కోరింగ వన్యప్రాణి అభయారణ్యం లేదా కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో, కాకినాడ జిల్లా, కోరంగి వద్ద ఉన్న అతిపెద్ద మడ అడవుల అభయారణ్యం. కాకినాడ నుంచి కోనసీమ జిల్లా పరిధిలోని భైరవపాలెం వరకు సుమారు అరవై వేల ఎకరాల్లో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవులు గోదావరి నదీ ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. అందంగా, గుబురుగా పెరిగే మడ వృక్షాలు సముద్రపు కోతలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి తీర ప్రాంతాలను రక్షిస్తాయి. ఈ అభయారణ్యం పలు రకాలైన జంతువులకు, జలచరాలను ఆశ్రయం ఇస్తోంది. కోరంగి అభయారణ్యం మడ అడవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడనుండి 10 కి.మీ. దూరంలో ఉంది. అటవీశాఖ వారి లెక్కప్రకారం 235 చ. కి. మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మడ అడవులు దేశంలోనే రెండవ పెద్ద మడ అడవులుగా స్థానం సంపాదించుకున్నాయి. చిత్తడినేలలో పెరిగే చెట్లయొక్క వేర్ల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. భూమిలోనికి ఉండే వేర్లవల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్ తీసుకొనే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడి నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి. వేర్ల ద్వారా గాలిపీల్చుకునే ఈ చిత్తడి అడవులు కేవలం నదీ సాగరసంగమ ప్రదేశంలో ఏర్పడ్డ చిత్తడి (బురద) నేలల్లోనే పెరుగుతాయి.
(ఇంకా…)
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.