పైసా 2014 ఫిబ్రవరి 7న విడుదలైన తెలుగు చిత్రం. కృష్ణ వంశీ దర్శకత్వంలో నాని, కేథరీన్ థెరీసా నటించారు.

పైసా
దర్శకత్వంకృష్ణ వంశీ
తారాగణంనాని
కేథరీన్ థెరీసా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
ఫిబ్రవరి 7, 2014 (2014-02-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మూరుమూల నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ వస్తాయి. దానిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ముఖ్యమంత్రి పదవికోసం వెంపర్లాడుతున్న ఓ మంత్రిని యాభై కోట్లు ఖర్చుపెట్టి అక్కడి అభ్యర్థిని ఎలాగైనా గెలిపించమని ఆదేశిస్తుంది. హవాలా ద్వారా యాభై కోట్ల రూపాయలను ఓ పోలీస్ అధికారి ద్వారా పాతబస్తీ నుండి ఎలక్షన్లు జరిగే నియోజకవర్గానికి సదరు మంత్రిగారు పంపుతారు. ఇదిలా ఉంటే... ఓల్డ్‌ సిటీలో షేర్వాణీ మోడల్‌గా జీవితం సాగిస్తుంటాడు ప్రకాశ్. డబ్బు ఉంటేనే మనిషికి గౌరవం అనేది అతని నమ్మకం. ఎలాగైనా కోటి రూపాయలు సంపాదించాలనుకుంటాడు. అందుకోసం ఏం చేయడానికైనా రెడీ అంటాడు. తనతోపాటే బట్టల దుకాణంలో పనిచేసే నూర్జహాన్ అంటే అతనికి ఇష్టం. కానీ ఆ విషయం ఎప్పుడూ బైట పెట్టడు. మంత్రి కుమార్తె స్వీటీతో ఏర్పడిన పరిచయాన్ని, ప్రణయంగా మార్చి డబ్బులు కొట్టేయొచ్చునని ఓ దశలో ప్రకాశ్ భావిస్తాడు. వీరిద్దరి మధ్య పెరిగిన అనుబంధాన్ని చూసి, నూర్జహాన్ ఓ దుబాయ్ షేక్‌ను పెళ్ళి చేసుకుని, తన కుటుంబాన్ని కష్టాలనుండి బైట పడేయాలని చూస్తుంది. ఆ విషయం తెలుసుకున్న ప్రకాశ్ ఆ పెళ్ళి ఆపి, చిన్నపాటి ఫైట్ చేసి, నూర్జహాన్‌ను తీసుకుని దారిలో ఆగి ఉన్న ఓ ఇన్నోవాలో పారిపోతాడు. ఆ ఇన్నోవాలోనే మంత్రి బై ఎలక్షన్ల కోసం పంపుతున్న యాభై కోట్లు ఉంటాయి. కోటి రూపాయల కోసం ఆశపడిన ప్రకాశ్‌కు ఏకంగా యాభై కోట్లు దొరికినట్టవుతుంది. మరి నూర్జహాన్ మనుషులు ప్రకాశ్‌ను వదిలిపెట్టారా? మంత్రి తన యాభై కోట్లను దక్కించుకోవడం కోసం ఏం చేశాడు? డబ్బులుంటేనే మనిషికి గౌరవం అనుకున్న ప్రకాశ్‌కు దానిని మించినది కూడా ఉందనే విషయం అర్థమైందా? ఇదంతా మిగతా కథ.[1]

నటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు -- కృష్ణ వంశీ
  • రచన—పాత్రికేయ, బినోజి, పద్మశ్రీ

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. వడ్డి ఓంప్రకాశ్ (17 February 2014). "పైసా వసూల్ మూవీ కాదు". జాగృతి వారపత్రిక. Retrieved 15 February 2024.