బారాముల్లా జిల్లా

జమ్మూ కాశ్మీరు లోని జిల్లా

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో బారాముల్లా జిల్లా ఒకటి. బారాముల్లా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 4,190 చ.కి.మీ.2001 నుండి ఇది 3,353 చ.కీ.మీ తగ్గించబడింది.

బారాముల్లా జిల్లా
భారతదేశంలోని జమ్మూ, కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గుల్మార్గ్ స్కీ రిసార్ట్
భారతదేశంలోని జమ్మూ, కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గుల్మార్గ్ స్కీ రిసార్ట్
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీర్
జిల్లాబారాముల్లా జిల్లా
ప్రధాన కార్యాలయాలుబారాముల్లా
విస్తీర్ణం
 • Total3,353 కి.మీ2 (1,295 చ. మై)
జనాభా
 (2011)
 • Total10,15,503
 • జనసాంద్రత305/కి.మీ2 (790/చ. మై.)
భాష
 • అధికారికఉర్దూ
Time zoneUTC+5:30
Vehicle registrationJK05
Websitehttp://baramulla.nic.in/

పేరు వెనుక చరిత్ర

మార్చు

బారాముల్లా అనేమాటకు " బోయర్స్ మోలర్ ప్యాలెస్ (వరాహ దవడ రాజభవనం) " అని అర్ధం.[1] సంస్కృతంలో బోయర్ అంటే వరాహం (పంది), మూల. హిందూ పురాణ కథనాలు " ఒకప్పుడు కాశ్మీర్ సతీసరస్ అనే సరోవరమని , పార్వతి సరసు అని పిలిచేవారు.ఈ సరసును జలోద్భవుడు అనే రాక్షసుడు ఆక్రమించాడని తరువాత విష్ణుమూర్తి అవతారంచే తన దవడతో పర్వతాన్ని లేపి రంధ్రం చేసి ఆసరసులోని నీటిని బయటకు పంపాడని, అందువలన ఇది బారాముల్లా అయిందని కథనం .[2]

చరిత్ర

మార్చు

పురాతన, మద్యయుగం

మార్చు

సా.శ.పూ 1306 లో బారముల్లా నగరాన్ని రాజా భీమసేనుడు స్థాపించాడని అంచనా. పురాతన కాలం నుండి బారాముల్లా ప్రాంతానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. వీరిలో ప్రముఖ చైనా యాత్రీకుడు హూయంత్సాంగ్, బ్రిటిష్ చారిత్రకుడు మూర్‌క్రాఫ్ట్ మొదలైన వారు ముఖ్యులు. బారాముల్లా ప్రాంతానికి మొగల్ చక్రవర్తులు ప్రత్యేక ఆరాధకులుగా ఉన్నారు. కాశ్మీర్ లోయకు ఈ ప్రాంతం ద్వారం లాంటిది కనుక కాశ్మీర్ లోయకు వెళ్ళే సమయంలో మొగల్ చక్రవర్తులు ఈ ప్రాంతంలో బసచేసే వారు. 1508 లో అక్బర్ చక్రవర్తి పాఖిల్ మీదుగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు బస చేసాడు. ఈ సందర్భాన్ని వివరిస్తూ " తారిఖ్-ఈ-హుస్సేన్ " వ్రాతలలో " అక్బర్ చక్రవర్తి బస చేసిన కారణంగా ఈ నగరం పెళ్ళికూతురిలా ముస్తాబు చేసుకుంది " అని వర్ణించబడింది. 1620 లో జహంగీర్ చక్రవర్తి తన కాశ్మీర్ ప్రయాణం మద్యలో ఈ ప్రాంతానికి వచ్చాడు.

