాన్, మార్చి నిమపర బ్లాక్ 'పర్యాటకులు కోసం అదర్ ఫెస్టివల్స్'
  • పర్యాటకం - ప్రభుత్వం యొక్క కోణార్క్ ఫెస్టివల్ ఏజన్సీ ఒడిషా- డిసెంబరు 1 వ వారం
  • కోణార్క్ సంగీతం & డాన్స్ ఫెస్టివల్ కోణార్క్ నాట్య మండప్- ఫిబ్రవరి
  • బసంత్ ఉత్సవ్ - పరంపర రఘురాజ్పూర్ - ఫిబ్రవరి నవంబరు -
  • పూరి - వద్ద పూరీ బీచ్ ఫెస్టివల్ హోటల్, ఒడిశా రెస్టారెంట్ అసోసియేషన్ నిర్వహిస్తారు
  • శ్రీక్సెత్రా మహోత్సవ్, పూరి- శ్రీక్సెత్రా మహోత్సవ్, కమిటీ నిర్వహిస్తారు - ఏప్రిల్
  • గుందీచా ఉత్సవ్ ఉర్రెక, పూరి, పురి - వ్యవస్థీకృత వద్ద - జూన్
  • 'అన్ని ఉత్సవాలలో ఒడిషా సంప్రదాయ నృత్యం, జానపద నృత్యాలతో దేశం నుండి పలు ప్రాంతాల కళాకారులు నృత్యప్రదర్శనలు ఇస్తారు.

రెండవ శనివారం సాంస్కృతిక కార్యక్రమం

మార్చు

యువకళాకారులను ప్రోత్సహించడానికి ప్రతిమాసం రెండవ శనివారం సీ బీచ్ పోలీస్ స్టేషను సమీపంలో ఉన్న కలెక్టర్ హాల్‌లో సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి.ఇక్కడ రంగస్థలం మీద ది మెజెస్టిక్ ఒడిస్సీ, ది ల్యూసిక్ ఒడిస్సీ సాంగ్, జానపద నృత్యాలు ప్రదర్శించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు సందర్శించడానికి ప్రత్యేక రుసుము ఏదీ చెల్లించనసరం లేదు. .

నృత్యం, సంగీతం

మార్చు

పూరీలో నృత్యం, సంగీతం పురాతన కాలం నుండి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ రెండు ప్రభావ వంతమైన కళాసంప్రదాయాలు వృత్తి కళాకారులు మాత్రమే కాక పలు ఇతర కళారూపాలలో కూడా ప్రదృసించబడుతున్నాయి. పురాతన కళాసంప్రదాయాలు అధికంగా సుందరమైన ఆలయాలను ఆధారంగా చేసుకుని ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి ఆలయాలు విస్తారంగా ఉన్నాయి. సంగీత నృత్య పోషణలో ఆలయాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కళాప్రదర్శన కొరకు ఆలయాలలో నట మందిరాలు నిర్మించబడి ఉన్నాయి. ఆలయ ఉత్సవాలలో కళాప్రదర్శనలు భాగంగా ఉన్నాయి. నటమందిరాలలో పలు భంగిమలలో నృత్యం, సంగీత కళాకారులు, వాయిద్యాలు అందంగా చెక్కబడి ఉన్నాయి. ఆలయాలు కళాపోషణా నిలయాలుగా ఉన్నాయని చెప్పడానికి ఇది ప్రత్యేక నిదర్శనం.

ఒడిస్సీ నృత్యం

మార్చు
 
Sharmila Biswas performing Odissi in a dance festival in Kerala

దేవదాసీలు ఆలయ కళాసంప్రదాయాలలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. దేవదాసి సంప్రదాయం దక్షిణ, మద్య భారతంలోకాక ఒడిషాలో కూడా కూడా కనిపిస్తుంది. నైపుణ్యం కలిగిన దేవదాసీలకు ఒడిస్సీ నృత్యంలో రహస్యంగా శిక్షణ ఇవ్వబడుతుంది. దేవదాసీ నృత్యాలలో జగన్నథుని స్తుతించే జయదేవుని అష్టపదులు, గీతాగోవిందం వంటి సంగీతనికి ప్రాముఖ్యత ఉంటుంది.

దేవదసీ పద్ధతిని రద్దు చేసే సమయానికి ఒడిస్సీ అభివృద్ధి దశకు చేరుకుంది. ఒడిస్సీ నృత్యం ఒడిషా రాష్ట్ర అభివృద్ధి చెందిన నృత్యంగా గుర్తించబడుతుంది. పద్మశ్రీ గురుచరణ్ మహాపాత్రా ఒడిస్సా నృత్యానికి ప్రధాన గురువుగా గుర్తించబడుతున్నాడు. షారన్ లోవెన్ ఒక అమెరికన్ ఒడిస్సీ నర్తకి, గురు కేలుచరణ్ మోహపాత్ర దగ్గర 1975 నుండి శిక్షణ పొందింది. ఆమె భారతదేశం, ఉత్తర అమెరికా, ఆసియా, ఆఫ్రికా, యునైటెడ్ కింగ్‌డమ్, మిడిల్ ఈస్ట్ అంతటా వందలాది నృత్యప్రదర్శనలను ఇచ్చింది. చలనచిత్రానికి, టెలివిజన్ కోసం కొరియోగ్రఫీ చేసింది.[4] తెలుగు చలన చిత్రం "స్వర్ణ కమలం" లో నటించింది.

