ప్రకాశం జిల్లా రచయితల సంఘం
ప్రకాశం జిల్లా రచయితల సంఘం టూకీగా ప్ర.ర.సం, ప్రకాశం జిల్లా కవులు, రచయితలను సంఘటితం చేయటం, ఒకే వేదిక పైకి తీసుకురావటం కోసం ఏర్పాటయింది.
ఆశయం | జిల్లాలోని కవులు, రచయితలను సంఘటితం చేయటం |
---|---|
స్థాపన | ఏప్రిల్,1966 |
వ్యవస్థాపకులు | నాగభైరవ కోటేశ్వరరావు, ఈమని దయానంద, మల్లవరపు జాన్,యం.వి.యస్. శర్మ, బి.సి. నారాయణరావు, నల్లూరి వెంకటేశ్వర్లు |
ప్రధాన కార్యాలయాలు | ఒంగోలు |
సేవా | ప్రకాశం జిల్లా |
అధికారిక భాష | తెలుగు |
అధ్యక్ష్యులు | బి హనుమారెడ్డి |
ప్రధాన కార్యదర్శి | పొన్నూరు వెంకట శ్రీనివాసులు |
ముఖ్యమైన వ్యక్తులు | కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి బీరం సుందరరావు |
చరిత్ర
మార్చుజిల్లాకు చెందిన విఖ్యాత కవి, సాహితీవేత్త డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు, కవి మిత్రులు ఈమని దయానంద, మల్లవరపు జాన్, యం.వి.యస్. శర్మ, బి.సి. నారాయణరావు, నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న) తదితరులతో కలసి 1966లో ఒంగోలు తాలూకా 'తాలూకా రచయితల సంఘాన్ని' స్థాపించారు. సంతపేటలోని బెజవాడ పిచ్చయ్య ఆఫీసులో వారం, వారం కార్యవర్గ సమావేశాలు, నెలకోసారి సాహిత్య కార్యక్రమాలు జరిగేవి. జిల్లాలోని కవులు, రచయితలను సంఘటితం చేయాలన్నదే సంస్థ స్థాపన ఉద్దేశం. 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు జిల్లా ఆవిర్భవించింది. 1971జూనలో ‘ఒంగోలు జిల్లా రచయితల సంఘం’ (పూర్వపు తాలూకా రచయితల సంఘం) మహాసభలు ఎ.బి.యం. గ్రౌండ్స్‌లో ప్రప్రథమంగా జరిగాయి. అప్పటి జిల్లా మంత్రి, కొండా నారపరెడ్డి సహకారంతో మూడు రోజుల సభలు కన్నుల పండుగగా జరిగాయి. ప్రముఖ కవులు దాశరథి, సి. నారాయణరెడ్డిలకు గండపెండేరాలతో సత్కారం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో ప్రముఖ కవులు సభల్లో పాల్గొన్నారు. ‘ప్రథమ మహాసభల ప్రత్యేక సంచిక’తో పాటు పొద్దు పొడుపు’ కవితా సంకలనాన్ని ఒం.జి.ర.సం. ప్రచురించింది.
1972 మే 12న ఒంగోలు జిల్లాకు ప్రకాశం జిల్లాగా పునః నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒ.జి.ర.సం. ప్రకాశం జిల్లా రచయితల సంఘంగా (ప్ర.ర.సం) నూతన ప్రస్తానానికి శ్రీకారం చుట్టింది. పురోగమన పథంలో పయనిస్తుంది.[1]
కార్యవర్గం
మార్చు- అధ్యక్ష్యులు - బి హనుమారెడ్డి
- ప్రధానకార్యదర్శి - పొన్నూరు వెంకట శ్రీనివాసులు
- సహాయ కార్యదర్శి - బీరం సుందరరావు[2]
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-01-07. Retrieved 2018-02-16.
- ↑ http://www.prajasakti.com/Article/Prajagalam/1739687[permanent dead link]