బన్ని
బన్నీ వి. వి. వినాయక్ దర్శకత్వంలో 2008లో విడుదలైన చిత్రం. ఇందులో అల్లు అర్జున్, గౌరి ముంజల్ ప్రధాన పాత్రలు పోషించారు.
బన్ని (2008 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | వి.వి.వినాయక్ |
తారాగణం | అల్లు అర్జున్ గౌరీ ముంజల్[1] ఫిష్ వెంకట్ |
భాష | తెలుగు |
కథ సవరించు
విశాఖపట్టణం లో సోమరాజు (ప్రకాష్ రాజ్) ఒక పెద్ద వ్యాపారవేత్త. హైదరాబాదు లో సోమరాజు కార్యకలాపాలను తన అనుయాయుడు మైసమ్మ (ముఖేష్ ఋషి) చూసుకొంటుంటాడు. సోమరాజు ముద్దుల కూతురు మహాలక్ష్మి (గౌరీ ముంజల్) చదివే కళాశాలలోనే బన్ని (అల్లు అర్జున్) చేరి తనని ప్రేమలో పడేస్తాడు. మొదట సందేహించినా, తర్వాత సోమరాజు వారి వివాహానికి ఒప్పుకొంటాడు. కానీ మహాలక్ష్మిని వివాహం చేసుకోవాలంటే సోమరాజు తన యావదాస్తిని తన పేర రాయాలని బన్ని అంటాడు. బన్నికి నిజంగానే సోమరాజు ఆస్తిపైన కన్ను ఉందా, లేక వేరే ఏదయినా కారణమా, అన్నదే చిత్రం ముగింపు.
తారాగణం సవరించు
విశేషాలు సవరించు
- ఈ చిత్రం మలయాళం లోకి బన్ని (మలయాళం సినిమా) అనువదించబడినది.
మూలాలు సవరించు
- ↑ ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.