ప్రాణదాత 1992 లో వచ్చిన చిత్రం. దీనిని శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ [1] లో, మోహన్ గాంధీ దర్శకత్వంలో పి. బలరామ్ నిర్మించాడు.[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మి, హరీష్, చార్మిలా నటించారు.[3] రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.[4]

ప్రాణదాత
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.మోహన్ గాంధీ
నిర్మాణం పి. బలరామ్
కథ పరుచూరి సోదరులు
చిత్రానువాదం ఎ. మోహనగాంధీ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
లక్ష్మి
సంగీతం రాజ్ - కోటి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం మహీధర్
కూర్పు మురల్ళి రామయ్య
నిర్మాణ సంస్థ శ్రీ అనుపమ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ప్రాణదాత సినిమా పోస్టర్

కథ మార్చు

భారతదేశంలో అగ్రశ్రేణి సర్జన్లలో ఒకరైన డాక్టర్ చక్రవర్తి (అక్కినేని నాగేశ్వరరావు) తో సినిమా ప్రారంభమవుతుంది. అతను తన పెద్దలను ఎదిరించి తెలివైన స్త్రీ కమల (లక్ష్మి) ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. కాబట్టి, ఆమె తన అత్త ఆడపడుచుల నుండి తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటుంది. కాని చక్రవర్తి కమలతోటి, కుమార్తె జ్యోతితోటీ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. అకస్మాత్తుగా, ఒక రోజు కమల జ్యోతితో పాటు అదృశ్యమౌతారు. చక్రవర్తి కుటుంబం ఆమె లేచిపోయినన్నట్లు ధ్రువీకరిస్తుంది. మనస్తాపానికి గురైన చక్రవర్తి ప్రమాదానికి గురై జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. సంవత్సరాలు గడుస్తాయి. చక్రవర్తి దేశద్రిమ్మరిగా తిరుగుతూ ఒక గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ గ్రామపెద్ద బాపయ్య (పుండరీకాక్షయ్య) కుమారుడు సీను (మాస్టర్ సీను) పక్షవాతం వచ్చిన పిల్లవాణ్ణి చూస్తాడు. త్వరలో, చక్రవర్తి తన శస్త్రచికిత్సా జ్ఞానాన్ని తిరిగి పొంది, ఆపరేషన్ చేసి ఆ బాలుడికు పూర్తిగా నయం చేస్తాడు. ఆ తరువాత, బాపయ్య గ్రామంలో ఒక ఆసుపత్రిని స్థాపించి, చక్రవర్తి సేవను పేదలకు ఉచితంగా అందుబాటులో ఉంచుతాడు. ఇది స్థానిక వైద్యుడు గోవిందరాజు (కోట శ్రీనివాసరావు) కు అసూయ కలిగిస్తుంది. విధి కమల & జ్యోతి (చార్మిలా) లను చక్రవర్తికి దగ్గరగా తీసుకువస్తుంది. కాని అతను వారిని గుర్తించలేకపోతాడు.

సమాంతరంగా, ఒక ప్రేమ కథ నడుస్తుంది, జ్యోతి తన క్లాస్మేట్ నరేంద్ర (హరీష్) ను ప్రేమిస్తుంది. కమల అతడీ పెద్దల వద్దకు పెళ్ళి ప్రతిపాదనతో వెళ్తుంది. ఆ సమయంలో, ఆశ్చర్యకరంగా, నరేంద్ర చక్రవర్తి మేనల్లుడని తెలుస్తుంది. అతని పెద్దలు కమలను ఒక వేశ్య అని ఈసడిస్తారు. జ్యోతి కూడా దానిని నమ్ముతుంది. కమల ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఒక ప్రమాదంలో చిక్కుకుంటుంది. ఆ తరువాత, ఆమె గతాన్ని వివరిస్తుంది.

ఒకసారి చక్రవర్తి ఒక రాజకీయ నాయకుడిని ఆపరేట్ చేయటానికి బయలుదేరాడు. అతడు ఆ పని చెయ్యవద్దని చెప్పి ప్రతిపక్ష నాయకుడు కమలను అపహరిస్తాడు. దాన్ని పట్టించుకోకుండా చక్రవర్తి తన విధి నిర్వర్తిస్తాడు. కోపంతో ఉన్న ప్రతిపక్ష నాయకుడు కమలను మానభంగ చేస్తాడు. అందువల్ల ఆమె అతన్ని విడిచి పోయింది.

ప్రస్తుతం, కమల అనారోగ్యంతో ఉంది. జ్యోతి చక్రవర్తి సహాయం కోసం ప్రయత్నిస్తుంది. ఆమె తన భర్తను చూడగానే మరణిస్తుంది. ఇక్కడ, చక్రవర్తి ఆమె ఎవరో తెలియకుండానే ఆమెకు అంత్యక్రియలు చేస్తాడు. ఆ తరువాత, అతను నరేంద్ర & జ్యోతి లను ఒకటి చేస్తానని వాగ్దానం చేస్తాడు. నాని (పరుచూరి రవి) జ్యోతి కావాలని కోరుకునే వ్యక్తి. అతను నరేణ్డ్రతో గొడవ పడతాడు. ఆ గొడవలో నాని గాయపడగా చక్రవర్తి అతనికి చికిత్స చేస్తాడు. దీనిని అవకాశంగా తీసుకుని, గోవిందరాజు నానిని చంపేస్తాడు. చక్రవర్తిని అరెస్టు చేసి, విచారిస్తారు. ప్రస్తుతం, చక్రవర్తి శిష్యుడు డాక్టర్ శివ ప్రసాద్ (గిరీష్ కర్నాడ్) తన గురువు జ్ఞాపకాలను తిరిగి తెప్పిస్తాడు. కోర్టు ఈ కేసును వైద్య మండలికి సూచిస్తుంది. అంతేకాకుండా, నరెంద్ర చక్రవర్తి అమాయకత్వాన్ని రుజువు చేసి గోవిందరాజుకు శిక్ష వేయిస్తాడు. చివరగా, ఈ చిత్రం నరేంద్ర జ్యోతి ల పెళ్ళితో ముగుస్తుంది.

తారాగణం మార్చు

సాంకేతిక సిబ్బంది మార్చు

పాటలు మార్చు

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."ఆగిపో ఆగిపో"వెన్నెలకంటిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం4:50
2."యు ఆర్ మై బాయ్‌ఫ్రెంద్"డి. నారాయణవర్మఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:26
3."ఢీ కొట్టరా"వేటూరి సుందరరామమూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:08
4."ప్రేమీకులం"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర5:10
Total length:18:34

మూలాలు మార్చు

  1. "Pranadaata (Banner)". Filmiclub.
  2. "Pranadaata (Direction)". Know Your Films.
  3. "Pranadaata (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-13. Retrieved 2020-08-26.
  4. "Pranadaata (Review)". The Cine Bay. Archived from the original on 2020-10-31. Retrieved 2020-08-26.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రాణదాత&oldid=4001519" నుండి వెలికితీశారు