బంగారు గాజులు కమ్యూనిస్టు పార్టీలో, ప్రజానాట్య మండలిలో క్రియాశీలక పాత్ర పోషించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మాతగా రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్‌తో కూడిన బెంగాలీ చిత్రం ‘నీల్ ఆకాశెర్ నీచే’ ప్రేరణ.

బంగారు గాజులు
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
నిర్మాణం తమ్మారెడ్డి కృష్ణమూర్తి
కథ రాజశ్రీ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
భారతి,
పద్మనాభం,
గీతాంజలి,
కాంతారావు
సంగీతం తాతినేని చలపతిరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి
గీతరచన సి.నారాయణ రెడ్డి, దాశరథి కృష్ణమాచార్య
సంభాషణలు పినిశెట్టి శ్రీరామమూర్తి
ఛాయాగ్రహణం కమల్ ఘోష్
కూర్పు అక్కినేని సంజీవి
నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ- రాజశ్రీ
  • సినిమా అనుసరణ- తమ్మారెడ్డి కృష్ణమూర్తి
  • మాటలు- పినిశెట్టి
  • కూర్పు- అక్కినేని సంజీవి
  • కళ- జి.వి.సుబ్బారావు
  • నృత్యం-కె.ఎస్.రెడ్డి
  • సంగీతం- టి.చలపతిరావు
  • పోరాటాలు- రాఘవులు
  • ఫొటోగ్రఫీ- కమల్‌ఘోష్, టి.డి.బాబు
  • దర్శకత్వం- సి.ఎస్.రావు
  • నిర్మాత- తమ్మారెడ్డి కృష్ణమూర్తి

కోటిపల్లిలో రామూ (ఎ.ఎన్.ఆర్) రాధ (విజయనిర్మల) అన్నాచెల్లెళ్లు అన్యోన్యంగా జీవిస్తుంటారు. రాముకు చెల్లెలంటే పంచప్రాణాలు. ఆ వూరి రైసుమిల్లు యజమాని రావూజి (నాగభూషణం) అతని అనుచరుడు దాసు (జగ్గారావు), రామూ ఆ మిల్లులో లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. రావూజి స్మగ్లింగ్, అక్రమ వ్యాపారాలు చేస్తూ పైకి మంచి వానిలా నటిస్తుంటాడు. వ్యసనపరుడైన రావూజి ఒకనాడు రాము వూరిలో లేని సమయంలో రాధను బలవంతం చేస్తాడు. అతన్నించి తప్పించుకున్న రాధ ఓ నదిలో దూకుతుంది. చెల్లెలికోసం వెదుకుతూ వచ్చిన రామూపై, అంతకుముందు తాము చంపిన సేఠ్‌జీ హత్యను రామూ పైకి నెట్టి, రావూజీ మరణించినట్టు రామూను దోషిగా చిత్రీకరిస్తారు. చెల్లెలుకోసం వెదకుచూ రామూ హైద్రాబాద్ చేరి అక్కడ భూషయ్య (రేలంగి)వద్ద కారు డ్రైవర్‌గా చేరి, అంతకుముందు పరిచయంకల అవతారం (పద్మనాభం) ఇంట ఆశ్రయం పొందుతాడు. అక్కడ అతని చెల్లెలు శారద (భారతి) అతని తల్లి శాంతమ్మ (హేమలత) అతన్ని ఆదరిస్తారు. శారద, రామూను ప్రేమిస్తుంది. రవిగా, చలామణి అవుతున్న రామూ ఒకనాడు ఓ నృత్య ప్రదర్శనవద్ద తలకు గాయమైన రాధ (విజయనిర్మల)ను చూసి, తన రక్తమిచ్చి కాపాడుతాడు. ఆమె పోలీస్ ఆఫీసర్ చంద్రశేఖర్ (కాంతారావు) భర్త అని, ఆమె తండ్రి రామదాసు (గుమ్మడి) అని చెప్పినా నమ్మక ఆమె తన చెల్లెలుగా భావిస్తుంటాడు. రాధ కూడా అతన్ని అన్నగా ఆదరిస్తుంది. ఒకనాడు ప్రకాష్‌గా వేషం మార్చిన, రావూజీ, రాధ, రాములను చూసి, రవే, రామూ అని పోలీసులకు తెలియచేసి, రామూను అరెస్ట్ చేయిస్తాడు. ఒంటరిగా చిక్కిన రాధను బంధిస్తాడు. ఈ సంగతి తెలిసిన రామూ, అవతారం, శారదల సాయంతో జైలునించి తప్పించుకుని, రావూజీ డెన్ చేరి, వాళ్ళ గాంగ్‌తో పోరాడి రాధను విడిపించటం, ఈలోపు అక్కడకు వచ్చిన పోలీసులు, చంద్రశేఖర్, రావూజీని అరెస్ట్‌చేయటం,. మరో రాధను తీసికొని వచ్చిన రామదాసు, ఇద్దరూ రాధలు కవల పిల్లలని, తాను ఒకరిని పెంచుకున్నానని నిజం చెప్పటం, చెల్లెళ్ళిద్దరకూ, రామూ, బంగారుగాజుల తొడగడం, శారద, రామూల వివాహంతో చిత్రం సుఖాంతమవుతుంది[1].

