సోగ్గాడు (1975 సినిమా)

సోగ్గాడు, 1975లో విడుదలైన ఒక తెలుగు సినిమా. పల్లెటూరు నేపథ్యంలో శోభన్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా గొప్ప విజయం సాధించి అనేక రికార్డులను సొంతం చేసుకొంది. శోభన్ బాబును "సోగ్గాడు శోభన్ బాబు" అని ఈ సినిమా తరువాత పిలువ సాగారు. చాలా సామాన్యమైన కథతో వచ్చిన ఈ సినిమా అన్నివిధాలుగా మాస్ సినిమా అన్న వర్ణనకు ప్రతీకగా నిలుస్తుంది.

సోగ్గాడు
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాపయ్య
నిర్మాణం డి. రామానాయుడు
కథ బాలమురుగన్
చిత్రానువాదం కె. బాపయ్య
తారాగణం శోభన్ బాబు (సోగ్గాడు శోభనాద్రి),
జయచిత్ర (లత),
జయసుధ (సరోజ),
సత్యనారాయణ (భూపతి),
శాంతకుమారి (లత తల్లి),
రాజబాబు (రాజేంద్ర ప్రసాద్),
నగేష్ (సన్యాసిరావు),
అంజలీదేవి (శోబన్ బాబు తల్లి),
అల్లు రామలింగయ్య (పరమేశం),
టి.సుబ్బిరామిరెడ్డి (కలెక్టర్),
రమాప్రభ (గజలక్ష్మి),
పద్మనాభం (సలీం),
మంజుభార్గవి (సావిత్రి),
గుమ్మడి వెంకటేశ్వరరావు (సింహాద్రి),
గిరిబాబు (ప్రసాద్)
అర్జా జనార్ధనరావు (పోతురాజు, కబాడీ ఆటగాడు),
ఝాన్సీ (డాక్టర్),
రవికుమార్,
పి.జె.శర్మ
కల్పన,
కవిత,
మోదుకూరి సత్యం,
గోకిన రామారావు,
బేబీ వరలక్ష్మి[-అయోమయ నివృత్తి పేజీకి వెళ్తున్న ఈ లింకును సవరించాలి-],
ధూళిపాల
కోకా సంజీవరావు
సంగీతం కె.వి.మహదేవన్
(సహాయకుడు: పుహలేంది)
నేపథ్య గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
పి. సుశీల
గీతరచన ఆత్రేయ
సంభాషణలు మోదుకూరి జాన్సన్
ఛాయాగ్రహణం విన్సెంట్,
కె.ఎస్. ప్రకాష్
కూర్పు నరసింహారావు
నిర్మాణ సంస్థ సురేష్ పిక్చర్స్
విడుదల తేదీ 19 డిసెంబరు 1975
భాష తెలుగు

ఒక పల్లెటూరిలో శోభనాద్రిని "సోగ్గాడు" అని పిలుస్తారు. తన మరదలు సరోజ (జయసుధ)ను ప్రేమించాడు. కాని అతని మేనమామ పరమేశం అందుకు ఒప్పుకోడు. ఎందుకంటే సొగ్గాడు పల్లెటూరి రైతు. సరోజ పట్నంలో చదువుతున్నది. సరోజకంటే బాగా చదువుకొన్న అమ్మాయిని పెళ్ళి చేసుకొంటానని ఛాలెంజి చేసిన సోగ్గాడికి పట్నంలో లత (జయచిత్ర) తారస పడుతుంది. ఆమె తనకిష్టంలేని పెళ్ళినుండి తప్పించుకోవడానికి పట్నం వచ్చింది. లత, శోభనాద్రి ఒక హోటల్లో పెళ్ళి చేసుకొంటారు. తరువాత అనేక సమస్యలు ఎదురౌతాయి. ఆ సమస్యలను అధిగమించి సోగ్గాడు నెగ్గుకురావడమే ఈ సినిమా కథ.

పాటలు

మార్చు
  • అవ్వా బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయీ - ఎస్.పి., సుశీల
  • చలి వేస్తోందీ, చంపేస్తూందీ, కొరికేస్తూందీ - ఎస్.పి., సుశీల
  • ఏడుకొండలవాడా వెంకటేశా, ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా - ఎస్.పి., సుశీల
  • ఏడుకొండలవాడా వెంకటేశా, ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా (విషాదం)- ఎస్.పి., సుశీల
  • ఒలే ఒలే ఓలమ్మీ ఉఫ్ఫంటేనే ఉలిక్కిపడ్డావు - ఎస్.పి., సుశీల
  • సోగ్గాడు లేచాడు, చూసి చూసి నీ దుమ్ము దులుపుతాడు - ఎస్.పి., సుశీల

రికార్డులు, విశేషాలు

మార్చు
  • ఇది శోభన్ బాబుకు 114వ సినిమా. 1975లో శోభన్ బాబు నటించిన అనేక చిత్రాలు విజయవంతమయ్యాయి. (దేవుడు చేసిన పెళ్ళి, అందరూ మంచివారే, బలిపీఠం, జేబుదొంగ, జీవనజ్యోతి వంటివి.)
  • ఇది జయచిత్రకు తొలిచిత్రం. జయసుధ కూడా అప్పుడే సినీరంగంలో నిలద్రొక్కుకుంటున్నది. టి. సుబ్బిరామిరెడ్డి ఈ సినిమాలో నటించడం ఒక విశేషం.
  • సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్లయ్యాయి. ఫంక్షన్లలో ఈ పాటలు మారుమ్రోగాయి.
  • ఈ సినిమాను జితేంద్ర హీరోగా "దిల్‌దార్" అనే హిందీ సినిమాగా పునర్నిర్మించారు. దానికి కూడా కె. బాపయ్య దర్శకుడు. హిందీ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది.
  • ఈ సినిమాలో శోభన్ బాబుకు ఉత్తమ నటుడిగా మూడవ ఫిలిమ్‌ఫేర్ అవార్డు లభించింది. (ఖైదీ బాబాయి, జీవనజ్యోతి తరువాత)
  • 17 థియేటర్లలో ఈ సినిమా స్ట్రెయిట్‌గా వందరోజులు ఆడింది. బాక్సాఫీసు కలెక్షన్లలో అనేక రికార్డులు స్వంతం చేసుకొంది.

మూలాలు, వనరులు

మార్చు