మతపరమైన సంబంధం

మార్చు

ఆరంభంలో ఈ ప్రాంతం మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. హిందూ తీర్ధాలు, బౌద్ధ విహారాలు ఈ నగరాన్ని హిందువులకు, బౌద్ధులకు పవిత్ర నగరంగా మార్చాయి. 15వ శతాబ్ధంలో ఈ ప్రాంతం ముస్లిములకు ప్రధానప్రాంతం అయింది. క్రీ.పూ 1421 లో ముస్లిం సన్యాసి సయ్యద్ జాన్‌బజ్ వాలి తన శిష్యులతో ఈ లోయకు వచ్చిన సమయంలో బారాముల్లాను తన మిషన్ ఏర్పాటుకు ఎంచుకున్నాడు. ఆతరువాత ఆయన మరణం తరువాత కూడా ఇక్కడే సమాధిచేయబడ్డాడు. లోయ అంతటి నుండి ఈ సమాధిచూడడానికి భక్తులు వస్తూ ఉంటారు. 1894 లో సిఖ్ఖుల 6 వ గురువు శ్రీహరిగీబింద్ ఈ ప్రాంతానికి వచ్చాడు. అందువలన బారాముల్లా హిందూ, ముస్లిం, బుద్ధ, సిఖ్ఖు ప్రజలకు మతప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా ఉంది. అంతేకాక హిందూ, ముస్లిం, బుద్ధ, సిఖ్ఖు ప్రజలు ఇక్కడ కలిసి మెలిసి జీవిస్తూ విభిన్నసంస్కృతుల కలయికకు సాక్ష్యంగా ఉన్నారు.[3] జమ్మూ కాశ్మీర్ రాజ్యంలోని పురాతన నగరాలలో బారాముల్లా ఒకటి. 1947 అక్టోబర్ 26 వరకు రావల్పిండి, ముర్రీ, ముజఫరాబాద్ నుండి కాశ్మీర్ లోయలోక్ ప్రవేశించడానికి బారాముల్లా రోడ్డు ద్వారంగా ఉంటూ ఉండేది. తరువాత 1947 అక్టోబరు 26న కాశ్మీర్ మహారాజు కాశ్మీర్ భారత్ విలీనం ఒప్పందం మీద సంతకం చేసిన తరువాత జమ్మూ కాశ్మీరు భారతదేశ కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటిగా మారింది.

అంధకార నగరాలు

మార్చు

1947 అక్టోబర్ 2 న " వర్కింగ్ కమిటీ ఆఫ్ నేషనల్ కాంఫరెంస్ " షేక్ మొహమ్మద్ ఆధ్వర్యంలో సమావేశమై భారతదేశంలో విలీనం కావడానికి నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ మహారాజా హరి సింఘ్ స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. 1947 అక్టోబర్ 24 న పాకిస్థా గిరిజనుల సాయంతో " ఆపరేషన్ గుల్‌మార్గ్ " పేరుతో కాశ్మీర్ ను చేపట్టడానికి దాడి చేసింది. దాడిదారులు రావల్పిండి, ముర్రీ, ముజఫరాబాద్, బారాముల్లా మార్గంలో ముందుకు సాగారు. ఈ దాడిలో పాకిస్థాన్ సైనికులు సాధారణ దుస్తులు ధరించారు. అక్టోబర్ 24న ముజాఫరాబాద్‌ను దాడిదారులు వశపరచుకున్నారు. అక్టోబర్ 25 నాటికి వారు బారాముల్లాను చేరుకుని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ వారు కొన్ని రోజులు ఉండి దోపిడీ, మానభంగం, హత్యలు, కాల్చివేయడం వంటివి సాగించారు. తరువాత ఆలయాలను విధ్వంశం చేస్తూ దోచుకుంటూ ముందుకు శ్రీనగర్ వైపుగా ముందుకు సాగుతూ 50 కి.మీ దూరంలో ఉన్న శ్రీనగర్ విమానాశ్రయం స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్ విమానాశ్రయం తమను రక్షించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. తరువాత వారు యురేపియన్ నన్‌లను మానభంగం చేసి చంపారు. వారిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. భయంకరమైన ఈ దారుణాలు కొన్నిరోజుల పాటు నిరాఘంటంగా సాగాయి. .[4] బారాముల్లా ఈ దాడులతో తీవ్రంగా నష్టపోయింది. తరువాత అక్టోబర్ 27న భారత సైన్యం విమానాలతో వచ్చి దాడిని ఎదుర్కొని కాశ్మీర్ లోయను రక్షించింది. దాడిదారులు బారాముల్లాలో ఉండగానే భారతవైమానిక దళం శ్రీనగర్ ఎయిర్ ఫీల్డును చేరుకుంది.

