బొమ్మలాట (సినిమా)
బొమ్మలాట ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెలుగులో వెలువడిన ఒక బాలల సినిమా.[1] ఈ సినిమాకు A Belly Full of Dreams అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఈ చిత్రానికి కళాదర్శకునిగా భూపేష్ ఆర్. భూపతి వ్యవహరించగా ఈ సినిమాలోని తోలుబొమ్మలను ప్రముఖ పప్పెటీర్ దాడి పదంజీ తయారు చేశాడు. ఈ చిత్రం 53వభారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికయ్యింది.[2] ఈ చిత్రంలో సాయికుమార్ నటనకు అతనికి ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారం లభించింది.[3][4]
బొమ్మలాట | |
---|---|
దర్శకత్వం | ప్రకాష్ కోవెలమూడి |
రచన | జె. కె. భారవి |
నిర్మాత | గుణ్ణం గంగరాజు ఆర్.కె.ఫిలిం అసోసియేట్స్ స్పిరిట్ మీడియా |
ఛాయాగ్రహణం | కిరణ్ రెడ్డి |
సంగీతం | ఆర్. పి. పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | స్పిరిట్ మీడియా |
విడుదల తేదీ | 2004 |
దేశం | భారతదేశం |
నటీనటులు
మార్చు- సాయి కుమార్ (బాల నటుడు) - రాము
- శ్రియా సరన్ - స్వాతి
- అల్లరి నరేష్ - బాబు
- శివ కుమార్ (బాల నటుడు) - ఛోటూ
- తనికెళ్ళ భరణి ... టీ కొట్టు యజమాని
- వీరేన్ తంబిదొరై ... టీ కొట్టు కస్టమర్
- చిట్టిబాబు
- సూర్య - రాము తండ్రి
- శ్రావణి - రాము తల్లి
- ఎన్. శివప్రసాద్- చెత్త పేపర్లు కొనేవాడు
- జె.కె.భారవి - పోలీస్ కానిస్టేబుల్
- ప్రీతి నిగమ్- వైశాలి (సంఘసేవకురాలు)
కథ
మార్చుస్కూలుకు వెళ్లి చదువుకోవాలనే గాఢమైన కోరిక కలిగిన ఒక కుర్రవాని కథ ఇది. రాము (సాయి కుమార్) ఒక పూరి గుడిసెలో నివసిస్తూ వుంటాడు. ఇతని తండ్రి (సూర్య) ఒక తోలుబొమ్మలాట ఆడించే కళాకారుడు. పని లేక తాగుబోతుగా మారి భార్యను చితకబాదుతూ ఉంటాడు. తన తండ్రి నుండి తల్లిని కాపాడటానికి రామూ తండ్రికి కావలసిన మందు త్రాగిస్తూ ఉంటాడు. రోజూ చెత్త పేపర్లను ఏరుకుంటూ వాటిని అమ్మి తల్లికి గుట్కా, తండ్రికి మందు కొనిస్తూ ఉంటాడు. రామూకు చదువుకోవాలని ఎంతో ఉంటుంది. కానీ అతని పరిస్థితులు అతడిని స్కూలుకు వెళ్లి చదువుకునే అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వలేదు. అతడు చదువుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాడు. ఇతని స్నేహితుడు ఛోటూ(శివ కుమార్) ఇతని తపనను అర్థం చేసుకుని అతనికి చేతనైన సాయం చేస్తాడు. చివరకు ఎలాగైతేనేం స్కూలు ఫీజుకు డబ్బులు తక్కువగా ఉన్నా కూడా ఒక రోజు స్కూలులోకి అడుగు పెడతాడు. అదే రోజు స్కూలులో అగ్నిప్రమాదం జరుగుతుంది. అగ్గిలో చిక్కుకు పోయిన ఒక విద్యార్థిని రామూ రక్షిస్తాడు. హెడ్‌మాస్టర్ రాము గురించి తెలుసుకుని అతడిని ఫీజు లేకుండా స్కూలులో చేర్చుకుంటానని, హాస్టల్‌లో పెట్టుకుని స్కాలర్‌షిప్ వచ్చేటట్లు చేస్తానని హామీ ఇస్తాడు. అయితే మరుసటి రోజే ఆ స్కూలు మూతపడుతుంది. అగ్నిప్రమాదం జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఆ స్కూలు లైసెన్సును రద్దు చేసి మూసివేస్తారు. రామూ ఆశలు నీరుగారి పోతాయి. అయితే ఆ స్కూలును మళ్లీ తెరిపించడానికి అగ్నిప్రమాదంలో రామూ చేసిన సాహసాన్ని ఎమ్మెల్యే కొడుకు చేసినట్లుగా చూపి ఆ అబ్బాయిని రాష్ట్రపతి సాహసబాలల అవార్డుకు సిఫారసు చేస్తారు. అయితే ఈ అన్యాయాన్ని రామూ స్నేహితులు అడ్డుకుని ఆ అవార్డును రాముకు వచ్చేటట్లు చేసి రామును స్కూలులో చదివే అవకాశాన్ని కల్పిస్తారు.
అవార్డులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "The Hindu : Andhra Pradesh / Visakhapatnam News : "`Bommalata' to be staged on August 1"". Archived from the original on 2007-10-01. Retrieved 2018-05-05.
- ↑ 2.0 2.1 http://pib.nic.in/archieve/others/2007/aug07/53rd_nfa-2005.pdf
- ↑ "CineGoer.com - News (August 2007) - 'Bommalata' Bags National Award". Archived from the original on 2011-07-21. Retrieved 2018-05-05.
- ↑ News : Bommalata, its artiste win National Awards Archived 26 సెప్టెంబరు 2007 at the Wayback Machine
- ↑ Bommalata bags National award - The Times of India