పెదముత్తేవి

భారతదేశంలోని గ్రామం

పెదముక్తేవి, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 136. యస్.టీ.డీ.కొడ్ = 08671.

పెదముత్తేవి
—  రెవిన్యూ గ్రామం  —
పెదముత్తేవి is located in Andhra Pradesh
పెదముత్తేవి
పెదముత్తేవి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°15′15″N 80°55′44″E / 16.254200°N 80.928836°E / 16.254200; 80.928836
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,300
 - పురుషులు 1,626
 - స్త్రీలు 1,674
 - గృహాల సంఖ్య 1,059
పిన్ కోడ్ 521136
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భొగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

మచిలీపట్నం, రేపల్లె, పెడన, గుడివాడ

సమీప మండలాలుసవరించు

పమిడిముక్కల, ఘంటసాల, చల్లపల్లి, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కూచిపూడి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: విజయ్వాడ 50 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

శ్రీ లక్ష్మీపతిస్వామి విద్యావిహార్ సంస్కృతోన్నత (ఓరియెంటల్) పాఠశాలసవరించు

ఈ పాఠశాలను 1957 లో, ముక్తేవి సీతారాం వంశీయులు నెలకొల్పినారు. మారుమూల గ్రామమయిన పెదముక్తేవి గ్రామం లోని ఈ పాఠశాల జతీయస్థాయిలో పేరుగాంచింది. ఇందుకు కారణం, ఈ పాఠశాలలో చదువుతోపాటు, క్రీడలలోగాడా విద్యార్థులకు శిక్షణనిచ్చుచున్నారు. గత మూడు సంవత్సరాలలో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించుచున్నారు. ఈ సంవత్సరం 90% ఉత్తీర్ణత సాధించారు. ఈ పాఠశాలల విద్యార్థులకు ఆధ్యాత్మిక విషయాలలోగూడా శిక్షణనిచ్చుచున్నారు. చదువుతోపాటు వాలీబాల్ క్రీడలోగూడా శిక్షణ పొందుచున్న ఈ విద్యార్థులు, రాష్ట్ర, జాతీయస్థాయిలలో గూడా రాణించుచూ, మొత్తం 400 కి పైగా బహుమతులు సాధించి, పాఠశాల కీర్తిపతాకాన్ని జాతీయస్థాయిలో గూడా ఎగురవేసినారు. నలుగురు విద్యార్థులు జాతీయ జట్టులో ఆడుచున్నారు. దీనికి ముఖ్యకారకులు, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీ దోనేపూడి దయాకరరావు. వీరు జాతీయస్థాయి కోచ్ గా అర్హత సాధించారు. [9]

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార పరపతి సంఘంసవరించు

బ్యాంకులుసవరించు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్:- ఈ గ్రామంలో ఈ బ్యాంక్ శాఖను, జిల్లాలో 55వ శాఖగా, 2016, ఫిబ్రవరి-3, బుధవారంనాడు ప్రారంభించారు. [13]

గ్రామానికి వ్యయసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కాకర్ల మాహాలక్ష్మి సర్పంచిగా ఎన్నికైనారు. [13]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మిపతి స్వామి ఆలయంసవరించు

2014, ఏప్రిల్-14, సోమవారం నాడు, చాలా పురాతనమైన ఈ ఆలయంలో, స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పుష్పాలంకరణ, గజారోహణోత్సవం, బాణాసంచా వేడుక, స్వామివారికీ, అమ్మవారికీ ఎదుర్కోలు పెళ్ళిముచ్చట్లు, అనంతరం స్వామివారి కల్యాణాన్ని వేదమంత్రాల నడుమ, "ముక్తేవి" వంశస్థులు పీటలమీద కూర్చొని పెళ్ళి జరిపించారు. 15వ తేదీ సోమవారం నాడు, స్వామివారికి గరుడోత్సవం భక్తిశ్రద్ధలతో జరిపినారు. శ్రీ స్వామివార్లను పసుపు బట్టలతో, శ్రీకృష్ణాశ్రమ ప్రాంగణానికి తీసుకొనివచ్చారు. సాయంత్రం రథోత్సవం, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. [6]

శ్రీ లక్ష్మీనారాయణ క్షేత్రంసవరించు

దివిసీమలోని భీమనదీతీరంలో 16వ శతాబ్దపు శ్రీ లక్ష్మీనారాయణ క్షేత్రం ఉన్న పెదముక్తేవి గ్రామం, ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుచున్నది. వేడవ్యాస మహర్షి తపఃప్రభావంతో పునీతమైన క్షేత్రం పెదముక్తేవి. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ వేదవ్యాస మహర్షికి అర్చామూర్తి రూపంలో వేంచేసి, శ్రీ లక్ష్మీపతిస్వామిగా అవతరించినాడని చరిత్ర చెబుచున్నది. 16వ శతాబ్దం నుండి పరమభక్తికి, సంగీత సాహిత్యాలకు ప్రసిద్ధిగాంచిన వంశం ఉంది.

