పైళ్ల శేఖర్ రెడ్డి

తెలంగాణ రాజకీయ నాయకుడు

పైళ్ల శేఖర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి నుండి భువనగిరి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలల్లో భువనగిరి శాసనసభ నియోజకవర్గం ఎన్నియ్యాడు.[2] పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు.[3]

పైళ్ల శేఖర్ రెడ్డి
పైళ్ల శేఖర్ రెడ్డి


పదవీ కాలం
2014 - 2018, 2018 - ప్రస్తుతం
ముందు ఉమామాధవరెడ్డి
నియోజకవర్గం భువనగిరి శాసనసభ నియోజకవర్గం, తెలంగాణ

వ్యక్తిగత వివరాలు

జననం 1968, జనవరి 1
కదిరేణి గూడెం, ఆత్మకూరు మండలం, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు రాంరెడ్డి - అనంతమ్మ
జీవిత భాగస్వామి వనిత
సంతానం ఇద్దరు కుమారులు

జననం - విద్యాభ్యాసం

మార్చు

పైళ్ల శేఖర్ రెడ్డి 1968, జనవరి 1న రాంరెడ్డి - అనంతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలంలోని కదిరేణి గూడెంలో జన్మించాడు.[4] వ్యవసాయ కుటుంబానికి చెందిన శేఖర్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఖమ్మంలో ఉన్న ఎస్.ఈ.ఎస్. మూర్తి పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తిచేశాడు.[5]

వ్యక్తిగత జీవితం

మార్చు

శేఖర్ రెడ్డికి వనితతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

వృత్తి

మార్చు

రాజకీయాలలోకి ప్రవేశించక ముందు హైదరాబాద్, బెంగుళూర్ లలో ఒక స్థిరాస్తి రంగం (రియల్ ఎస్టేట్) లో ఉన్నాడు. సివిల్ ఇంజనీర్‌గా పనిచేశాడు.

రాజకీయ ప్రస్థానం

మార్చు

2014 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున భువనగిరి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి జిట్టా బాలకృష్ణారెడ్డిపై ఎన్నియ్యాడు. పైళ్ల శేఖర్ రెడ్డి 54,686 ఓట్లు రాగా, జిట్టా బాలకృష్ణారెడ్డి 15,416 ఓట్లు వచ్చాయి.[6] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి గెలుపొందాడు. ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతిలో 26201 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు.[7][8]

ఇతర వివరాలు

మార్చు

ఫ్లోరైడ్ కాలుష్యంతో బాధపడుతున్న నల్గొండ జిల్లా వాసులకు శుభ్రమైన త్రాగు నీటిని అందించాడు.[9]

మూలాలు

మార్చు
  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. "Andhra Pradesh Result Status". ELECTION COMMISSION OF INDIA. 21 May 2014. Archived from the original on 18 మే 2014. Retrieved 11 June 2014.
  3. "నిమ్స్ పనులను వేగవంతం చేయాలి". Sakshi. 2014-06-21. Retrieved 2021-09-20.
  4. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  5. "Pailla Shekar Reddy | MLA | Bhuvanagiri | Telangana | TRS". the Leaders Page. 2020-02-13. Retrieved 2021-09-20.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2017-03-16.
  7. "Election Commission of India - Bhongir". 6 December 2023. Archived from the original on 6 December 2023. Retrieved 6 December 2023.
  8. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  9. telugu, 10tv. "10TV - 10TV -తెలుగు తాజా వార్తలు, Latest Telugu News,Telugu News, Latest News in Telugu,Telugu Breaking News,Telugu Political News". 10TV (in telugu). Retrieved 2021-09-20.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)