ఫిరోజాబాద్
ఫిరోజాబాద్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాకు సమీపంలో ఉన్న నగరం. ఇది భారతదేశ గాజు తయారీ పరిశ్రమకు కేంద్రం. గాజు నాణ్యతకు, గాజు సామానులకూ ప్రసిద్ధి చెందింది.
ఫిరోజాబాద్ | ||||||
---|---|---|---|---|---|---|
నగరం | ||||||
హిమాయు, మహావీర జైన దేవాలయం, ఈద్గా | ||||||
ముద్దుపేరు(ర్లు): గాజు నగరం, సుహాగ్ నగరి | ||||||
నిర్దేశాంకాలు: 27°09′N 78°25′E / 27.15°N 78.42°ECoordinates: 27°09′N 78°25′E / 27.15°N 78.42°E | ||||||
దేశం | భారతదేశం | |||||
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ | |||||
జిల్లా | ఫిరోజాబాద్ | |||||
జనాభా వివరాలు (2011 census) | ||||||
• మొత్తం | 603,797 | |||||
భాషలు | ||||||
• అధికారిక | హిందీ | |||||
కాలమానం | UTC+5:30 (IST) | |||||
పిన్‌కోడ్ | 283203 | |||||
టెలిఫోన్ కోడ్ | 05612 | |||||
వాహనాల నమోదు కోడ్ | UP-83 | |||||
జాలస్థలి | firozabad |
అక్బర్ పాలనలో, నగరం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆఫ్ఘన్లు దోచుకున్నారు. పన్నులు వసూలు చేయడానికి నగరాన్ని సైనిక స్థావరంగా మార్చడానికి అక్బర్ తన సైన్యాన్ని తన మన్సాబ్ దారైన ఫిరోజ్ షా నేతృత్వంలో పంపాడు. ఆ నగరానికి అతని పేరే పెట్టాడు. ఫిరోజ్ షా సమాధి నేటికీ ఉంది. తొలినుండి ఇక్కడ గాజు, గాజు పనులు, చిన్న తరహా పరిశ్రమలూ ఉన్నాయి. ఫిరోజాబాద్‌లో భూస్వాములు సిద్దిఖీ, సయ్యద్, మణిహార్, పఠాన్, రాజపుత్ర కులాలకు చెందినవారు. ఫిరోజాబాద్ ఆగ్రా నుండి 37 కి.మీ. ఢిల్లీ నుండి 230 కి.మీ. దూరంలో, దక్కన్ పీఠభూమికి ఉత్తరపు అంచు వద్ద ఉంది.
చరిత్రసవరించు
ఫిరోజాబాద్ అనే పేరు అక్బర్ మన్సాబ్ దారైన ఫిరోజ్ షా పేరు మీదుగా వచ్చింది. ఇక్కడ 1566 లో కన్నౌజ్‌కు మొహద్ ఘోరి మధ్య చంద్రవార్ యుద్ధం జరిగింది. తోడర్మల్ గయ తీర్థయాత్ర కోసం ఈ పట్టణం గుండా వెళుతూండగా, అతన్ని దొంగలు దోచుకున్నారు. అతని అభ్యర్థన మేరకు అక్బర్ తన మన్సాబ్ దార్ ఫిరోజ్ షాను ఇక్కడికి పంపాడు. అతను డాటౌజీ, రసూల్పూర్, మొహమ్మద్పూర్ గజ్మల్‌పూర్, సుఖ్మల్పూర్ నిజామాబాద్, ప్రేమ్‌పూర్ రాయ్‌పురా సమీపానికి చేరుకున్నాడు.. ఫిరోజ్ షా సమాధి, కాట్రా పఠానన్ లోని అతని నివాస భవనాల శిథిలాలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యాయి.
డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న వ్యాపారవేత్త పీటర్, 1632 ఆగస్టు 9 న ఫిరోజాబాద్‌ను సందర్శించి, పట్టణం మంచి స్థితిలో ఉండడం చూసాడు. 1596 లో ఫరాజ్‌ను ఒక పరగనాగా చేసినట్లు ఆగ్రా, మధుర గెజిటర్‌లో రాసారు. షాజహాన్ పాలనలో నవాబ్ సాధుల్లా ఖాన్‌కు ఫరాజ్‌ను జాగీర్ఉగా బహుకరించారు. జహంగీర్ 1605 నుండి 1627 వరకు ఇక్కడ పాలించాడు. ఎటావా, బుడాన్, మెయిన్‌పురి, ఫరాజ్ చక్రవర్తి ఫరూఖ్సియార్ ఫస్ట్ క్లాస్ మన్సబ్దార్ కింద ఉండేవి. 1737 లో మొహమ్మద్ షా పాలనలో, బాజీ రావు I ఫిరోజాబాద్, ఎట్మాద్పూర్లను దోచుకున్నాడు. మహావాన్ జాట్లు 1739 మే 9 న ఫిరోజాబాద్ వద్ద ఫౌజ్దార్ హకీమ్ కాజీమ్ అలీ బహదూర్ జాంగ్ పై దాడి చేసి చంపారు. జాట్లు ఫిరోజాబాద్‌ను 30 సంవత్సరాలు పాలించారు.
