పెరికీడు కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 105., యస్.టీ.డీ.కోడ్ = 08656.[1]

పెరికీడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బాపులపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521105
ఎస్.టి.డి కోడ్ 08656

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 28 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

హనుమాన్ జంక్షన్, ఏలూరు, నూజివీడు, గుడివాడ

సమీప మండలాలుసవరించు

పెదపాడు, నందివాడ, ఏలూరు, ఉంగుటూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

హనుమాన్ జంక్షన్, ఏలూరు బైపాస్ రోడ్దు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 44 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

  1. జయదేవ్ హిందూ ఎయిడెడ్ పాఠశాల
  2. శ్రీ చైతన్య హైస్కూల్.
  3. గీరాంజలి హైస్కూల్, బాపులపాడు.
  4. వి.విద్యానికేతన్, వీరవల్లి.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి వేగిరెడ్డి ప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికైనారు.[3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయంసవరించు

ఈ గ్రామంలో శివుడు శ్రీ ముక్తికాంత సమేత శ్రీ ముక్తేశ్వరస్వామిగా పూజలందుకొనుచున్నాడు. ఈ శివాలయంలొ కార్తీకమాసం సందర్భంగా మహాన్యాసపూర్వ ఏకాదశ రుద్రాభిషేకములు, ఏకవారాభిషేకములు, విశేషార్చనలు నిర్వహించెదరు. కార్తీక మాసంలో వచ్చు, శివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంనకు అత్యంత విశిష్తత ఉన్నది గనుక, ఆ రోజున ఇక్కడ, శివునికి విశేషాభిషేకాలు, అన్నాభిషేకం చేసి, భక్తులకు భారీగా అన్నసమారాధన చేయుదురు. ఈ ఆలయప్రాంగణంలో నూతనంగా రు. 4.5 లక్షలవ్యయంతో ఉత్సవ మండపం నిర్మించుచున్నారు. ఇది పూర్తి అయినచో, ఆలయంలో ఉత్సవాలు, హోమాలు నిర్వహించేటందుకు సరియైన వేదికగా ఉపయోగపడుతుంది. [2]&[4]

శ్రీ కోదండరామాలయంసవరించు

పెరికీడులోని ఏలూరు కాలువ వంతెన వద్ద, స్థానిక జూనియర్ కళాశాల ప్రక్కన ఉన్న ఈ పురాతన రామాలయం శిథిలమవడంతో, మహిళలు, భక్తులు, గ్రామస్థులు 10 లక్షల రూపాయల వ్యయంతో పునర్నిర్మాణం చేపట్టినారు. ఇందులో భాగంగా గర్భగుడిలోని మూలవిరాట్టులను భద్రపరచే కార్యక్రమానికి 2013, జూన్-2 సోమవారం నాడు శ్రీకారం చుట్టినారు. ఈ నేపథ్యంలో, శాంతిహోమం, ప్రత్యేకపూజలు నిర్వహించి, విగ్రహాలను సమీపంలో నిర్మించిన చిన్న మందిరంలో తాత్కాలికంగా ప్రతిష్ఠించి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [3]

ఈ ఆలయ పునర్నిర్మాణం పూర్తిచేసి, 2015, ఫిబ్రవరిలో, ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠగావించి, పూజాదికాలు పునఃప్రారంభించారు. ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను 2016, ఫిబ్రవరి-15,16వ్ తెదీలలో వైభవంగా నిర్వహించారు. ఈ 2 రోజులూ ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. 16వ తేదీ మంగళవారంనాడు, ఆంజనేయస్వామివారికి ఆకుపూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణగావించారు. [7]

శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో 2014, సెప్టెంబరు-14, ఆదివారం నాడు అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించారు. మద్యాహ్నం నుండి అమ్మవారి ఊరేగింపును నిర్వహించారు. డప్పు వాద్య విన్యాసాలు, యువకుల నాట్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నది. [5]

ఈ ఆలయం బైపాస్ రహదారికి అడ్డుగా ఉండటంతో దీనిని తొలగించి వేరేచోటికి తరలించవలసివచ్చింది. అందువలన సమీపంలోనే నూతనప్రదేశంలో ఆలయనిర్మాణానికి ఇటీవల శాస్త్రోక్తంగా శంకుస్థాపన నిర్వహించారు. [8]

గ్రామస్థులు కమీటీగా ఏర్పడి, శివాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు 2016, అక్టోబరు-13వతేదీ గురువారంనుండి, 15వతేదీ శనివారం వరకు నిర్వహించారు. గంగానమ్మ అమ్మవారి విగ్రహంతోపాటు శ్రీ గణపతి, శ్రీ సుబ్రహమణ్యేశ్వర, పోతురాజు, కాలభైరవస్వామి వారల విగ్రహాలను గూడా ప్రతిష్ఠించారు. ఆఖరిరోజైన శనివారంనాడు రెండువేలకు పైగా భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ అలయ గర్భగుడి దాత శ్రీ నక్కా గాంధీ. ఈ ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ నిర్వహించి 16 రోజులైన సందర్భంగా, 2016, అక్టోబరు-30, ఆదివారంనాడు, ఆలయంలో అమ్మవారికి జలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. [9]&[10]

శ్రీ విజయగణపతి, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారల ఆలయంసవరించు

స్థానిక శివాలయం సమీపంలో నాలుగు రహదారుల కూడలిలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2017, ఆగస్టు-9వతేదీ బుధవారంనాడు, శ్రీ విజయగణపతి, శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ గణపతి హోమం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఆ పిదప, విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [11]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామానికి చెందిన శ్రీ చొప్పర నారాయణరావు, ఆటో నడుపుతూ జీవనం సాగించుచున్నారు. వీరి కుమార్తె జయశ్రీ, చిన్నప్పటినుండి చదువులో ప్రతిభ చూపుచున్నది. పేదరికాన్ని జయించి, చదువులో అగ్రగామిగా నిలవడంతోపాటు, వివిధ అంశాలలో ప్రతిభచూపుచూ ఇతరులకు ఆదర్శంగా నిలుచుచున్నది. దాతలసాయంతో ఈమె చదువుకొనసాగించుచూ, 10వ తరగతిలో 9.8 గ్రేడ్ మార్కులు సాధించి, ఇటీవల తిరుపతిలో ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకున్నది. ఈమె ఇంటరు మొదటి సంవత్సరం పరీక్షలలో, కళాశాల మొత్తంమీద ప్రథమస్థానం చేజిక్కించుకుని ఇప్పుడు రెండవ సంవత్సరం చదువుచున్నది. [6]

గణాంకాలుసవరించు

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2014-07-18 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Bapulapadu/Parikeedu". Retrieved 22 June 2016. External link in |title= (help)[permanent dead link]
  3. ఈనాడు కృష్ణా జులై 17, 2013.

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు విజయవాడ, 2013, నవంబరు-4; 4వపేజీ. [3] ఈనాడు విజయవాడ; 2014, జూన్-3; 5వపేజీ. [4] ఈనాడు విజయవాడ; 2014, జూన్-9; 4వపేజీ. [5] ఈనాడు విజయవాడ; 2014, సెప్టెంబరు-15; 5వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015, మే-31; 4వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2016, ఫిబ్రవరి-17; 4వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2016, మే-3; 4వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2016, అక్టోబరు-16; 7వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2016, నవంబరు-1; 7వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2017, ఆగస్టు-10; 6వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=పెరికీడు&oldid=2942639" నుండి వెలికితీశారు