బాలమురుగన్
బాలమురుగన్ (1937 - 2023 జనవరి 15) భారతీయ సినీ రచయిత. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో 150కి పైగా సినిమాలకు కథలు అందించాడు.
బాలమురుగన్ | |
---|---|
జననం | 1937 చెన్నై |
మరణం | 2023 జనవరి 15 |
వృత్తి | సినీ కథా రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1970 - 2023 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సొగ్గాడు (తెలుగు), తమిళంలో కన్నె పాప (1969), వసంత మాళిగై (1972), చిత్ర పౌర్ణమి (1976) |
పిల్లలు | భూపతిరాజా, ప్రముఖ తెలుగు, తమిళ సినీ రచయిత (కుమారుడు) |
కెరీర్
మార్చుఆయన తెలుగులో ధర్మదాత, సోగ్గాడు, ఆలుమగలు, సావాసగాళ్లు, పిచ్చిపంతులు, భార్యాభర్తలు, పల్లెటూరి బావ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలకు కథ అందించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తొలి చిత్రం బంట్రోతు భార్య కు కూడా బాలమురుగన్ కథ అందించడం విశేషం. తమిళంలో ఆయన శివాజీ గణేశన్‌కు దాదాపు 40 చిత్రాలకు కథలను అందించాడు.
మరణం
మార్చు86 సంవత్సరాల వయసులో కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ బాలమురుగన్ చెన్నైలో 2023 జనవరి 15న కన్నుమూసాడు.[1] ఆయన కుమారుడే ప్రముఖ తెలుగు, తమిళ రచయిత భూపతి రాజా.
మూలాలు
మార్చు- ↑ "Balamurugan: సినీ కథా రచయిత బాలమురుగన్ కన్నుమూత". web.archive.org. 2023-01-16. Archived from the original on 2023-01-16. Retrieved 2023-01-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)