పాటలు

మార్చు
  1. అ ఆలు వస్తెకాని ఐదు బళ్ళు రావండి ఆత్రంగా పైపైకి వస్తే - బి.వసంత, మాధవపెద్ది సత్యం - రచన: కొసరాజు రాఘవయ్య
  2. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి కనిపించని దైవమే ఆ కనులలో - పి.సుశీల - రచన: డా॥ సి.నారాయణ రెడ్డి
  3. ఏగలేక ఉన్నానురా మావా ఎప్పు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఘంటసాల బృందం - రచన: డా॥ సి.నారాయణ రెడ్డి
  4. చెల్లాయి పెళ్ళికూతురాయెను పాలవెల్లులే నాలో పొంగిపోయెను - ఘంటసాల - రచన: డా॥ సి.నారాయణ రెడ్డి
  5. జాజిరి జాజిరి జక్కల మావా చింగ్ చింగ్ చింగ్ జింగిరి బింగిరి - ఎల్.ఆర్. ఈశ్వరి
  6. వలపు ఏమిటి ఏమిటి వయసు తొందర చేయుట ఏమిటి మనసు - పి.సుశీల బృందం
  7. విన్నవించుకోనా చిన్నకోరికా ఇన్నాళ్ళు నామదిలో వున్న కోరిక - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరథి కృష్ణమాచార్య

విశేషాలు

మార్చు
  • ముందుగా ఈ చిత్రానికి వి.మధుసూధనరావు ను దర్శకునిగా నిర్ణయించారు. అతనికి వీలుపడకపోవడంతో అక్కినేని నాగేశ్వరరావు సూచనతో సి.ఎస్.రావును ఎన్నుకున్నారు.
  • అలాగే కథానాయికగా కృష్ణకుమారిని నిర్ణయించుకోగా, ఆమెకూడా ఇతర చిత్రాలతో బిజీగా వుండడంతో భారతి ని కథానాయికగా బుక్ చేసారు.
  • సినీ నటి అంజలిదేవి ఇల్లు ఈ చిత్రంలో షూటింగ్‌కు ఉపయోగించారు.
  • ఈ చిత్రాన్ని తమిళంలో డి.యోగానంద్ దర్శకత్వంలో ‘తంగైక్కకాగా’ జూపిటర్ మూవీస్‌ నిర్మించింది. వి.సి.గుహనాథన్ కథ, ఎం.ఎస్.విశ్వనాథం సంగీతం, కన్నదాస్ గీతాలు వ్రాసారు ప్రముఖ నటుడు శివాజీ గణేషన్, వెనె్నరాడై నిర్మల, లక్ష్మి, నాగేష్, ప్రధాన పాత్రలు పోషించారు.

పురస్కారాలు

మార్చు
సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
1968 నంది పురస్కారాలు తృతీయ ఉత్తమ చిత్రం
(కాంస్య నంది)
తమ్మారెడ్డి కృష్ణమూర్తి గెలుపు
1968 నంది పురస్కారాలు తృతీయ ఉత్తమ కథ
(కాంస్య నంది)
రాజశ్రీ గెలుపు

మూలాలు

మార్చు
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా) -
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.

బయటి లంకెలు

మార్చు