చార్లెస్ చెవెనిక్స్

మార్చు

చార్లెస్ చెవెనిక్స్ ట్రెంచ్ తన " ది ఫ్రాంటియర్ స్కౌట్స్ (1985) " పుస్తకంలో " 1947 అక్టోబరులో లష్కర్ గురిజనులు లారీలలో నిస్సందేహంగా అధికారుల సహాయంతో కాశ్మీర్లో ప్రవేశించారు. బ్రిటిష్ అధికారి హార్వే కెల్లీ ఈ పోరాటంలో పాల్గొన్నాడు. శ్రీనగర్ ఎయిర్ ఫీల్డును స్వాధీనపరచుకోవడంలో వీరిని ఏశక్తి ఆపలేదని అనిపించింది. కాని వారి దురాశ వారిని ఆపింది. భారతసైకచర్య దోపిడీ దారుల నుండి ఈ ప్రాంతాన్ని రక్షించారు. గురి కాకుండా నిరోధించారు. భారతీయ సైన్యాలు లష్కరులను నిరోధించి కాశ్మీర్ లోయ నుండి తరుమివేశారు. దోపిడీదారులు శ్రీనగర్‌ను దోచుకోలేక పోయామన్న నిరాశతో ఉక్రోషంగా వెనుతిరిగారు " అని పేర్కొన్నాడు.టాం క్రూపర్ ( ఎయిర్ కంబాట్ ఇంఫర్మేషన్ గ్రూప్ ) [5] " పథానులు దోపిడీ చేసూ, హత్యలు చేస్తూ అత్యుత్సాహంగా ముందుకు సాగారు. " అని పేర్కొన్నాడు.

భారత్ ప్రభుత్వ ప్రతిచర్య

మార్చు

బిజూ పాట్నాయక్ (తరువాత కాలంలో ఒడిషా ముఖ్యమంత్రి) మొదటి విమానాన్ని శ్రీనగర్‌లో దింపాడు. అయన వెంట 17 మంది సైనికులు వచ్చారు. వారు ఎయిర్ పోర్టులో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత ఎయిర్ పోర్టును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాడిదారులు బారాముల్లాలో వారు దోపిడీ చేసిన సొమ్మును పంచుకోవడంలో మునిగి ఉన్నారు.

అక్బర్ ఖాన్ వాఖ్య

మార్చు

ఈ దాడి గురించి జెన్ అక్బర్ మొహమ్మద్ ( బ్రిగేడియర్-ఇన్- చార్జ్ , పాకిస్థాన్) తన " వార్ ఫర్ కాశ్మీర్ ఇన్ 1947 " అనే పుస్తకంలో " అసమర్ధులైన దాడిదారులు బారాముల్లాలో 2 రోజుల పాటు పూర్తిగా కారణం తెలియకుండా ఆలస్యం చేసారు." అని పేర్కొన్నాడు.[6] దాడిదారులను తరిమి కొట్టడానికి భారతసైన్యాలకు 2 రోజులకాలం అవసరం అయింది. తరువాత వారు పాకిస్థాంసైన్యంతో కలిసి బారాముల్లాను వదిలారు. 1948 ఫిబ్రవరి 5 న షేఖ్ మొహమ్మద్ అబ్దుల్లా ఐక్యరాజ్య సమితి సెక్రట్రరీతో " దాడిదారులు మా భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి వేలాది పౌరులను హతమార్చి, మాన ధన సంపదను దోపిడీ చేసి దాదాపు మా వేసవి రాజధాని శ్రీనగర్‌ను చేరుకున్నారు. " అని అన్నాడు.

