పొట్టి ప్లీడరు
పొట్టి ప్లీడరు 1966 మే 5లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పద్మనాభం, గీతాంజలి, శోభన్ బాబు, వాణిశ్రీ, చిత్తూరు నాగయ్య, రమణారెడ్డి, నిర్మలమ్మ, వల్లూరి బాలకృష్ణ, రావికొండలరావు, ప్రభాకరరెడ్డి, ముక్కామల కృష్ణమూర్తి, పేకేటి శివరాం, వంగర వెంకటసుబ్బయ్య, పెరుమాళ్ళు, డి.రామానాయుడు నటించగా, ఎస్.పి.కోదండపాణి సంగీతం అందించారు.[2]
పొట్టిప్లీడరు (1966 తెలుగు సినిమా) | |
చందమామ లో చలన చిత్రప్రకటన | |
---|---|
దర్శకత్వం | కె.హేమాంబరధరరావు |
తారాగణం | పద్మనాభం, గీతాంజలి, శోభన్ బాబు, వాణిశ్రీ, చిత్తూరు నాగయ్య, రమణారెడ్డి, నిర్మలమ్మ, వల్లూరి బాలకృష్ణ, రావికొండలరావు, ప్రభాకరరెడ్డి, ముక్కామల కృష్ణమూర్తి, పేకేటీ శివరాం, వంగర వెంకటసుబ్బయ్య, పెరుమాళ్ళు, డి.రామానాయుడు |
సంగీతం | ఎస్.పి.కోదండపాణి |
నిర్మాణ సంస్థ | రేఖా & మురళీ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
పొట్టి ప్లీడరు సంక్షిప్త చిత్ర కథ
మార్చుప్రసాద్ (పద్మనాభం) పట్టణంలో లా చదివి, పరీక్ష రాసి, తన సొంత ఊరు తిరిగి వస్తాడు. కొన్ని రోజుల తరువాత లా పరీక్ష ఫలితాలు వస్తాయి. అందులో ప్రసాద్ ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణుడు అవుతాడు. కొంత కాలం తరువాత తన తల్లి మరణిస్తుంది. దానితో ప్రసాద్ ఇల్లు, పొలం అమ్మేసి ఊళ్ళో బాకీలన్నీ తీర్చేసి, లాయరు ప్రాక్టీసు కోసం పట్టణంలో వాళ్ళ మావయ్య ఇంటికి వస్తాడు. ప్రసాద్ కి తన మావయ్య శాంతి (గీతాంజలి) కూతురు అంటే చాలా ఇష్టం. కాని శాంతి (గీతాంజలి), వాళ్ళింట్లోనే అద్దెకుండే రామారావు (శోభన్ బాబు) ని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలిసిన ప్రసాద్ ఎంతో బాధపడతాడు. కాని తరువాత బాగా ఆలోచించి, వాళ్ళిద్దరికి పెళ్ళి చేస్తాడు. ప్రసాద్ మరొక సీనియర్ లాయర్ దగ్గర ప్రాక్టీస్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి, తానే సొంతంగా కేసులు వాదించే స్థానానికి వస్తాడు. చివరికి తన మరదలి భర్తే హత్య చెయ్యకుండా, చేసినట్టుగా ఆధారాలు లభిస్తాయి. కాని ప్రసాద్ హత్య చెయ్యలేదని నిరూపిస్తాడు. ఆ తరువాత లాయరుగా ప్రసాద్ ఆ పట్టణంలో ప్రసాద్ ప్రసిద్ధి పొదుంతాడు.
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: కె.హేమాంబరధరరావు
- సంగీతం: ఎస్.పి.కోదండపాణి
- నిర్మాణ సంస్థ: రేఖా & మురళీ ఆర్ట్స్
పాటలు
మార్చు- చీకటి విచ్చునులే - వెన్నెల వచ్చునులే[3] - ఘంటసాల - రచన:శ్రీశ్రీ
- ఊగెను మనసూ పొంగెను వయసూ ఎందుకనో అది ఏమో ఏమో - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, రచన: దాశరథి
- ఝల్లుమనీ నను సోకెను గాలీ గుండెలలో వింత చలీ - టి.ఆర్.జయదేవ్, పి.సుశీల - రచన:వీటూరి
- ఇదిగో తమాషా - పి.సుశీల - రచన: రాజశ్రీ
- పొట్టిప్లీడరుగారూ లవ్లో జాలీ ఏలా చూడరు మీరూ- బి.పద్మనాభం, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: అప్పలాచార్య
- నీ అందమన్నది నీలో చూడాలి , ఎస్.జానకి, మాధవపెద్ది , పిఠాపురం, రచన: ఆరుద్ర
- లాలిజో లాలీజో లాలీ లాలీ, పి.సుశీల, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు.
మూలాలు
మార్చు- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.
- ↑ "హాస్యరత్న పద్శనాభం 'పొట్టిప్లీడరు'". సితార. Archived from the original on 2020-02-16. Retrieved 2020-07-14.
- ↑ సరోజా శ్రీశ్రీ (సంకలనం) (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.