ప్రకాష్ కోవెలమూడి

భారతీయ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు.

ప్రకాష్ కోవెలమూడి, భారతీయ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు. 2004లో మార్నింగ్ రాగా సినిమాను రూపొందించి, ఆ సినిమాతో నటుడిగా బాలీవుడ్ సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. 2004లో బొమ్మలాట అనే పిల్లల సినిమా తీశాడు. ఈ సినిమా 53వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చిత్రం అవార్డును అందుకుంది.[1] 2011లో అనగనగా ఓ ధీరుడు అనే ఫాంటసీ సినిమా, 2019లో హిందీలో జడ్జిమెంటల్ హై క్యా అనే బ్లాక్ కామెడీ సినిమా తీశాడు.[2][3]

ప్రకాష్ కోవెలమూడి
జననం25 జూన్, 1975
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నటుడు
క్రియాశీల సంవత్సరాలు2002 - ప్రస్తుతం
బంధువులుకోవెలమూడి సూర్యప్రకాశరావు (తాత)
కె. రాఘవేంద్రరావు (తండ్రి)
శోభు యార్లగడ్డ (బావ)

జీవిత విషయాలు

మార్చు

తెలుగు సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు, కోవెలమూడి సూర్యప్రకాశరావు మనవడైన ప్రకాష్ 1975, జూన్ 25న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. న్యూయార్క్ లోని లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చదువుకున్నాడు.[4]

సినిమారంగం

మార్చు

2002లో తెలుగులో వచ్చిన నీతో సినిమాలో తొలిసారిగా నటించిన ప్రకాష్,[5] ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఒక ఫాంటసీ సినిమాలో హీరోగా నటించాలనుకున్నాడు, కాని ఆ సినిమా నిలిపివేయబడింది.[6] మార్నింగ్ రాగా సినిమాలో నటించాడు. 2004లో బొమ్మలాట, 2011లో అనగనగా ఓ ధీరుడు, సినిమాలు తీశాడు.[7][8]

సినిమాలు

మార్చు
నటుడిగా
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2002 నీతో మాధవ్
2004 మార్నింగ్ రాగా అభినయ్ ఇంగ్లీష్ చిత్రం
దర్శకుడిగా
సంవత్సరం సినిమా ఇతర వివరాలు
2004 బొమ్మలాట తెలుగు పిల్లల చిత్రం
2011 అనగనగా ఓ ధీరుడు
2015 సైజ్ జీరో
2015 ఇంజి ఇడుప్పజగి తమిళ చిత్రం
2019 జడ్జిమెంటల్ హై క్యా హిందీ చిత్రం

అవార్డులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Untitled Page" (PDF). pib.gov.in. Retrieved 25 April 2021.
  2. "Judgementall Hai Kya box office collection". Firstpost. 2019-08-02. Retrieved 25 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. ""Judgemental Hai Kya is quirky!" – Kanika Dhillon". Kovid Gupta Films. 2019. Retrieved 25 April 2021.
  4. "Home |". bollywhat.boards.net. Retrieved 25 April 2021.
  5. Raghavan, Nikhil (2010-10-24). "The homecoming". The Hindu. ISSN 0971-751X. Retrieved 25 April 2021.
  6. "SS Raja Mouli - Telugu Cinema interview - Telugu film director". www.idlebrain.com. Retrieved 25 April 2021.
  7. "Movie Review : Anaganaga O Dheerudu". Archived from the original on 16 జనవరి 2011. Retrieved 25 April 2021.
  8. "Rich visuals, top-class technology makes 'Anaganaga...' a must watch IndiaVision Latest Breaking News". Archived from the original on 4 మార్చి 2016. Retrieved 25 April 2021.
  9. "A Walt Disney film in Telugu!". Rediff. Retrieved 25 April 2021.