18 వ శతాబ్దం చివరలో, ఫిరోజాబాద్‌ను మరాఠాల సహకారంతో హిమ్మత్ బహదూర్ పాలించాడు. మరాఠాల ఫ్రెంచ్ ఆర్మీ చీఫ్ డి. వయాన్ 1794 నవంబరులో ఆయుధ కర్మాగారం స్థాపించాడు. థామస్ ట్రావింగ్ తన ట్రావెల్స్ ఇన్ ఇండియా పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
జనరల్ లెక్, జనరల్ వెల్లజల్లీలు 1802 లో ఫిరోజాబాద్‌పై దాడి చేశారు. బ్రిటిష్ పాలనలో ఫిరోజాబాద్ తొలుత ఎటావా జిల్లాలో ఉండేది కానీ కొంత కాలం తర్వాత దాన్ని అలిగర్ జిల్లా లోకి చేర్చారు. 1832 లో సదాబాద్ కొత్త జిల్లాగా సృష్టించబడినప్పుడు, ఫిరోజాబాద్‌ను అందులోకి చేర్చారు.తరువాత, 1833 లో ఆగ్రా జిల్లాకు మార్చారు. 1847 లో, ఫిరోజాబాద్‌లో లక్షల వ్యాపారం వృద్ధి చెందింది.
1857 లో, ఫిరోజాబాద్‌కు చెందిన జమీందార్ స్థానిక ప్రజలతో కలిసి స్వాతంత్య్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్నాడు. ఉర్దూ కవి మునీర్ షికోహాబాదికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండమాన్ జైలుకు పంపింది.. ఈ నగర ప్రజలు "ఖిలాఫత్ ఉద్యమం", "క్విట్ ఇండియా ఉద్యమం", "ఉప్పు సత్యాగ్రహా" లలో పాల్గొన్నారు. 1929 లో, మహాత్మా గాంధీ, 1935 లో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, 1937 లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1940 లో సుభాస్ చంద్రబోస్‌లు పండిట్ బనారసీ దాస్ చతుర్వేదిని సందర్శించారు. 1989 ఫిబ్రవరి 5 న ఫిరోజాబాద్ జిల్లా స్థాపించారు. 2015 లో ఫిరోజాబాద్ మునిసిపల్ కార్పొరేషను ఏర్పడింది
భౌగోళికంసవరించు
ఫిరోజాబాద్ 27°09′N 78°25′E / 27.15°N 78.42°E వద్ద [1] సముద్ర మట్టం నుండి 164 మీటర్ల ఎత్తున ఉంది.
శీతోష్ణస్థితిసవరించు
ఫిరోజాబాద్‌లో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత −1 °C, అత్యధిక ఉష్ణోగ్రత 48°C
Firozabad-వాతావరణం | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగస్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 22 | 25 | 32 | 38 | 41 | 41 | 35 | 33 | 34 | 34 | 29 | 24 | — |
సగటు అల్ప °C (°F) | 8 | 10 | 16 | 22 | 26 | 28 | 27 | 26 | 24 | 19 | 13 | 9 | — |
అవక్షేపం mm (inches) | 10.2 | 12.7 | 10.2 | 10.2 | 15.2 | 66.0 | 195.6 | 226.1 | 114.3 | 27.9 | 2.5 | 5.1 | — |
Source: Firozabad Weather |
జనాభాసవరించు
2011 భారత జనగణన ప్రకారం,[3] ఫిరోజాబాద్ నగర జనాభా 6,03,797. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. ఫిరోజాబాద్ అక్షరాస్యత 75.01%, జాతీయ సగటు 74% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 85.32%, స్త్రీ అక్షరాస్యత 63%. ఫిరోజాబాద్ జనాభాలో 16% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు
రవాణాసవరించు
ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ ఢిల్లీ-హౌరా రైలు మార్గంలో ఉంది. దూరప్రాంతాలకు,, దగ్గరి స్థలాలకూ పలు రైళ్ళు నడుస్తున్నాయి. న్యూఢిల్లీ, హౌరా, ముంబై, కాన్పూర్, లక్నో, జైపూర్, జమ్ము, అమృతసర్, జంషెడ్పూర్, పాట్నా, అలిగర్, ఆగ్రా, హత్రాస్, పూరి, అజ్మీర్, అంబాలా, బారెల్లీ, మధుర, ఎటావా, గోరఖ్‌పూర్, తుండ్లా వంటి నగరాలకు ఇక్కడి నుండి రైళ్ళున్నాయి.
పట్టణం నుండి యమునా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ఢిల్లీకి, తాజ్ ఎక్స్‌ప్రెస్‌వేతో రాష్ట్ర రాజధాని లక్నోకూ చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది.
నీటి సమస్యసవరించు
కొన్ని సంవత్సరాల నుండి, ఫిరోజాబాద్ తీవ్రమైన నీటి కాలుష్య సమస్యతో బాధపడుతోంది. పరిశ్రమలు విచక్షణారహితంగా వ్యర్ధాలను విడుదల చేయడంతో నీరు కలుషితమైంది, దీనివల్ల అక్షరాలా నీటి "సంక్షోభం" ఏర్పడింది. నీరు వాడకానికి పనికిరాకుండా ఉంది. పౌరులకు ఇంట్లో నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసుకోవడం, సీసాల్లో అమ్మే నీటిని ఉపయోగించడం తప్ప మరో మార్గం లేదు. [4] [5] [6]
మూలాలుసవరించు
- ↑ Falling Rain Genomics, Inc - Firozabad
- ↑ "Firozabad City Census 2011 data". census2011.co.in.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ http://www.icontrolpollution.com/articles/physicochemical-characteristics-of-glass-industries-waste-water-in-firozabad-district-up-india.pdf
- ↑ https://timesofindia.indiatimes.com/city/agra/agra-family-of-six-attempts-suicide-after-facing-acute-water-scarcity/articleshow/69917025.cms
- ↑ https://www.krishisanskriti.org/vol_image/11Sep201505090522.pdf