బీజాపూర్ (కర్ణాటక)
బీజాపూర్, అధికారికంగా విజయపుర అని పిలుస్తారు.[2] భారతదేశం, కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని నగరం.ఇది జిల్లా ప్రధాన కేంద్రం, బీజాపూర్ తాలూకాకు ప్రధాన కార్యాలయం.బీజాపూర్ నగరం ఆదిల్ షాహీ రాజవంశం పాలనలో నిర్మించబడిన నిర్మాణప్రాముఖ్యత కలిగిన చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది.ఇది బీజాపూర్ ఎద్దులకు ప్రసిద్ధి. కర్ణాటక ప్రీమియర్ లీగ్ జట్టు క్రీడలకు ప్రసిద్ధి చెందిననగరం.బీజాపూర్ నగరం, రాష్ట్ర రాజధాని బెంగళూరుకు వాయువ్యంగా 530 కి.మీ.(330 మైళ్లు) దూరంలో, ముంబాయి నుండి 550 కి.మీ.(340 మైళ్లు) దూరంలో, హైదరాబాద్ నగరానికి పశ్చిమాన 384 కి.మీ ( 239 మైళ్లు) దూరంలోఉంది.
Bijapur
Vijayapura | |
---|---|
City | |
Nickname: City of victory | |
Coordinates: 16°50′N 75°43′E / 16.83°N 75.71°E | |
Country | India |
State | Karnataka |
District | Bijapur |
Government | |
• Type | City Municipal Corporation |
• Body | Vijayapura Mahanagara Palike (VMP) |
• Mayor | BJP |
విస్తీర్ణం | |
• Total | 102.38 కి.మీ2 (39.53 చ. మై) |
Elevation | 592.23 మీ (1,943.01 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 3,26,360 |
• Rank | 10th (Karnataka) |
• జనసాంద్రత | 265/కి.మీ2 (690/చ. మై.) |
Demonym(s) | Vijayapurian,Bijapuri |
Languages | |
• Official | Kannada |
Time zone | UTC+05:30 (IST) |
PIN | 586101-586109 |
Telephone code | 08352 |
ISO 3166 code | IN-KA |
Vehicle registration | KA-28 |
ఈ నగరం సా.శ. 10వ-11వ శతాబ్దాలలో కళ్యాణి చాళుక్యులచే స్థాపించబడింది.దీనినివిజయపుర ,విజయ నగరం అనే మరో పేర్లుతో కూడా పిలుస్తారు. చాళుక్యుని మరణానంతరంఈనగరం యాదవుల ఆధీనంలోకి వచ్చింది. సా.శ.1347లో ఈప్రాంతాన్ని బహమనీ సుల్తానేట్ స్వాధీనం చేసుకున్నారు.బహమనీ సుల్తానేట్ విడిపోయినతరువాత, బీజాపూర్ సుల్తానేట్ నగరంనుండిపాలించారు.బీజాపూర్ కోట,బారా కమాన్, జామా మసీదు,గోల్ గుంబజ్‌లతో సహాసుల్తానేట్లపాలనఅవశేషాలునగరంలో చూడవచ్చు.