ప్రస్థుత కాలం

మార్చు

1947 తరువాత బారాముల్లా పట్టణం రహదార్లు బాగా అభివృద్ధిచేయబడ్డాయి. కొత్తగా పాఠశాలలు, కాలేజిలు, ఇతర విద్యా సౌకర్యాలు అభివృద్ధిచేయబడింది. పాతపట్టణాన్ని కొత్త పట్టణంతో అనుసంధానిస్తూ నూతనంగా వంతెనలు నిర్మించబడ్డాయి. పాతపట్టణంలో జనసాంధ్రతను తగ్గించడానికి జెహ్లం నదికి దక్షిణ భూభాగంలో ఉన్న కొత్త పట్టాణానికి ప్రజలను తరలించే ప్రయత్నాలు చేయబడ్డాయి. సమీపకాలంలో రైల్వే స్టేషను నిర్మించడం వలన బారాముల్లా నుండి శ్రీనగర్, అనంతనాగ్, క్వాజీగండ్‌లతో అనుసంధానం చేసారు.

బారాముల్లా జిల్లా 8 తెహసిల్స్గా (పత్తన్, ఉరి, క్రీరి, బోనియర్, తంగ్‌మార్గ్, సోపోర్, రఫియాబాద్, బారాముల్లా విభజించబడింది. అలాగే ఈ జిల్లా 12 బ్లాకులుగా (ఉరి, రొహామా, రఫియాబాద్, జైన్‌జీర్, సోపోర్, బోనియర్, బారాముల్లా, తంగ్‌మార్గ్, సుంగ్‌పోరా, పత్తన్, వగూరా, కుంజర్) విభజించబడింది. బరాముల్లా జిల్లాలో పత్తన్ తెహ్సిల్స్ విశాలమైనది. తరువాత దీనిలో కొంతభూభాగం వేరుచేసి క్రీరి తెహసిల్ రుపొందించారు. బారాముల్లా జిల్లాలో మద్యభాగంలో పత్తన్ పట్టణం ఉంది. ఇది శ్రీనగర్, బారాముల్లాల మద్య ఉంది.దీని చుట్టూ పల్హలన్, నిహల్‌పోరా, హంజివెరా, జంగం, షెర్పోరా, సోనియం, యాల్.[7] ఒక్కో బ్లాకులో పలు గ్రామాలు ఉన్నాయి.

రాజకీయం

మార్చు

బారాముల్లా జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ( ఉరి, రఫియాబాద్, సోపోర్, సంగ్రామా, బారాముల్లా, గుల్‌మార్గ్, పత్తన్ ఉన్నాయి.[8]

జనాభా గణాంకాలు

మార్చు

2011 గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం బారాముల్లా జిల్లా మొత్తం జనాభా 1,008,039, ఇందులో 5,34,733 (53.05%) పురుషులుకాగా, 4,73,306 (46.95%) మంది మహిళలు ఉన్నారు.[9] స్త్రీలు లింగ నిష్పత్తి ప్రతి 1,000 మంది పురుషులకు 885 మంది మహిళలు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం 905 నుండి తగ్గుదల, జాతీయ సగటు 940 కన్నా చాలా తక్కువ. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల లింగ నిష్పత్తి 866 వద్ద కూడా తక్కువగా ఉంది. జిల్లాలో జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 305 మంది నివసిస్తున్నారు. 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 20.34%కు పెరిగింది. జిల్లా అక్షరాస్యత 66.93%, పురుషుల అక్షరాస్యత 77.35%, స్త్రీల అక్షరాస్యత 55.01%గా ఉన్నాయి.[10]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 1,015,503[11][12]
పురుషుల సంఖ్య 542,171 (53.4%)
స్త్రీల సంఖ్య 473,332 (46.6%)
ఇది దాదాపు సైఒరస్ దేశ జనసంఖ్యకు సమానం.[13]
అమెరికాలోని మోంటానా నగర జనసంఖ్యకు సమం.[14]
640 భారతదేశ జిల్లాలలో 443వ స్థానంలో ఉంది. .[12]
1చ.కి.మీ జనసాంద్రత 305 [12]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 20.34%.[12]
జనసాంధ్రతలో జిల్లా స్థితి రాష్ట్రంలో 5 వ స్థానం.
స్త్రీ పురుష నిష్పత్తి 873:1000 [12]
జాతియ సరాసరి (928) కంటే అల్పం
అక్షరాస్యత శాతం 66.93%.[12]
పురుషుల అక్షరాస్యతా శాతం 77.35%
స్త్రీల అక్షరాస్యతా శాతం 55.01%
జాతియ సరాసరి (72%) కంటే

