బి.వి.రాజు(భూపతిరాజు విస్సంరాజు) (అక్టోబరు 15, 1920 - జూన్ 8, 2002) పారిశ్రామిక వేత్త, విద్యావేత్త. పద్మభూషణ్ సత్కారం పొందాడు.

బి.వి.రాజు
Bhupathiraju vissam raju.JPG
భూపతిరాజు విస్సంరాజు
జననం(1920-10-15)1920 అక్టోబరు 15
మరణం2002 జూన్ 8(2002-06-08) (వయసు 81)[1]
జాతీయతభారతీయుడు
వృత్తిపారిశ్రామికవేత్త
పిల్లలు3 కుమార్తెలు
పురస్కారాలుపద్మశ్రీ
పద్మ విభూషణ్

వ్యక్తిగత జీవితంసవరించు

బి.వి రాజు 1920 లో అక్టోబరు 15 న పశ్చిమ గోదావరి జిల్లా కుముదవల్లి గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. బెనారస్ హిందూ యూనివర్శిటీ నుండి కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పొందాడు. అమెరికాలో హార్వర్డ్ యూనివర్శిటీ నుండి మేనేజ్ మెంట్ లో మాస్టర్ డిగ్రీ సాధించాడు.

2002 జూన్ 8 న మరణించాడు

స్థాపించిన విద్యా సంస్థలుసవరించు

1997 లో మెదక్‌లోని నరసాపూర్లో విష్ణుపూర్ అనే ప్రాంతంలో బి.వి.రాజు ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BVRIT) నెలకొల్పాడు. భీమవరం, విష్ణుపూర్ వద్ద కూడా విష్ణు యూనివర్సల్ లెర్నింగ్, విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, శ్రీమతి సీతా పాలిటెక్నిక్, శ్రీ బి.వి రాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సంస్థలను స్థాపించాడు.

పరిశ్రమలుసవరించు

సిమ్మెంట్ పరిశ్రమలో ఆయన కెరీర్ అత్యంత దిగువ స్థాయిలో ప్రారంభమైంది. తరువాత అంచెలు అంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిమ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందించారు. దేశంలోని పలు ప్రాంతాలలో సిమ్మెంట్ ఫ్యాక్టరీల స్థాపనలో బి.వి రాజు కృషి ఎంతో ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని కడప, తాండూరు, అదిలాబాద్; హిమాచల్ ప్రదేశ్ లోని రాజ్ బన్, కర్నాటక లోని కురుకుంట, అస్సాంలోని బుకజమ్, మధ్యప్రదేశ్ లోని నీముఖ్, అఖిల్తాన్, మందర్ వంటి ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు నెలకొల్పబడటానికి బి.వి రాజు కారణం. తమిళనాడు, కేరళ, ఒడిషా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వాలకు సలహాదారుడిగా పనిచేశాడు. దేశంలోని పారిశ్రామిక రంగంలో చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఈయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ ఈయనను గౌరవ డాక్టరేట్ తో సన్మానించింది.

రిటైర్మెంటు అనంతరం రాశి సిమెంట్, విష్ణు సిమెంట్, రాశి రిఫ్రాక్టరీస్, రాశి సిరామిక్స్, తెలంగాణా పేపర్ మిల్స్, రాశి సాఫ్టువేర్, రాశి ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ సంస్థలను స్థాపించాడు. [2]

సేవా కార్యక్రమాలుసవరించు

బి.వి రాజు ఫౌండేషన్, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రామాలలో పారిశుధ్యం, త్రాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు కృషి చేశాయి. విస్సంరాజు తన సొంత గ్రామమైన కుముదవల్లి వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయంకొరకు పలు విరాళాలు అందించాడు. భారత ప్రభుత్వం ఈయనకు 2001 లో పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.


అవార్డులుసవరించు

  • 1983-84 రాశి సిమెంట్ సంస్థ ద్వారా సేవలకు ఎకానమిక్స్ టైంస్, హార్వార్డు బిజినెస్ స్కూల్ సంస్థలు సంయుక్తంగా ఇచ్చిన అవార్డు
  • 1984 ఉత్తమ ఉత్పాదక, ఉత్తమ ఉత్పత్తి, ఉత్తమ పారిశ్రామిక సంబంధాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవార్డు

మూలాలుసవరించు

  1. "Obituary". The Hindu. 11 June 2002. Retrieved 8 June 2019.
  2. "India Cements acquires Raasi to become #2". Rediff. 7 April 1998. Retrieved 27 June 2015.

బయటి లింకులుసవరించు

https://web.archive.org/web/20100816142059/http://www.seethapoly.edu.in/Founder%20Chairman.htm