భారతదేశం,కర్ణాటకరాష్ట్రంలో ఉన్నప్రసిద్ధవారసత్వ నగరాలలో ఒకటైన బీజాపూర్, కర్ణాటకలోనిమొదటిపదిజనాభాకలిగిన నగరాలలోఒకటి. 2013లో బీజాపూర్ నగరంప్రధానకేంద్రంగానగరపాలకసంస్థగా ప్రకటించబడింది. [3] 2011 భారత జనాభా లెక్కలప్రకారంబీజాపూర్ పట్టణ జనాభా 3,26,000, ఇది బహుశా కర్ణాటకలో జనాభాపరంగా 9వ అతిపెద్ద నగరం.విజయపుర మహానగర పలికే అనేది షిమోగా,తుమకూరు నగరపాలకసంస్థలతో పాటుకర్ణాటక పురపాలకసంఘచట్టంప్రకారం ఏర్పడినసరికొత్తనగరపాలకసంస్థ. [4] నగరపౌరపరిపాలనబీజాపూర్ నగరపాలక సంస్థ,బీజాపూర్‌లోనిఉపకమిషనర్ కార్యాలయంద్వారా నిర్వహించబడుతుంది.ఉపకమిషనర్ కార్యాలయంబీజాపూర్‌లోని గ్రామీణ ప్రాంతాల బాధ్యతనుకలిగిఉంది.అయితేనగరపాలకసంస్థ బీజాపూర్ నగరాన్ని నిర్వహిస్తుంది.వారసత్వనగరమైన బీజాపూర్ సమర్థవంతమైన పరిపాలన విజయపురనగరపాలకసంస్థ అన్ని కార్యకలాపాల వెనుక ప్రధాన ఉద్దేశం.
చరిత్ర
మార్చుప్రారంభ చరిత్ర
మార్చుబీజాపూర్ జిల్లా చారిత్రాత్మకంగా,సాంప్రదాయకంగా, పురాణ కథనంగా, రాష్ట్రంలోని అత్యంత ధనిక జిల్లాలలోఒకటి.ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఇది రాతియుగంనాటినుండిజనావాసాలున్న ప్రదేశం అని తెలుపుతుంది.
జిల్లా చరిత్ర బాదామిని చాళుక్యుల స్వాధీనంనుండి ముస్లిం దండయాత్ర వరకు నాలుగు కాలాలుగావిభజించబడింది.అవిదాదాపు సా.శ. 535 నుండి సా.శ.757వరకుకొనసాగినతొలిపశ్చిమచాళుక్యుల కాలం. సా.శ. 757 నుండి సా.శ. 973 వరకురాష్ట్రకూటకాలం.కలచూరి,హోయసల కాలం సా.శ. 973 నుండి సుమారు సా.శ.1200 వరకు,దేవగిరియాదవుల కాలం సా. శ.1185 నుండి సా.శ.1312లో దేవగిరినిముస్లింలుఆక్రమించే వరకు పాలన సాగించారు.
బహమనీ, బీజాపూర్ సుల్తానేట్లు
మార్చుబీజాపూర్ మొదట సా.శ. 13వ శతాబ్దం చివరలో ఢిల్లీ సుల్తాన్ అల్లాదీన్ ఖాల్జీ ప్రభావంలోకి వచ్చింది.ఆపై సా.శ.1347లో బీదర్ బహమనీ రాజుల క్రింద వచ్చింది. సా.శ.1347లో, బహమనీరాజవంశం స్థాపించబడినప్పుడు, అది బీజాపూర్ జిల్లాలోనిదక్షిణ,తూర్పు భాగాలనుకలిగి ఉంది. బహమన్‌ల ఆధిపత్యం 1489 నాటికి ఆగిపోయిందనిచెప్పవచ్చు. ఆ సమయంలో ఐదు షాహీ రాజవంశాలుపుట్టాయి.వాటిలోఒకటి "బీజాపూర్". మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1686లో బీజాపూర్‌నుస్వాధీనం చేసుకున్నాడు.ఇది సా.శ. 1723 వరకు మొఘల్ పాలనలో ఉంది.సా.శ. 1724లో హైదరాబాదు సంస్థానానికి చెందిన నిజాం దక్కన్‌లో తనస్వాతంత్య్రాన్ని స్థాపించి, బీజాపూర్‌ని తన ఆధీనంలోకి చేర్చుకున్నాడు.ఏదిఏమైనప్పటికీ, ఈ భాగంపై అతని స్వాధీనం స్వల్ప కాల వ్యవధిలో ఉంది, సా.శ.1760లో అది మరాఠాల చేతుల్లోకి వెళ్లింది.
సా.శ.1518లో బహమనీ సుల్తానేట్ డెక్కన్ సుల్తానేట్స్ అని పిలువబడే ఐదు చీలికరాష్ట్రాలుగావిడిపోయింది.వాటిలోఒకటి ఆదిల్ షాహీ రాజవంశం(1490-1686) రాజులచే పాలించినబీజాపూర్.బీజాపూర్ నగరం బీజాపూర్ స్వతంత్ర రాష్ట్ర స్థాపకుడుయూసుఫ్ ఆదిల్ షాకు దాని గొప్పతనానికి చాలా రుణపడి ఉంది.
బ్రిటిష్ వలస కాలం
మార్చునగరం మూడు విభిన్న భాగాలను కలిగి ఉంది.కోట, నగరం, అవశేషాలు. ఆదిల్షాహి సుల్తానులచే నిర్మించబడిన కోట నగరానికి ఒకమైలుదూరంలో ఉంది.ఇది చాలా పురాతన అయినప్పటికి,చాలాబలంకలిగిఉంది, అత్యంత భారీ పదార్థాలతో బాగా నిర్మించబడింది.కోట చుట్టూ 100 గజాల (91 మీటర్లు) కందకంతో ఆవరించిఉంది. గతంలో అది నీటితో నింపి ఉండేది. సా.శ.1566లో ఆదిల్షాహి సుల్తానులు పూర్తి చేసిన ఈ కోట చుట్టూ 6 మీ. చుట్టుకొలతలో, గోడ 30 నుండి 50 అడుగుల (15 మీటర్లు) ఎత్తువరకు ఉంటుందిగోడలవెలుపల ఒక విస్తారమైన నగరం అవశేషాలు ఉన్నాయి.ఇప్పుడు చాలావరకు శిథిలావస్థలో ఉన్నాయి.అసంఖ్యాకమైన సమాధులు, మసీదులు,కాలవినాశనాన్ని నిరోధించాయి.ఈప్రదేశం పురాతన వైభవానికి సమృద్ధిగాసాక్ష్యాలను అందిస్తాయి.బీజాపూర్ సమీపంలోని బాదామి, ఐహోల్, పట్టడకల్ చాళుక్యుల నిర్మాణ శైలిలో చారిత్రక ఆలయాలకు ప్రసిద్ధి చెందాయి.
బీజాపూర్ దాదాపు రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి దాదాపు 530 కి.మీ (330 మైళ్లు) దూరంలో ఉంది.భౌగాళికంగా ఉత్తర అక్షాంశం 15.20, 17.28 , తూర్పు రేఖాంశం 74.59, 76.28 వద్ద ఉంది. ఇది దక్కన్ ద్వీపకల్పం లోపలి భాగంలో బాగా నెలకొని పశ్చిమ తీరానికి 130 మైళ్ల దూరంలో ఉంది.
జిల్లాకు ఉత్తరాన షోలాపూర్ జిల్లా, వాయువ్య సరిహద్దులో సాంగ్లీ జిల్లా, పశ్చిమాన బెల్గాం జిల్లా,దక్షిణాన బాగల్‌కోట్ జిల్లా,తూర్పున గుల్బర్గా జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో కొప్పల్ జిల్లా ఉన్నాయి.
నగరం గురించి
మార్చు- ఈ ప్రదేశం దేశంలోనే ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం, ఇది ఆదిల్షాహి రాజవంశం పూర్వ రాజధాని. బెంగుళూరుకు వాయువ్యంగా సుమారు 579 కి.మీ (360 మైళ్లు) దూరంలో ఉంది. గదగ్-సోలాపూర్ రైలు మార్గం ఈ ప్రదేశం మీదుగా ప్రయాణిస్తుంది.సా.శ. 1073 నాటి శాసనం ప్రకారం కళ్యాణి చాళుక్య రాజులు దీనిని ఉప రాజధానిగా చేశారు.సా.శ. 12వ శతాబ్దానికి చెందిన జైన కవి నాగచంద్ర ఇక్కడ నివాసించారని నమ్ముతారు. ఈ ప్రాంతానికి విజయపుర, విద్యాపుర మొహముద్‌పురా వంటి పాత పేర్లు ఉన్నాయి.సా.శ. 1489 నుండి సా.శ.1686 వరకు దాదాపు 200 సంవత్సరాలు, ఇది ఆదిల్షాహీ రాజవంశం పరిపాలించారు.
- బీజాపూర్‌లోని ఇతర చారిత్రక ఆకర్షణలలో కొన్ని ముఖ్యమైనవి ఆనంద్ మహల్, జోడ్ గుంబజ్, జుమ్మా మసీదు, దక్షిణ మంజిల్, జల్ మంజిల్. బీజాపూర్‌లోని పాత ఇళ్లలో, అత్యంత ప్రసిద్ధమైంది. ఎలావియా భవనం (నౌజర్ ఎలావియా) ఇది 100 సంవత్సరాల కంటే పాతది.
- బీజాపూర్ నగరం, ఔరంగజేబు, నిజాం, సవనూర్ నవాబు, సతారా చత్రపతి, చివరకు బ్రిటిష్ వారిచే ఆధీనంలో ఉంది. డువార్టే బార్బోసా, వర్తేమా, పోజర్, మాండెస్లో, ట్రావెర్నియర్ వంటి విదేశీ యాత్రికులు ఈ స్థలాన్ని సందర్శించారు.
- ఇబ్రహీం రౌజా, గోల్ గుంబజ్‌లు బీజాపూర్‌లోని అత్యంత ఆకర్షణీయమైన స్మారక చిహ్నాలు
- ఐన్-ఉల్-ముల్క్ సమాధి, మసీదు నగరం తూర్పు శివార్లలో ఉంది చతురస్రాకారంలో దృఢమైన నిర్మాణం, దాని చుట్టూ సరసమైన దామాషా గోపురం ఉంది.సమాధి ఐన్-ఉల్-ముల్క్‌కు చెందింది. దీనికి దగ్గరగా చాలా అలంకరించబడిన మెరుగులు దిద్దిన మసీదు, భవనం ఉన్నాయి.
- అలీ ఆదిల్ షా I సమాధి నగరం, నైరుతి భాగంలో ఉంది. అలీ ఆదిల్షా సమాధి ఒక సాధారణ నిరాడంబరమైన భవనం, ఇది సెంట్రల్ చాంబర్ చుట్టూ ఐదు తోరణాల బయటి వరుసను కలిగి ఉంది. ఇది బీజాపూర్‌లోని తొలి రాజ సమాధి.
- అలీ ఆదిల్ షా II సమాధి సిటాడెల్ కు వాయువ్యంగా ఉంది. ముదురు బసాల్ట్‌లో అసంపూర్తిగా ఉన్న తోరణాలతో కూడిన పెద్ద చతురస్రాకార పైకప్పు లేని నిర్మాణంలో ఉంది. ఈ అసంపూర్ణ నిర్మాణం 215 కి.మీ (66 మైళ్లు) చతురస్రం, పెరిగిన ప్లాట్‌ఫారమ్‌పై అసంపూర్ణమైన తోరణాలు ఉన్నాయి.ఎత్తైన వేదికపై మధ్యలో సమాధులు ఉన్నాయి.
- అలీ షాహీ పీర్ మసీదు, సమాధి ఒక చతురస్రాకార భారీ నిర్మాణం, దాని మిహ్రాబ్ కొన్ని మార్గాల్లో విశేషమైంది. సాధువు సమాధి మసీదు ఈశాన్య ద్వారం వెలుపల ఉంది.
- ఖ్వాజా అమీన్ దర్గా నగరంలో అత్యంత పవిత్రమైందిగా పరిగణించబడుతుంది. ఇది దాదాపు 1.5 కి.మీ (0.93 మైళ్లు) దూరంలో ఉంది. బీజాపూర్‌కు పశ్చిమాన. ఖ్వాజా అమీన్-ఉద్-దిన్ సమాధి ఎత్తైన ప్రదేశంలో ఉంది.
- ఆనంద్ మహల్ గగన్ మహల్‌కు పశ్చిమాన ఉంది. కోట ప్రాంగణంలో ఈ రెండు అంతస్తుల భవనం ఉంది. ఇది సంగీతం, నృత్యం కోసం ప్రత్యేకంగా 1589లో ఇబ్రహీం ఆదిల్ షా II చే నిర్మించబడింది. పైకప్పును గారతో అలంకరించారు. ఆనంద మహల్‌ను ప్రస్తుతం రాష్ట్రం ప్రభుత్వ కార్యాలయాల కోసం వినియోగిస్తోంది.
- అండు మసీదు జుమానల్ రహదారికి పశ్చిమాన కోట నుండి కొంచెం దూరంలో ఉంది. ఇది రెండు అంతస్తుల నిర్మాణం, పై అంతస్తు ప్రార్థనా మందిరం కాగా, మైదానం హాలు. మసీదులో పల్పిట్ లేదు. బహుశా ఇది మహిళల ప్రార్థనకు పరిమితం చేయబడింది. 1608లో ఆదిల్ షాయ్ II ఆస్థానంలో ఉన్న ప్రభువులలో ఒకరైన ఇత్బర్ ఖాన్ ఈ మసీదును నిర్మించినట్లు ఇక్కడ ఒక పర్షియన్ శాసనం ఉటంకించింది.
- అరస్ మహల్ అదాలత్ మహల్‌కు ఆగ్నేయంగా ఉంది. ఇది ఒకప్పుడు అలీ II, అతిధి గృహం.అది ఇప్పుడు జిల్లా సర్జన్ నివాసంగా ఉపయోగింపబడుతుంది.
- ఆర్క్-కిల్లా సిటాడెల్ నగరం మధ్యలో ఉంది. ఇది బీజాపూర్‌లో అత్యంత ముఖ్యమైన భాగం. యూసుఫ్ ఆదిల్షా దీనిని తన కోటకు స్థలంగా ఎంచుకున్నాడు. ప్రస్తుత కోట దాదాపు వృత్తాకారంలో ఉంది. దీని రక్షణ దక్షిణ, తూర్పున గణనీయమైన బలం కలిగిన అనేక బురుజులతో బలమైన గోడలతో ఉంటుంది..
- కోట తూర్పు హిమానీనదం శిఖరంపై అసర్ మహల్ అసర్ మహల్. సుమారు 1646లో దీనిని మహమ్మద్ షా నిర్మించాడు. దీనిని అంతకుముందు అదాలత్ మహల్ అని పిలిచేవారు. గదుల గోడలు, పైకప్పులు ప్రకృతి దృశ్యాలు, వివిధ డిజైన్ల చిత్రాలను కలిగి ఉంటాయి. పూతపూసిన హాలుకు దక్షిణం వైపున ఉన్న గది చాలా అందంగా పెయింట్ చేయబడిన అపార్ట్మెంట్. ఈ పెయింటింగ్స్‌ను ఔరంగజేబు ఆదేశాలతో వైట్‌వాష్ చేసి, తర్వాత పునరుద్ధరించారు. భవనం ముందు బయట పెద్ద చదరపు సరస్శు ఉంది.
- ఔరంగజేబ్ ఈద్గా అనేది 1682లో ఔరంగజేబుచే నిర్మించబడిన ఒక పెద్ద చతురస్రాకార ఆవరణ, ఇది ముఖ్యమైన రోజులలో ముస్లింల కోసం ఒక సమావేశ స్థలంగా నగరం ఆక్రమించబడిన తర్వాత.
- బుఖారీ మసీదును బుఖారీ కుటుంబానికి చెందిన మౌల్వీ కోసం చాంద్‌బీబీ నిర్మించాడని నమ్ముతారు. మసీదు తలుపు మీద పర్షియన్ శాసనం ఉంది.
- 1579లో అలీ ఆదిల్ షా I తన భార్య చాంద్ బీబీ గౌరవార్థం చాంద్ బవాడి బావిని నిర్మించాడు. ఇది పట్టణానికి పశ్చిమ మూలలో ఉంది. ప్రవేశ ద్వారం ఒకే వంపుతో విస్తరించి ఉంది.
- చోటా అసర్ ఒక చిన్న భవనం, గోడ, పైకప్పు, ముఖభాగంలో కొంత భాగాన్ని కప్పి ఉంచే గారలో ఉన్న గొప్ప అలంకారానికి విశేషమైంది.
- చినీ మహల్ లేదా ఫరూఖ్ మహల్ మధ్యలో పెద్ద ఎత్తైన దర్బార్ హాల్, రెక్కల వరుస గదులతో కూడిన భవనం. యూసుఫ్ ఆదిల్ షా దీనిని నిర్మించాడు. బీజాపూర్‌లోని మరే ఇతర ప్యాలెస్‌లోని హాల్‌ని దాని పరిపూర్ణ పరిమాణం, గంభీరతతో పోల్చలేం.
జనాభా గణాంకాలు
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం బీజాపూర్ నగరంలో 326,360 జనాభా ఉంది. నగర జనాభా మొత్తంలో పురుషులు 51% మంది ఉండగా, స్త్రీలు 49% ఉన్నారు. బీజాపూర్ సమర్థవంతమైన అక్షరాస్యత రేటు 83.43% తో ఉంది. స్త్రీల అక్షరాస్యత 77.86% ఉంది.జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారు ఉన్నారు.కన్నడ ఇక్కడ మాట్లాడే ప్రధాన భాషగా మాట్లాడతారు. [1]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, నగర జనాభా మొత్తంలో 51.43% మంది కన్నడ, 34.35% మంది ఉర్దూ, 5.38% మంది మరాఠీ, 3.85% మంది లంబాడీ, 2.01% మంది హిందీ, 1.17% మంది తెలుగు వారి మొదటి భాషగా మాట్లాడతారు. [6]
బీజాపూర్ సూఫీలు
మార్చుబీజాపూర్ ప్రాంతంలో సూఫీల రాక కుతుబుద్దీన్ ఐబక్ హయాంలో ప్రారంభమైంది.ఈ కాలంలో దక్కన్ స్థానిక హిందూ పాలకులు, పాలెగార్ల నియంత్రణలో ఉంది.షేక్ హాజీ రూమీ తన సహచరులతో కలిసి బీజాపూర్‌కు మొదట వచ్చారు.అతని ఇతర సహచరులు షేక్ సలాహుద్దీన్, షేక్ సైఫుల్ ముల్క్ , సయ్యద్ హాజీ మక్కీ వరుసగా పూణే, హైద్రా, టికోటాలలో స్థిరపడ్డారు.
ఇది కూడ చూడు
మార్చు- బీజాపూర్ పాలకుల జాబితా
- భాస్కర II
- లక్కుండి
- అరకేరి, బీజాపూర్
- సబల సంస్థ
- బీజాపూర్ నుండి వ్యక్తుల జాబితా
- బీజాపూర్‌లో చిత్రీకరించిన చిత్రాల జాబితా
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Cities having population 1 lakh and above, Census 2011" (PDF). census.gov.in. Retrieved 7 March 2021.
- ↑ "Renaming of cities" (Press release). 16 December 2014. Retrieved 5 August 2017.
- ↑ "Tumkur, Shimoga and Bijapur cities to be upgraded as Municipal Corporations". The Hindu. 2 September 2013. Retrieved 1 April 2021.
- ↑ Shenoy, Jaideep (28 September 2013). "Karnataka could see more city corporations based on 2011 census, says minister". The Times of India. Retrieved 21 October 2018.
- ↑ "viewsearly". www.columbia.edu.
- ↑ "Table C-16 Population by Mother Tongue (Town): Karnataka". www.censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.