భౌగోళికం

మార్చు

బారాముల్లా జిల్లా తూర్పుసరిహద్దులో శ్రీనగర్, గందర్బల్ జిలా జిల్లా, పశ్చిమ సరిహద్దులో దేశీయసరిహద్దు, ఉత్తర సరిహద్దులో కుప్వారా జిల్లా, వాయవ్య సరిహద్దులో బండిపోరా జిల్లా, దక్షిణ సరిహద్దులో పూంచ్ (లడఖ్) జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో బుద్గాం జిల్లా ఉన్నాయి.బారాముల్లా జిల్లా జెహ్లెం నదీతీరంలో ఉంది. ఈ జిల్లా జెహ్లెం నది జన్మస్థలం ఉంది. పాతపట్టణం నది ఉత్తర తీరంలో ఉంది. కొత్త పట్టణం నది దక్షిణతీరంలో ఉంది. ఈ ప్రాంతం గుల్నర్‌ పార్క్, దేవన్ బాగ్‌లతో సస్పెంషన్ వంతెనతో కలిసి ఐదు వంతెనలు కలుపుతున్నాయి.కొత్తగా నిర్మించబడిన వంతెన ఖాన్‌పోరా, ద్రాంగ్‌బల్ నగరాలను బారాముల్లాతో అనుసంధింస్థుంది.కొత్త పట్టణం కంటే పాతపట్టణం ఇరుకుగానూ చిన్నదిగానూ ఉంటుంది. కొత్త పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలు, సివిల్ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, పలు ఇతర సౌకర్యాలూ ఉన్నాయి. కొత్తపట్టణానికి తూర్పు సరిహద్దులో రైవే స్టేషను ఉంది. పాతపట్టణం దాటిన తరువాత జెహ్లెం నది రెండు పాయలుగా చీలి ద్వీపాన్ని ఏర్పరిచింది. జెహ్లెం నిదీ ద్వీపంలో ఎకోపార్క్ రూపొందించబడింది. ఈ నది తరువాత ఉరి పట్టణం నుండి ముజఫరాబాద్ ప్రవహించి తతువాత కాశ్మీర్ నుండి పాకిస్థాన్ దేశంలో ప్రవేశిస్తుంది.

ఆర్ధికం

మార్చు

బారముల్లా జిల్లాలో హాఋతికల్చర్ ఉత్పత్తులు అధికం. అంతర్జాతీయ నాణ్యతకలిగిన అప్ప్లస్ ఇక్కడ పెంచబడుతున్నాయి.

పర్యాటకం

మార్చు

బారాముల్లా జిల్లా పర్యాటకులకు స్వర్గసీమ లాంటిది.

గుల్‌మార్గ్

మార్చు
 
స్కై లిప్టు ఉపయోగిస్తున్న దృశ్యచిత్రం
 
గుల్మార్గ్ వద్ద కొత్త కేబుల్ కారు దృశ్యచిత్రం

బారాముల్లా జిల్లాలో గుల్‌మార్గ్ గ్రామం (గడ్డిపూల మైదానం) అని పిలువబడుతుంది. సముద్రమట్టానికి 2,730 మీ ఎత్తులో ఉన్న ఇది స్కీయింగ్ చేయడానికి అనుకూలమైనది. స్కీయింగ్ స్లాప్‌ను చేరుకోవడానికి ఇక్కడ కేబుల్ కార్ ఉంది. శ్రీనగర్ నుండి 50 కి.మీ తూర్పుగా ప్రయాణించి గుల్‌మార్గ్ చేరుకోవచ్చు.