ఒడిషా సంగీతం

మార్చు

ఇది పూరీలో ఆరంభించబడిన నృత్యం. ఈ నృత్యానికి కూర్చబడే సంగీతం ప్రత్యేకమైనది. ఈ సంగీతం హిందూస్థానీ, కర్నాటక సంగీతానికంటే ప్రత్యేక బాణిలో ఉంటుంది.

దిమహరి నృత్యం

మార్చు

సంగీతం, నృత్యాలను అభిమానించే జగన్నాథునికి సమర్పిస్తున్న కళారూపాలలో మయూరనృత్యం ఒకటి. శ్రీ మందిరంలో ఆరంభించబడిన ఈ నృత్యం ఉత్కల్‌లో పూచిన పారిజాతంగా భావిస్తున్నారు. ఈ నృత్యం తన మనోహరమైన శైలితో జాతీయంగా గుర్తించబడుతుంది. ఈ నృత్యం చిరకాలంగా ఉనికిలో ఉంది. ఉత్కల్ కళారంగానికి అలంకారంగా భాసిల్లుతుంది. మహారి అనే భక్తురాలు జగన్నాథునితో ఐక్యం అయ్యే కథనం మహారి నృత్యంలో భాగంగా ఉంటుంది. నటా ఆలయంలో ప్రారంభమైన నృత్యం ప్రస్తుతం ఆలయాన్ని దాటి ఒడిషా కళాప్రవాహంలో కలిసి పోయింది. .

జానపద నృత్యం

మార్చు

గొటిపుయా నృత్యం

మార్చు

పూరీ జానపద నృత్యాలలో మనోహరమైన గొతిపుయా నృత్యం ప్రత్యేకత సంతరించుకుంది. 14 సంవత్సరాలకు లోబడిన పిల్లలు ఆడపిల్లల దుస్తులు ధరించి సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా నర్తిస్తుంటారు. ఈ నృత్యం ప్రజలలో ప్రాధాన్యత సంతరుంచుకుంది. దొమ్మరి వారు చేసే ఈ నృత్యం ప్రస్తుతం జాపదకళగా గుర్తించబడుతుంది. ఈ నృత్యంలో రఘురాజపూర్ గొతిపుయా నృత్యం అధికంగా కీర్తిని సంపాదించింది.

నాగా, మేథా నృత్యం

మార్చు

నాగా నృత్యంలో నృత్యకళాకారుడు ముఖానికి మాస్క్ ధరించి సంగీతానికి అనుగుణంగా నర్తిస్తాడు. నృత్యరీతులలో రావణ్, త్రిసురా, నవసిరా మొదలైనవి ప్రధానమైనవి. పురీ పట్టణంలో ప్రాముఖ్యత సంతరించుకున్న నృత్యాలలో నాగా నృత్యం ఒకటి.

ఇతర జానపద నృత్యాలు

మార్చు

జిల్లాలో ఘోడ నాచా, ధుద్క్, జాత్రా (బెంగాల్), దస్కతియా, భలునాచా, నవరంగ్ మొదలైన ఇతర జానపద నృత్యాలు కూడా ఉనికిలో ఉన్నాయి.

ఇతర స్మారక చిహ్నాలు

మార్చు

పురాతత్వ పరిశోధనలు

మార్చు

పూరీ జిల్లాలో త్రవ్వకాలలో లభించిన వస్తువుల జాబితా:-

  1. కురం:- కోణార్క్ నుండి 8 కి.మీ దూరంలో కురం లభించింది. దీనిని కురుమ అనికూడా అంటారు. 10వ శతాబ్ధానికి చెందిన బుద్ధమతానికి చెందిన అవశేషాలను వెలికి తీయడానికి ఈ త్రవ్వకాలు నిర్వహించబడ్డాయి.
  2. మాణికపట్న :- ఇది కృష్ణప్రసాద్ మండలంలో ఉంది. ఇక్కడ మద్యయుగానికి చెందిన వస్తువులు లభించాయి.
  3. కిఖ పట్న :- ఇది పూరీ జిల్లాలోని కోణార్క్ సముద్రతీర పయనమారంలో ఉంది. ఇక్కడ 15వ శతాబ్ధానికి చెందిన పురావస్తు వస్తువులు లభించాయి.

దియేటర్లు

మార్చు

పూరీ గ్రాండ్ రోడ్డులో అన్నపూర్ణా థియేటర్ ఉంది. రంగస్థల ప్రదర్శనలకు ఇది అనుకూలం.

ఒపేరా

మార్చు

ఒపేరా:- ఇది పూరీలో ప్రబలమైన సంచార నాటక బృందం.

మ్యూజియం

మార్చు

జిల్లా గ్రంథాలయం:- ఇక్కడ భారతీయ సంప్రదాయానికి చెందిన వస్తువులను భద్రరపరిచారు. 1997 నుండి ఈ మ్యూజియం పనిచేస్తుంది. ఒడిషా రాష్ట్ర మ్యూజియానికి ఇది ఉపశాఖగా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. జగన్నాథుని వివిధరూపాలు, వివిధ శిల్పాలు, పట్టా చిత్రాలు, ఓల్ం ఆకు చిత్రాలు, వివిధ హస్థకళా రూపాలు ఈ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి.ఈ మ్యూజియం దర్శించడానికి ప్రత్యేక రుసుము లేదు.

  • పూరీకి 5కి.మీ దూరంలో బతగావ్‌లో మరొక హస్థకళా మ్యూజియం ఉంది. ఇదు కోపరేటివ్ సొసైటీ నిర్వహణలో పనిచేస్తుంది.

గ్రంథాలయాలు

మార్చు
  • జిల్లా గ్రంథాలయం :- పూరీ జిల్లా గ్రంథాలయం స్టేషను రోడ్డులో ఉంది. ఇక్కడ 15,000 గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలయానికి దినపత్రికలు, పత్రికలు క్రమం తప్పకుండా కొనుగోలు చేయబడుతుంటాయి. దీనిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇక్కడ ఆసక్తి కలిగిన ఎవరైనా ఉచితంగా పుస్తకాలను చదవ వచ్చు.
  • పంచసఖ మెమోరియల్ హాల్ లైబ్రరీ : సాక్షిగోపాల్ :- ఈ గ్రంథాలయాన్ని కల్చర్ డిపార్ట్మెంటు నిర్వహిస్తుంది. ఇక్కడ 4,000 కంటే అధిక సంఖ్యలో పుసకాలు ఉన్నాయి. సోమవారం ఈ గ్రంథాలయానికి శలవు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో గ్రంథాలయ వసతులు అధికరించడానికి రాజారామోహన రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నిస్తుంది.

ప్రముఖ వ్యక్తులు

మార్చు

జిల్లా సాంస్కృ తిక కార్యాలయం

మార్చు

To promote cultural activities and to implement Govt, decisions at the grass root level relating to art and culture, Dist Hqrs. The District Library Puri, Panchasakha Memorial Hall Library at Sakhigopal,the museum Puri is directly managed by this office.Besides it provide information on different aspects of culture.Cultural programmee are organized by this office. Grants to registered libraries, cultural institutions, pension to artist in indecent Circumstances are routed throughthis Office. It also keeps liaison with the Orissa Sahitya Akademi and the Odisha Sangeet Natak Academy.

రాజకీయాలు

మార్చు

విభాగాలు

మార్చు

The following is the 5 Vidhan sabha constituencies[5][6] of Puri district and the elected members[7] of that area

సంఖ్య నియోజకవర్గం రిజర్వేషన్ అసెంబ్లీ నియోజక వర్గం (బ్లాకులు) 14వ అసెంబ్లీ సభ్యుడు రాజకీయ పార్టీ
105 కాకత్పూర్ షెడ్యూల్డ్ కొణార్క, కాకత్పూర్, అస్తరంగ్,గొప్ (భాగం) రబి మల్లిక్ BJD
106 నిమపరా, లేదు నిమపరా (ఎన్.ఎ.సి), నిమపరా, గొప్ (భాగం) సమీర్ రంజన్ దాష్ బి.జె.డి
107 పూరి లేదు పూరి (ఎం), పూరి సాదర్ (భాగం) (part), Gop (part) మహేశ్వర్ మహంతి బి.జె.డి
108 బ్రహ్మగిరి లేదు బ్రహ్మగిరి, క్రుష్ణప్రసాద్, పూరి సాదర్ (భగం) సంజయ్ కుమార్ దాస్ బర్మ BJD
109 సత్యబాడి లేదు సత్యబాశి, కనాస్ ప్రసాద్ కుమార్ హరిచంద్రా INC
110 పిపిల్లి. లేదు పిపిల్లి (ఎన్.ఎ.సి), దెలంగ ప్రదీప్ మహందీ BJD

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Idaho 1,567,582
  4. "Welcome to Muse India". Archived from the original on 2012-03-02.
  5. Assembly Constituencies and their EXtent
  6. Seats of Odisha
  7. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 May 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

బయటి లింకులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు