వరంగల్ జిల్లా జనగామ మండలంలోని పెంబర్తి హస్తకళాకారుల లోహపు రేకుల కళ ను పెంబర్తి లొహ హస్తకళలు గా వ్యవహరిస్తారు .పెంబర్తి లొహ హస్తకళలు ఎక్కువగా ఇత్తడి, కంచు లోహల మీద వుంటాయి కాకతీయుల కాలం నుండి పెంబర్తి గ్రామం హస్త కళలకు నిలయంగా మారింది కాకతీయ శైలిని అనుసరించడం వీరి కళ ప్రత్యేకత. మానవ శ్రమ ఆవిష్కరించిన పెంబర్తి కళలు అనేక కళా ఖండాలుగా దేశ విదేశాల్లోవర్థిల్లుతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, దేవతల విగ్రహాలను, కళా ఖండాలను, గృహ అలంకరణ వస్తువులను- గుడి, బడి మొదలైన అనేక మానవ అవసరమైన హస్త కళా రూపాలను పెంబర్తి కళాకారులు చేతి నైపుణ్యంతో తయారు చేస్తారు.

చరిత్రసవరించు

పూర్వం కాకతీయుల పాలనలో రాజకుటుంబానికి అవసరమైన పనిముట్లను అందించిన వీరు రాను రాను తమ నైపుణ్యాన్ని పెంచుకొని ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారు[1]. ఈ ప్రాంతం లోహపు రేకుల కళకు ప్రసిద్ధిగాంచినది. ఈ లోహపు రేకులను పురాతన కాలం నుంచి కూడా దేవాలయములకు , రథములకు అలంకరించడానికి ఉపయోగించేవారు. మధ్యలో కొంతకాలం ఈ కళకు ఆదరణ లేక అంతరించిపోయింది. తర్వాత నిజాం నవాబు కాలంలో ఈ కళను ప్రభువులు బాగా ఆదరించడం ఈ కళకు జీవం పోసింది..

విశేషాలుసవరించు

పెంబర్తి హస్తకళాకారులు తయారు చేస్తున్న షీల్డ్స్, మొమెంటోలు, గృహోపకరణాల వస్తువులకు ప్రపంచ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ తయారైన కళాత్మక వస్తువులను అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి[2] .వీరు వివిధ దేవాలయాలపై ఉన్న ఇత్తడి, రాగి, వెండి, బంగారు తాపడాలను తయారు చేశారు. ధ్వజస్తంభ తొడుగులు, గోపుర కలశాలు, కవచాలు రూపొందించడంలో వీరు దిట్టలు. లోహాలు, లోహ మిశ్రమాలతో కుఢ్యాలంకరణ చేయడంలో , గీతోపదేశం, దశావతారాలు, అష్టలక్ష్మీ, సీతారామ పట్టాభిషేకం, కాకతీయ కళాతోరణం, చార్మినార్‌, గణేష్‌, లక్ష్మీదేవి, సరస్వతి, హంస తదితర సజీవ రూపాలను నివాస కుఢ్యాలపై హృద్యంగా ఆవిష్కరిస్తారు. [3]

మూలాలుసవరించు