తంగ్‌మార్గ్

మార్చు

బారాముల్లా జిల్లాలోని ఇతర పర్యాటక ఆకర్షణలలో శ్రీనగర్ గుల్‌మార్గ్ మద్య ఉన్న తంగ్‌మార్గ్ ఒకటి. శ్రీనగర్‌కు 60 కి.మీ దూరంలో ఉన్న వూలర్ సరసు, 32 కి.మీ దూరంలో ఉన్న మానస్బల్ సరసు, పక్షిలను సందర్శించే ప్రదేశం, మనిమార్గ్, విజిమార్గ్, మహాలిషా మార్గ్ ప్రధానమైనవి.

ఎకోపార్క్

మార్చు

బారాముల్లా జిల్లాలోని ఖద్నియార్ వద్ద ఉన్న ఎకోపార్క్ జెహ్లం నది ద్వీపంలో ఉంది. ఇది బారముల్లా, ఉరి రహదారి మార్గంలో ఉంది. ఈ ద్వీపానికి ఒక చెక్క వంతెన ద్వారా చేరుకోవచ్చు. ఇది సమీపకాలంలో కాశ్మీర్ ప్రభుత్వం టూరిస్ట్ డిపార్ట్‌మెంటు ద్వారా అభివృద్ధి చేయబడింది. పర్వతశిఖరాల నేపథ్యంలో ఇది మనోహరంగా కనిపిస్తుంది. జెహ్లం నదీ ప్రవాహం మద్య పసిరిక బయళ్ళతో ఉన్న గార్డెన్ ఈ ఎకో పార్క్ హృద్యంగా ఉంటుంది. టూరిస్ట్ రంగం నిర్మించిన అందమైన చెక్క కుటీరాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. బారముల్లాలో పర్యాటకులు చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ప్రాంతీయ పర్యాటకులకు కూడా వేసవి సాయంకాలలో ఇది ఒక ఆకర్షణీయమైన ప్రదేశం [15]

విద్య

మార్చు

బారాముల్లా పట్టణంలో కేంద్రీయ విద్యాలయ, సైనిక పాఠశాల ఉన్నాయి. సెకండరీ స్థాయి పాఠశాలలైన వీటిలో సెంట్రల్ బోర్డ్ (ది.బి.ఎస్.సి) సిలబస్ బోధన జరుగుతుంది. ఎస్.టి జోసెఫ్స్ స్కూల్ (బారాముల్లా) కాశ్మీరి లోయలోని పురాతన మిషనరీ పాఠశాలలో ఇది ఒకటి. ఇతర ప్రైవేట్ స్కూల్సులో బీకాన్ హౌస్ వద్ద ఉన్న " బారాముల్లా పబ్లిక్ హైయ్యర్ సెకండరీ స్కూల్", ఉష్కరా వద్ద ఉన్న " హనీఫా మోడెల్ ఉన్నత పాఠశాల", డిల్లీ పబ్లిక్ స్కూల్, ఇతర పలు స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే పలు పబ్లిక్ స్కూల్స్, హైయ్యర్ సెకండరీ స్కూల, ఇంటర్ కాలేజీలు కూడా ఉన్నాయి. బారాముల్లా పట్టణంలో స్త్రీల కొరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉంది. పట్టణంలో జిల్లా ఆసుపత్రికి అనుసంధానంగా నర్సింగ్ కాలేజ్ ఉంది. నగరంలో ఇంకా మెడికల్ కాలేజ్, 2 పాలిటెక్నిక్ ఇంస్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. మగపిల్లలకు హాస్టల్, 2 డిగ్రీ కాలేజులు ఉన్నాయి. " యూనివర్శిటీ ఆఫ్ కాశ్మీర్ నార్త్ కాంపస్ " బారాముల్లా పట్టణంలో ఉంది. జిల్లాలోని ఇతర పట్టణాలలో స్కూల్స్, పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని ఒక్కో పట్టణంలో 1 లేక 2 స్కూల్స్ ఉన్నాయి.

