బి. సరోజా దేవి

సినీ నటి
(బి సరోజాదేవి నుండి దారిమార్పు చెందింది)

బి. సరోజాదేవి, ఒక ప్రసిద్ధ దక్షిణభారత చలనచిత్ర నటి.[1] పద్మభూషణ్ అవార్డు గ్రహీత. అనేక తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది. 1955లో హొన్నప్ప భాగవతార్ నిర్మించిన మహాకవి కాళిదాస అనే కన్నడ సినిమాతో ఈమె సినిమా రంగంలో ప్రవేశించింది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్రకథానాయకుల సరసన సుమారు 180 పైగా చిత్రాలలో నటించింది.[2]

బి. సరోజా దేవి
జననం(1942-01-07)1942 జనవరి 7
బెంగుళూరు, కర్ణాటక
వృత్తినటి
జీవిత భాగస్వామిశ్రీహర్ష
పిల్లలుభువనేశ్వరి, ఇందిరా పరమేశ్వరి, గౌతమ్ రామచంద్ర
తల్లిదండ్రులు
  • బైరప్ప (తండ్రి)
  • రుద్రమ్మ (తల్లి)

జీవితం

మార్చు

బి. సరోజాదేవి 1942, జనవరి 7న కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరులో జన్మించింది. ఈమె తండ్రి బైరప్ప పోలీసు ఉద్యోగి. తల్లి రుద్రమ్మ. సరోజకు ముగ్గురు అక్కయ్యలు. పార్వతి, కమల, సిద్ధలింగాంబికె. బైరప్పకు నాటకాలంటే ఇష్టం. నాటక సంస్థలో చేరి నటించే వాడు. అప్పుడప్పుడూ సరోజా దేవితో నటింపజేసి చూసుకుని మురిసిపోయేవాడు.

కుటుంబం

మార్చు

100 సినిమాలకు పైగా నటించి మంచి స్థాయిలో ఉండగా ఈమెకు శ్రీహర్ష అనే వ్యక్తితో వివాహం జరిగింది. అప్పట్లో ఆయన జర్మనీలో సీమెన్స్ సంస్థలో పనిచేసేవాడు. వీరికి ఇద్దరు కూతుర్లు భువనేశ్వరి, ఇందిరా పరమేశ్వరి, ఒక కొడుకు గౌతం రామచంద్ర. భర్త శ్రీహర్ష, పెద్ద కూతురు భువనేశ్వరి మరణించారు. ఈమె ప్రస్తుతం బెంగుళూరులో నివాసం ఉంటూ భర్త స్థాపించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు.

సినిమాలు

మార్చు

ఓ నాటకంలో ఆమె ప్రదర్శనను తిలకించిన కన్నడ దర్శక నిర్మాత కన్నప్ప భాగవతార్ ఆమెకు 13 ఏళ్ళ వయసులో కాళిదాసు సినిమాలో అవకాశం ఇచ్చాడు. తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. మకాం మద్రాసుకు మారింది. తెలుగులో ఆమెకు వచ్చిన మొదటి అవకాశం పెళ్ళి సందడి. కానీ పాండురంగ మహాత్యం ముందుగా విడుదలైంది.

తమిళంలో ఆమె నటించిన ఇరంబుతిరై అనే సినిమా హిందీలో పైగా అనే పేరుతో పునర్నిర్మించారు. అప్పుడే ఆమెకు దిలీప్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆమెకు అనేక హిందీ సినిమాల్లో కూడా అవకాశం వచ్చింది. ఎల్. వి. ప్రసాద్ తీసిన ససురాల్ సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఉత్తరాది పత్రికలు ఆమెను మద్రాస్ కా సుందర్ తారా అని అభివర్ణించాయి.[1]

హిందీలో దిలీప్ కుమార్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, తమిళంలో ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్, జెమిని గణేశన్, తెలుగులో ఎన్. టి. ఆర్, ఎ. ఎన్. ఆర్ లాంటి అగ్ర కథానాయకుల సరసన నటించింది.

నటించిన కొన్ని తెలుగు చిత్రాలు

మార్చు

పురస్కారాలు

మార్చు
  • పద్మభూషణ్
  • ఎన్. టి. ఆర్ పురస్కారం

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 జి., జగదీశ్వరి (2010). ఈనాడు ఆదివారం. బెంగుళూరు: ఈనాడు. pp. 20–21. {{cite book}}: |work= ignored (help)
  2. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 127.