ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు (ఆంగ్లం : Natural Disaster కొన్ని సార్లు Natural Calamity) ప్రకృతిలో సంభవించే విపత్తు లేదా విపరీత పరిణామాలే ఈ ప్రకృతి వైపరీత్యాలు (ఉదా: అగ్నిపర్వతాలు బద్దలు కావడం, భూకంపం, లేదా కొండచరియలు రాలడం లాంటివి). ఈ విపత్తులు లేదా వైపరీత్యాల వలన మానవ కార్యకలాపాలకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. వీటినుండి కాపాడుకునేందుకు మానవులవద్ద తగు ఆపత్కాల నియంత్రణ కార్యక్రమాలు గాని వాటి పరికరాలు గాని లేనదువలన నష్టం ఇంకనూ ఎక్కువ కానవస్తుంది. మన దేశంలో ఇలాంటి సౌకర్యాలు ఇంకనూ తక్కువ కానవస్తాయి. వీటికి గల అనేక కారణాలలో కొన్ని, ఈ వైపరీత్యాలపట్ల సరైన అవగాహన లేకపోవడం, వీటి తీవ్రతలు తెలుసుకోలేకపోవడం, వీటిని ముందుగానే గుర్తించగలిగే సౌకర్యాలు లేకపోవడం, తదనంతరం తీసుకోవలసిన చర్యల గూర్చి తగిన వ్యూహరచనలు లేకపోవడం. మరీ ముఖ్యంగా ప్రజలలో చైతన్యం లేకపోవడం. వీటి కారణంగా వాటిల్లే నష్టాలు, తదనంతర దుష్ఫలితాలు చాలా ఘోరంగా కనిపిస్తాయి.[1][2] కొన్ని సార్లు, ఈ విపత్తులు ప్రకృతి పరమైనవి కావని, వీటి వెనుకా మానవ కృత్యాలు వున్నాయని, తదనంతరమే ప్రకృతి ఈ విధంగా ప్రతిస్పందిస్తూ వున్నదని కొందరు వాదిస్తున్నారు.[3]

భూమి కంపించడం వలన జరిగే వైపరీత్యాలుసవరించు

హిమ సంపాతాలుసవరించు

 
వెనుకవైపు, హిమసంపాతాలు, టింపనోగాస్ పర్వతం, ఉటాహ్
పేర్కొనదగ్గ హిమ సంపాతాలు

భూకంపాలుసవరించు

భూకంపాలు తమకు తాము చాలా తక్కువగా మానవులు, జంతువుల ప్రాణాలకు నష్టం కలిగిస్తాయి. రెండవ స్థాయిలోని పర్యవసానాలవలనే ఎక్కువ ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఉదాహరణకు, భూకంపాలవలన పెద్ద పెద్ద భవంతులు, వంతెనలు, నిర్మాణాలు, ఇండ్లు కూలిపోవడం వలనే ఎక్కువ ప్రాణ నష్టం సంభవిస్తుంది. నిప్పంటుకోవడం, సునామీలు, అగ్నిపర్వతాలు బ్రద్దలు కావడం లాంటి ఘటనలవలనే ప్రాణనష్టాలు ఎక్కువ.

భూగర్భంలో గల తప్పిదాల వలన, తీవ్రమైన వత్తిడిని విసర్జించే స్థితిలో భూకంపాలు సంభవిస్తాయి.

కొన్ని ప్రస్తావింప దగిన భూకంపాలు :

 
2004 హిందూమహాసముద్ర భూకంపం అనంతరం సునామీ సంభవించడంతో అతలాకుతలమైన సుమిత్రాలోని ఒక గ్రామం.
 • 7.9 మాగ్నిట్యూడ్, మే 12, సిచువాన్ భూకంపం : చైనా లోని సిచువాన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం, దీని వలన 61,150 మంది మరణించారు. (మే 27, 2008 వరకు).

లహార్ లుసవరించు

లహర్ అగ్నిపర్వతం బ్రద్దలైనప్పుడు, అగ్నిపర్వత చరియలు దొర్లిపడడాన్నే లహర్ అని సంబోధిస్తారు. 1953 టాంగివై విపత్తు లహర్ చే ఏర్పడినది, 1985 ఆర్మెరో ట్రాజెడీ వల్ల ఆర్మెరో పట్టణం సమాధియై 23,000 మంది మరణించారు (సజీవ సమాధి అయ్యారు).

కొండచరియలు రాలడం, మట్టి ప్రవాహాలుసవరించు

కాలిఫోర్నియా ప్రాంత భాగాలలో తరచూ ఇవి సంభవిస్తుంటాయి, వీటికి కారణం భారీవర్షాలు.

అగ్నిపర్వత ప్రేలుళ్ళుసవరించు

 • బ్రద్దలవడం (Eruption) కూడా ఒక విపత్తే, అగ్నిపర్వతం గాని రాళ్ళు చరియలు గాని విరిగి పడినపుడు, జరిగే బ్రద్దలయ్యే ప్రక్రియలు ఈ కోవకు వస్తాయి. ఈ విడుదల తీవ్రమైన ప్రాణనష్టాన్ని కలుగజేస్తుంది.
 • లావా అగ్నిపర్వతం బ్రద్దలయినపుడు విడుదలయ్యే ద్రవ పదార్థంlu, ఈ పదార్థంలో విపరీతమైన ఉష్ణోగ్రతలో కరిగిన రాళ్ళు, మట్టి, లవణాలు, ఖనిజాలు మున్నగునవి ఉంటాయి. ఈ లావా (ఉదాహరణ: a`a) లేదా లేహ్యంలాంటి చిక్కటి జిగురు పదార్థం. (ఉదాహరణ : pahoehoe). అగ్నిపర్వతం నుండి వేరై, భవనాలకు ఇండ్లకు, వృక్షజాలానికి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది.
 • అగ్నిపర్వత బూడిద - సాధారణంగా చల్లబడిన బూడిద - ఎగిసి పడి ఓ మేఘం ఆకృతిని పొందుతుంది, ఆ తరువాత దగ్గరిప్రదేశాలలో దట్టంగా స్థిరపడుతుంది. నీటితో కలిసిన తరువాత, ఓ కాంక్రీట్ పదార్థంలా తయారవుతుంది. ఇది ఏ స్థలంపై రాలి స్థిరపడుతుందో ఆ ప్రదేశంలో కల వస్తువులన్నీ సజీవ సమాధి అవుతాయి.
 • సూపర్ వాల్కనో లేదా మహా అగ్నిపర్వతాలు : టోబా కెటాస్ట్రఫ్ సిద్ధాంతం ప్రకారం, 70 నుండి 75 వేల సంవత్సరాల క్రితం, ఒక మహా అగ్నిపర్వతం బ్రద్దలయిన సంఘటన టోబా సరస్సు వద్ద జరిగింది. ఈ సంఘటనలో దాదాపు 10,000 మంది లేదా 1,000 మానవ జంటలు నాశనమయ్యాయి, దీనివలన మానవ పరిణామం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ సంఘటనలో అతిముఖ్యంగా బూడిద మేఘం ఏర్పడి ప్రపంచ వాతావరణ పరిస్థితులకు ప్రతికూలంగా పనిచేసింది. కొన్ని సంవత్సరాల వరకు వాతావరణ పరిస్థితుపై, ఉష్ణోగ్రతపై ప్రభావాన్ని చూపింది.
 • పైరోక్లాస్టిక్ ప్రవాహాలు అగ్నిపర్వతం బ్రద్దలైనప్పుడు వెలువడే బూడిద పైకి ఎగిసి మేఘంలా ఏర్పడుతుంది, తన బరువువల్ల అమిత వేగంగా భూమిని తాకే బూడిద, భూమిని తాకిన మరుక్షణ ఒక వేగవంతమైన ప్రవాహంలా మారి నలుదిశలా వ్యాపిస్తుంది. ఈ వ్యాప్తి ఎంత వేగంగా వుంటుందంటే దీని క్రింద వచ్చే ప్రతి వస్తువునూ భస్మీపటలంచేస్తూ సజీవ సమాధి చేస్తుంది. ఇదో వింతైన విపత్తులా కానవస్తుంది. పోంపెయీ నగరం దీని కారణంగానే నాశనమైనదని భావింపబడుతుంది.
 • లహర్‌లు, అగ్నిపర్వత బ్రద్దలై వీటి పర్యవసానంగా ఏర్పడేవి.

జల వైపరీత్యాలుసవరించు

 • వరదలు

కొన్ని ముఖ్యమైన ప్రస్తావింపదగ్గ వరదలు:

 • హువాంగ్ హే (యెల్లో నది) చైనా : ఈ నది వరదలు సర్వసాధారణం. 1931 మహా వరదలు వలన 8,00,000, 40,00,000 మరణాలు సంభవించాయని అంచనా.
 • 1933 మహా వరదలు : అ.సం.రా. లోని ఈ వరదలు చరిత్రలోనే మహా భయానకమని ప్రతీతి.
 • 1998 యాంగ్‌ట్జీ నదీ వరదలు చైనా : ఒక కోటీ నలభై లక్షల జనాలను నిరాశ్రయులను చేసింది.
 • 2000 మొజాంబిక్ వరదలు : దాదాపు మూడువారాలు దేశం మొత్తాన్ని ముంచెత్తాయి, వీటి కారణంగా వేలకొద్దీ మరణాలు సంభవించాయి, దేశాన్ని తీవ్రసంక్షోభంలో ముంచెత్తాయి.
 • 2018 కేరళ వరదలు : 164 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 85,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు. 14 జిల్లాలో పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించారు.
 • 2019 జయపుర వరదలు : 2019 మార్చి 16న హఠాత్తుగా సంభవించిన వరదల్లో ఇండొనేషియాకు చెందిన పాపువా ప్రావిన్సులోని జయపుర రీజెన్సీ చిక్కుకుంది. కనీసం 113 మంది ఈ రెండు ఘటనల్లోనూ మరణించారు.

ట్రాపికల్ తుఫానులు : ఈ తుఫానుల వల్ల విపరీతమైన వరదలు, స్టార్మ్ సర్జ్ ఏర్పడి క్రింది పర్యావసానాలు:

సునామీలుసవరించు

 
థాయిలాండ్ ఆవో నాంగ్ను డెసెంబరు 26 2004లో భూకంపకారణంగా ఏర్పడ్డ సునామీ తాకినప్పటి దృశ్యం.

సముద్రగర్భాన భూకంపాలు విస్ఫోటనంతో ఏర్పడే విపత్తులు. ఓ ఉదాహరణ ఆవో నాంగ్, థాయిలాండ్ లో ఏర్పడిన హిందూ మహాసముద్ర భూకంపం. కొండచరియల విరిగి పడడం వల్ల సంభవించేవి ఉదా; లితుయా అఖాతం, అలాస్కా లో సంభవించింది.

వాతావరణ వైపరీత్యాలుసవరించు

 
1966 మార్చిలో సంభవించిన మంచు తుఫాను, దీనిలో చిక్కుకున్న ఓ స్టీర్.

మంచు తుఫానులుసవరించు

అ.సం.రా. లలో ప్రముఖమైన మంచు తుఫానులు :

కరవుసవరించు

ప్రసిద్ధమైన చారిత్రక కరవులు :

వడగండ్ల తుఫానులుసవరించు

ప్రత్యేకంగా ప్రస్తావింపదగ్గ ఓ వడగండ్ల తుఫాను జర్మనీ లోని మ్యూనిచ్ నగరాన్ని ఆగస్టు 31, 1986 న హడలెత్తించింది. ఈ తుఫానువల్ల, లక్షల డాలర్ల నష్టం వాటిల్లింది, భీమా కంపెనీలు కోట్లడాలర్ల కొద్దీ చెల్లించవలసి వచ్చింది.

ఉష్ణ పవనాలుసవరించు

ఇప్పటి వరకు చరిత్రలో అత్యంత భయానక ఉష్ణ పవనం (వేడి వాయువుల ప్రవాహం) 2003 యూరోపియన్ ఉష్ణ పవనం..

వాయుగుండ తుఫానులుసవరించు

హరికేన్లు, ట్రాపికల్ తుఫానులు, టైఫూనులు' మొదలగునవి, ఒకే రకమైన చక్రవాతము నకు ఉదాహరణలు : ఒక తుఫాను విధానము సముద్రపైభాగాలలో సంభవిస్తుంది. ప్రాణాంతకమైన హరికేన్ భోలా తుఫాను; అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగిన 1780 గ్రేట్ హరికేన్, మార్టినిక్, సెయింట్ యూస్టేషియస్, బార్బడోస్ లలో సంభవించింది. ఇంకో పేర్కొనదగ్గ హరికేన్ హరికేన్ కట్రీనా, అమెరికా గల్ఫ్ తీరం లో 2005 లో సంభవించి తీవ్రనష్టపరచింది.

వడగాలిసవరించు

తీవ్రమైన వడగాల్పులు, చలిగాలులను ప్రకృతి విపత్తులుగా భావించి నష్టపరిహారం ఇచ్చే అవకాశంలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి.మే నెలలో వడగాల్పులు తీవ్రంగా ఉంటాయి.వడగాల్పులను కూడా విపత్తుగా గుర్తించాలంటూ కొన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేసినా 13వ ఆర్థిక సంఘం దీనిని తిరస్కరించింది.ప్రకృతి వైపరీత్యాలైన తుపానులు, వరదల్లో మృతి చెందేవారికి ప్రభుత్వం నష్ట పరిహారాన్ని ఇస్తోంది. వడగాల్పులు కూడా ప్రకృతి సిద్ధమే అయినప్పటికీ వాటి కారణంగా మృతి చెందే వారి కుటుంబాలకు ఎటువంటి నష్ట పరిహారాన్ని అందివ్వటంలేదు.

అగ్నిసవరించు

దావానలాలు విస్తృతంగా వ్యాపించి అడవులను అగ్నిలో భస్మం చేస్తాయి. దీనికి ప్రధానమైన కారణాలు మెరుపులు, కరవు. సామాన్యంగా ఇవి మానవుల అలక్ష్యం వలన ప్రారంభమై తొందరగా వ్యాపిస్తాయి. ఇవి ప్రజా నివాసాలకు, అడవి మృగాలకు చాలా ప్రమాదం.

ఆరోగ్యము, వ్యాధులుసవరించు

మహమ్మారులుసవరించు

మహమ్మారి మానవులలో త్వరగా వ్యాపించే అంటువ్యాధి. విశ్వమంతా వ్యాపించినప్పుడు దీనినివిశ్వమారి అంటారు. మానవ చరిత్రలో ఎన్నో మహమ్మారులు, విశ్వమారులు కోట్ల కొలది మానవుల మరణానికి కారణమయ్యాయి. ఉదా: నల్ల మృతం.

క్రితం వంద సంవత్సరాలలో వచ్చిన మహమ్మరులు

కొంచెం నెమ్మదిగా వ్యాపించి ప్రపంచంలో ఆరోగ్య వ్యవస్థను ఛిద్రం చేసే వ్యాధుల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది:

కరవు కాటకాలుసవరించు

నవీన కాలంలో, కరవు సబ్-సహారన్ ఆఫ్రికాను తీవ్రంగా నష్టపరచింది. ఈ కరవులో జననష్టం చాలా తీవ్రంగా వుండినది, అయిననూ 20వ శతాబ్దంలో ఆసియాలో సంభవించిన కరవు మరణాల కన్నా ఈ కరవులో మరణాల సంఖ్య చాలా తక్కువ.

అంతరిక్షంసవరించు

ప్రభావాల సంఘటనలు (Impact events)సవరించు

నవీన కాలంలో సంభవించిన అతిపెద్ద "ప్రభావాల సంఘటన" తుంగుస్క సంఘటన జూన్ 1908 న సంభవించింది, దీని మూలంగా సంభవించిన విపత్తు, తత్ఫలితంగా ఏర్పడిన ప్రభావం తీవ్రమైనది.

సౌర జ్వాలలుసవరించు

సౌర జ్వాల ఒక సాధారణ తంతు, ఇందు సూర్యుడు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో సౌర ఉష్ణాన్ని విడుదల చేస్తాడు, ఇది సాధారణ ఉష్ణం లేదా రశ్మి కంటే అధిక మోతాదులో వుంటుంది. కొన్ని సౌర జ్వాలల ఉదాహరణలు :

 • X20 ఘటన - ఆగస్టు 16 1989
 • ఇలాంటి ఘటనే - ఏప్రిల్ 2 2001
 • ఇంతవరకూ రికార్డు చేయబడిన శక్తివంతమైన సౌరజ్వాలలు - నవంబరు 4 2003, అంచనాలు X40, X45 ల మధ్య.
 • అత్యంత శక్తివంతమైన జ్వాలలు గత 500 సంవత్సరాలుగా సెప్టెంబరు 1859 న ఏర్పడినట్లు నమ్ముతున్నారు.

నష్టపరిహారంసవరించు

బీమాసవరించు

ప్రకృతి విపత్తులు, బీమా రంగం తన పాత్రను ఎక్కువగా నిర్వర్తిస్తూ వస్తూంది. ఈ రంగం, కొన్ని నష్టాలను పూడ్చుటకు తనవంతు సహాయసహకారాలను అందిస్తుంది. హరికేన్లు, దావాలనాలు, ఇతర విపత్తులు సంభవించినపుడు ఈ బీమా రంగం చైతన్యవంతం అవుతుంది.[5]

ప్రభుత్వసాయంసవరించు

6.10.2009 నాటి రెవిన్యూ డిపార్ట్ మెంట్ జి.వో.23 ప్రకారం పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి రూ.5000,పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.4000,బట్టలకోసం రూ.1500.పాత్రలకోసం రూ.1500,బియ్యం 20 కిలోలు,కిరోసిన్ 5 లీటర్లు ఇస్తారు.నీటిలో ఇల్లు మునిగి ఉండాల్సిన సహాయ అర్హతకాలాన్ని ఏడు రోజులనుండి ఒక్క రోజుకు తగ్గించారు.మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.2లక్షలు,పాడి పశువుకు రూ.10000,గొర్రె,మేకకు రూ.1000,ఎద్దు,గాడిదలకు రూ.5000,కోళ్ళకు రూ.300 పరిహారంగా ఇస్తారు.

అగ్నిమాపకశాఖసవరించు

దీని పేరు విపత్తుల స్పందన, అగ్నిమాపక సర్వీసుల శాఖ'గా మార్చారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అత్యధికులకు గుర్తుకువచ్చే అగ్నిమాపకశాఖను ప్రజలను మరింత చేరువచేయడానికి ప్రభుత్వం దాని పేరును మార్చింది.కేవలం అగ్నిప్రమాదాలకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు,రైలు ప్రమాదాలు, వానలు, వరదలు, భూకంపాలు... ఇతర ప్రాణాపాయ పరిస్థితులు ప్రజలకు ఏర్పడినప్పుడు విపత్తుల శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగాలి. బాధితులు, ఆర్తులకు అవసరమైన సేవలు అందించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించడానికి ప్రయత్నించాలి.అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో సమర్థంగా విధులు నిర్వర్తించడానికి ఉపయోగపడే అగ్ని నిరోధక దుస్తులు, కళ్లజోళ్లు, ఎత్త్తెన క్రేన్లు ఇంకా కావాలి.వరదలోస్తే వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి 'విపత్తుల స్పందన, అగ్నిమాపకశాఖ' అధికారుల వద్ద కొన్ని పరికరాలున్నాయి. వాటి సాయంతో రంగంలోకి దిగి బాధితులను ఆదుకోవాలి.ఆపదలో ఉన్నవారు నీటమునగకుండా 'లైఫ్‌బోయ్‌లు కాపాడాలి.'లైఫ్ సేవింగ్ జాకెట్లప్రజలకివ్వాలి.గజ ఈతగాళ్లను నియమించాలి.101 నెంబరుకు ఫోన్ చేస్తే శాఖాపరంగా బాధితులకు అవసరమైన సేవలు అందిస్తారు

మూలాలుసవరించు

 1. Bankoff G, Frerks G, Hilhorst D (2003). Mapping Vulnerability: Disasters, Development and People. ISBN 1-85383-964-7.
 2. Wisner B, Blaikie P, Cannon T, Davis I (2004). At Risk - Natural hazards, people's vulnerability and disasters. Wiltshire: Routledge. ISBN 0-415-25216-4.
 3. D. Alexander (2002). Principles of Emergency planning and Management. Harpended: Terra publishing. ISBN 1-903544-10-6.
 4. "World's worst natural disasters since 1900". Archived from the original on 2005-01-14. Retrieved 2005-01-14.
 5. III. (2008). 2008 Natural Catastrophe Review.

ఇవీ చూడండిసవరించు

బయటి లింకులుసవరించు

'