ఆరోగ్యసంరక్షణ

మార్చు

బారాముల్లా జిల్లాలో సివిల్ హాస్పిటల్, రేడియాలజీ, ఆల్ట్రాసోనోగ్రఫీ సౌకర్యాలు కలిగిన వేర్నరీ హాస్పిటల్ (పశువుల ఆసుపత్రి) ఉనాయి. 2013లో సివిల్ హాస్పిటల్ కంథ్‌భాగ్ వద్ద ఉన్న 300 పడకల వసతి కలిగిన ఆసుపత్రికి తరలించారు. 2 దశాబ్ధాలుగా ఎస్.టి జోసెఫ్ హాస్పిటల్ కూడా వైద్యపరమైన సేవలు అందిస్తుంది.[16] ఇతర చిన్న పట్టణాలలో కూడా చిన్న ఆసుపత్రులు ఉన్నాయి. గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉన్నాయి.

ప్రయాణవసతులు

మార్చు

బారముల్లా చేరే మార్గాలు

మార్చు

శ్రీనగర్ నుండి

మార్చు

బారాముల్లా పట్టణం శ్రీనగర్కు 55 కి.మీ దూరంలో ఉంది. జాతీయరహదారి- 1ఎ ఈ పట్టణాన్ని మిగిలిన దేశంతో అనుసంధానిస్తుంది. శ్రీనగర్, జమ్ము నుండి అద్దె టాక్సీలు లభిస్తున్నాయి. సమీపంలోని విమానాశ్రయం శ్రీనగర్‌లో వద్ద ఉంది. సమీపంలోని రైల్వే స్టేషను జమ్మూ తావిలో ఉంది. ఇది ఈ ప్రాంతం నుండి 360కి.మీ దూరంలో ఉంది.

ఉరి, ఉజ్ఫరాబాద్ నుండి

మార్చు

బారాముల్లా నుండి ముజాఫరాబాద్ మద్య 123 కి.మీ పొడవున జెహ్లం నదీతీరంలో రహదారి మార్గం ఉంది. ఇది సరిహద్దు రేఖను దాటుతూ బారాముల్లాకు పశ్చిమంగా 45 కి.మీ దూరంలో ఉన్న ఉరి మీదుగా పోతుంది. ఉరి నుండి మొదటి 5 కి.మీ జెహ్లం తీరానికి దూరంగా మొదలై మిగిలిన 40 కి.మీ పొడవున జెహ్లం నది వెంట సాగుతుంది. ఈ మార్గం కొండచరియల పక్కగా సాగుతూ ఉంటుంది.

గుల్‌మార్గ్

మార్చు

బారాముల్లా జిల్లాలోని గుల్‌మార్గ్ వద్ద ప్రఖ్యాత స్కైరిసార్ట్ ఉంది. శ్రీనగర్ నుండి 50 కి.మీ తూర్పుగా ప్రయాణించి ఇక్కడకు చేరుకోవచ్చు. ఇది బారాముల్లాకు దక్షిణంగా 17 కి.మీ దూరంలో ఉంది.

వాయుమార్గం

మార్చు

బారాముల్లా జిల్లాకు అతి సమీపంలో ఉన్న విమానాశ్రయం శ్రీనగర్లో ఉంది. రాష్ట్రానికి వేసవి రాజధాని అయిన జమ్మూలో కూడా విమానాశ్రయం ఉంది.

రహదారి

మార్చు

బారాముల్లా పత్తాన్, ఉరి, సోపోర్, గుల్‌మార్గ్, తంగ్‌మార్గ్, ఇతర పట్టణాలతో రహదారి మార్గంతో అనుసంధానితమై ఉంది. అంతేకాక శ్రీనగర్, ఇతర పట్టణాలతో రహదారి మార్గంతో అనుసంధానితమై ఉంది. సరిహాద్దు మీదుగా రహదారి మార్గంలో ముజఫరాబాద్ వరకు ఉన్న రహదారి మార్గం 1947 అక్టోబరు మాసంలో పాకిస్థాన్ గిరిజనులు జరిపిన దాడి తరువాత మూసివేయబడింది. 2005 నుండి శ్రీనగర్, ముజఫరాబాద్ మర్గాన్ని తిరిగి తెరచిన తరువాత కూడా అనేక కట్టుబాట్లు, నిధేధాల వలన ప్రయాణం కష్టతరంగా ఉంది.