గ్రామదేవత శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంసవరించు

శ్రీ వ్యాసాశ్రమంసవరించు

ఈ గ్రామంలో శ్రీ వ్యాసాశ్రమం విభాగం ఉంది.

శ్రీ కృష్ణాశ్రమంసవరించు

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

ప్రముఖులుసవరించు

 
జాస్తి చలమేశ్వర్ -సుప్రీం కోర్టు న్యాయమూర్తి.
  • జాస్తి చలమేశ్వర్ -సుప్రీం కోర్టు న్యాయమూర్తి.గతంలో కేరళ, గౌహతి హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసారు.[2]1953 జూన్ 23పెదముత్తేవిలో జన్మించాడు. తల్లిదండ్రులు ఆన్నపుర్ణాదేవి, లక్ష్మినారాయణ గార్లు. [2]

గ్రామ విశేషాలుసవరించు

జాతీయస్థాయిలో ప్రతిభగల క్రీడాకారులకు, మొవ్వ మండలం స్ఫూర్తిదాయకంగా ఉంటున్నది.ఈ గ్రామం వాలీబాల్ క్రీడా విద్యార్థులకు పుట్టినిల్లు. వాలీబాల్ ఆటలో విశేష ప్రతిభ కనబరుస్తుంటారు.

కాకర్ల గీతసవరించు

  1. ఈ గ్రామానికి చెందిన, పాలిటెక్నిక్ చదివిన, కాకర్ల గీత, జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి. ఈమె విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా స్కూలుకి ఎంపికై, అక్కడే శిక్షణ పొందుచున్నది. ఈమె రాష్ట్రంలో పలు ప్రాంతాలలో, సీనియర్, జూనియర్, సబ్-జూనియర్, ఫికా, రూరల్, అండర్-14, అండర్-17 స్థాయిలలో, 10 పతకాలు అందుకున్నారు. 2008, 2009, 2012, 2013 లలో జాతీయ స్థాయిలో పలు చోట్ల పాల్గొని తన ప్రతిభ కనబరిచారు. [3]
  2. విశాఖపట్నం క్రీడాపాఠశాలలో తర్ఫీదు పొందుచున్న కాకర్ల గీత, 2013 నవంబరు 27 నుండి 29 వరకూ, కర్నాటక లోని హవేరిలో జరిగే జాతీయస్థాయి మహిళా వాలీబాల్ పోటీలలో, ఆరోసారి, ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నది. [4]
  3. ఈమె 2016, జనవరి-2 నుండి 9 వరకు బెంగళూరులో నిర్వహించు జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో సీనియర్ నేషనల్స్ కు ఎంపికైనది. [12]

జాతీయస్థాయి బీచ్ వాలీబాల్ పోటీల రాష్ట్ర జట్టుకు, పెదముక్తేవికి చెందిన మహాళి శ్రీప్రియాంక, కాకర్ల గీత అను విద్యార్థినులు ఎంపికైనారు. ఈ పోటీలు, 2017, మార్చి-17 నుండి 19 వరకు పుదుచ్చేరిలో నిర్వహించెదరు. [16]

దత్తత గ్రామoసవరించు

ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయటానికై, ఈ గ్రామాన్ని, కోసూరు ఇండియన్ బ్యాంక్ శాఖ, దత్తత తీఉకున్నది. [10]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3825.[3] ఇందులో పురుషుల సంఖ్య 1876, స్త్రీల సంఖ్య 1949, గ్రామంలో నివాస గృహాలు 1138 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1240 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 3,300 - పురుషుల సంఖ్య 1,626 - స్త్రీల సంఖ్య 1,674- గృహాల సంఖ్య 1,059

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Movva/Pedamuthevi". Retrieved 24 June 2016. External link in |title= (help)[permanent dead link]
  2. "Meet Jasti Chelameswar, only judge who ruled in favour of government's NJAC - The Economic Times". The Economic Times. Retrieved 2015-11-03.
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు; 2011, నవంబరు-30; ప్రధానసంచిక-1వపేజీ. [3] ఈనాడు; 2013, అక్టోబరు-22; 3వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2013, నవంబరు-26; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2013, డిసెంబరు,10; 3వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఏప్రిల్-15; 3వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2014, ఏప్రిల్-16; 6వపేజీ. [8] ఈనాడు కృష్ణా; 2015, మార్చి-28; 11వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015, మే-31; 34వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-16; 27వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-9; 26వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2016, జనవరి-1; 7వపేజీ. [13] ఈనాడు అమరావతి; 2016, ఫిబ్రవరి-4; 24వపేజీ. [14] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, నవంబరు-22; 2వపేజీ. [15] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, జనవరి-25; 3వపేజీ. [16] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, మార్చి-17; 1వపేజీ.