ప్రతిబంధ్ 1990 లో హిందీ- భాషా యాక్షన్ చిత్రం. ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా చిరంజీవి, జూహి చావ్లా , రామి రెడ్డి నటించారు . ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా నటుడు చిరంజీవి బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. ఈ సినిమాలో నటనకు గాను జూహి చావ్లాకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు ప్రతిపాదన లభించింది . ఈ చిత్రం కోడి రామ కృష్ణ దర్శకత్వం వహించిన రాజశేఖర్ నటించిన తెలుగు చిత్రం అంకుశం కు పునర్నిర్మాణం. ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ అయింది.

ప్రతిబంధ్
(1990 హిందీ సినిమా)

సినిమా పోస్టరు
దర్శకత్వం రవిరాజా పినిశెట్టి
నిర్మాణం అల్లు అరవింద్
రచన అనీస్ బజ్మీ
తారాగణం చిరంజీవి
జూహీ చావ్లా
రామిరెడ్డి
జె.వి.సోమయాజులు
కుల్‌భూషణ్ ఖర్బందా
సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్
ఛాయాగ్రహణం కె.ఎస్.హరి
కూర్పు వెళ్లై స్వామి
పంపిణీ గీతా ఆర్ట్స్
దేశం భారతదేశం
భాష హిందీ

చిరంజీవి ముక్కు సూటి తనం, నిజాయితీ గల పోలీసు ఇనస్పెక్టర్ సిద్ధాంత్. అతను తన నమ్మకాల కోసం అన్యాయం, అక్రమాలపై పోరాడుతున్నవ్యక్తి. అతను ప్రతినాయకుడైన రామిరెడ్డి నుండి మొదట లంచం తిరస్కరించినప్పుడు అతను రామి రెడ్డి తో ఇబ్బందుల్లో పడతాడు. తరువాత రామిరెడ్డి చేసిన నేరాలకు సాక్షి అయిన శాంతి ( జుహి చావ్లా ) ను రక్షిస్తాడు. అతని గురువు ( జె.వి.సోమయజులు ) మంత్రిగా మారి ప్రతినాయకుల మార్గంలో నిలబడతారు. సిద్దాంత్ వారి హత్యాయత్నాలను విఫలం చేసి, రామి రెడ్డి యొక్క అనుచరులలో ఒకరిని చంపినందున, దానికి ప్రతిగా రామి రెడ్డి సిద్దాంత్ భార్య శాంతిని చంపేస్తాడు. తన గురువును కాపాడటానికి, ఇతర పోలీసు అధికారులు, రెడ్డి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారని నిరూపించడానికి చివరి ప్రయత్నంలో, సిద్దాంత్ పేలుడు పదార్థాలతో ఉంచిన టార్చ్ ను వెలిగిస్తాడు, ఈ ప్రేలుడులో తన గురువు చనిపోతాడని భావిస్తాడు.

పాటలు

మార్చు
  1. "కబీ హువా నహి కబీ దేఖా నహి" - గాయకులు: అమిత్ కుమార్, ఆల్కా యాగ్నిక్
  2. "ప్యార్ ముజే తుమ్ కార్టే హో ఇట్నా" - గాయకులు: ఆల్కా యాగ్నిక్, అమిత్ కుమార్
  3. "బచ్చో బజావో తాలి ఆయి ఖిలోన్ వాలి" - గాయకులు: ఆల్కా యాగ్నిక్
  4. "యే బద్నాసీబ్ బచ్చా" - మహ్మద్ అజీజ్

తారాగణం

మార్చు

బాక్సాఫీస్

మార్చు

ఈ సినిమాను తెలుగు లో రాజశేఖర్ కథానాయకునిగా తీయబడిన సినిమా అంకుశం పెద్ద హిట్ అయింది. హిందీలో తీసిని ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ హిట్ అయింది. ఈ చిత్రం జూహి చావ్లాకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి ప్రతిపాదనను పొందింది. ప్రతిబంద్ సినిమా ద్వారా చిరంజీవిని జాతీయ స్థాయిలో గుర్తించదగిన వ్యక్తిగా మారాడు. ఎందుకంటే అతను అప్పటికే దక్షిణాదిలో గుర్తింపు కలిగిన నటుడు. దీనిని కన్నడలో అభిమన్యు (1990 చిత్రం) గా వి. రవిచంద్రన్ టైటిల్ రోల్ లో, రవిరాజా పినిశెట్టి స్వయంగా రీమేక్ చేశాడు.

అవార్డులు

మార్చు
సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1991 జుహీ చావ్లా ఫిల్మ్‌ ఫేర్ పురస్కారం (ఉత్తన నటిగా) ప్రతిపాదించబడింది

బాహ్య లింకులు

మార్చు