రైల్వే

మార్చు

2009లో ప్రారంభించిన 119 కి.మీ పొడవున ఉన్న కాశ్మీర్ రైల్వేలో చివరి స్టేషను‌ బారాముల్లా ఉంది. ఈ మార్గం బారాముల్లా, శ్రీనగర్, క్వాజీగుండ్ వరకు నిర్మించబడింది. ఈ రైలు మార్గం బారాముల్లా జిల్లాను 2012లో పిర్ పంజల్ పర్వతాలలో నిర్మించిన 11 కి.మీ పొడవైన బనిహాల్ సొరంగమార్గం ద్వారా బనిహాతో అనుసంధానం చేస్తుంది. తరువాత ఈ మార్గం ఇండియన్ రైల్వేకి చెందిన జమ్మూతో అనుసంధానం చేయబడింది. సమీపకాలంలో అభివృద్ధిపనులలో బారముల్లా జిల్లాను శ్రీనగర్, అనంతనాగ్, క్వజియాబాద్‌లను రైల్వే మార్గం ద్వారా అనుసంధానితం చేసారు.

బారాముల్లా జిల్లాలో సాధారణంగా కాశ్మీరి భాష వాడుకలో ఉంది. తరువా స్థానాలలో గుజారీ, హిందీ, పంజాబీ భాషలు ఉన్నాయి. [17]

మూలాలు

మార్చు
  1. The economy of Jammu & Kashmir. Radha Krishan Anand & Co., 2004. Retrieved 2010-07-01. ... meaning in Sanskrit a boar's place.[ఆధారం చూపాలి] Foreigners who visited this place pronounced ... The place was thus named as Baramulla meaning 12 bores.
  2. Kashmir and it's people: studies in the evolution of Kashmiri society. A.P.H. Publishing Corporation. Retrieved 2010-07-01. That the valley of Kashmir was once a vast lake, known as "Satisaras", the lake of Parvati (consort of Shiva), is enshrined in our traditions. There are many mythological stories connected with the desiccation of the lake, before the valley was fit for habitation. The narratives make it out that it was occupied by a demon 'Jalodbhava', till Lord Vishnu assumed the form of a boar and struck the mountain at Baramulla (ancient Varahamula) boring an opening in it for the water to flow out.
  3. http://baramulla.nic.in/intro/intro.htm Archived 2012-02-23 at the Wayback Machine District Profile
  4. http://www.kashmir-information.com/KoshSam/Kashmir_Affairs.html Archived 2014-06-18 at the Wayback Machine The Story of Kashmir Affairs - A Peep into the Past
  5. Tom Cooper (29 October 2003), Indo-Pakistani War, 1947-1949, Air Combat Information Group, retrieved 11 April 2012
  6. http://www.frontlinekashmir.org/2011/10/october-27-1947-dakota-in-my-dell.html Archived 2012-04-25 at the Wayback Machine October 27, 1947: Dakota in my dell ~ FRONTLINE KASHMIR
  7. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
  8. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.
  9. "Baramula District Population Census 2011-2020, Jammu and Kashmir literacy sex ratio and density". www.census2011.co.in. Retrieved 2020-11-29.
  10. https://baramulla.nic.in/demography/
  11. Baramula Population Census 2011, Baramula, Jammu and Kashmir literacy sex ratio and density
  12. 12.0 12.1 12.2 12.3 12.4 12.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  13. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.
  14. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Montana 989,415
  15. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-09. Retrieved 2014-06-30.
  16. http://www.tribuneindia.com/2013/20130330/kashmir.htm#2
  17. S.C. Bhatt; Gopal Bhargava. Land and People of Indian States and Union Territories. Retrieved 2010-07-01. As most of these Hindi albeit Gujari speakers have been shown as concentrated in Baramulla, Kupwara, Punch, Rajouri and Doda districts, their Gujar identity becomes obvious. The number of Punjabi speakers in 1961, 1971 and 1981 Census Reports, actually reflects the number of Sikhs who have maintained their language and culture, and who are concentrated mainly in Srinagar, Badgam, Tral, Baramulla (all in Kashmir region), Udhampur and Jammu.

జిల్లా సరిహద్దులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు