బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే
బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే, బెంగళూరు, చెన్నై నగరాల మధ్యనిర్మాణంలో ఉన్న 258 కి.మీ. (160 మై.) పొడవున్న, 4- వరుసల[1] యాక్సెస్-నియంత్రిత ఎక్స్‌ప్రెస్‌వే. కేంద్ర ప్రభుత్వం దీన్ని నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే 7 (NE-7) గా గుర్తించింది. ఇది బెంగళూరు మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీలోని హోస్కోట్ నుండి చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాలోని శ్రీపెరంబుదూర్ వరకు నడుస్తుంది. 120 కిమీ./గం వేగంతో వాహనాలు వెళ్ళేలా ఈ రహదారిని నిర్మిస్తారు.[2] 2021 జనవరి 1 న ఈ రహదారిని జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేగా ప్రకటించారు.[3] మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం ₹ 17,930 కోట్లు.[4] ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం 2025 చివరికల్లా పూర్తవుతుందని భావిస్తున్నట్లు జాతీయ రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పాడు.[5][6][7]
బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే (జాతీయ ఎక్స్‌ప్రెస్‌వే 7) | |
---|---|
మార్గ సమాచారం | |
నిర్వహిస్తున్న సంస్థ భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) | |
పొడవు | 258 కి.మీ. (160 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
పశ్చిమ చివర | హోస్కోటె,కర్ణాటక |
తూర్పు చివర | శ్రీపెరుంబుదూరు, కాచీపురం జిల్లా, తమిళనాడు |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | |
Districts | |
Towns | |
రహదారి వ్యవస్థ | |
వేలూరు జిల్లాలోని మేల్పాడి, రాణిపేట్ జిల్లాల్లోని పొనపంతంగల్ ల వద్ద ఇంటర్‌ఛేంజ్‌లు ఏర్పాటౌతాయి. స్థిరాస్తి వ్యాపారాల కోసం ఇవి ప్రధాన కూడలి కేంద్రాలుగా ఉంటాయి.[8]
కొత్త ప్రాజెక్టు
మార్చుటాటా మోటార్స్ రాణిపేటలో ₹ 9,000 కోట్ల కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఖరారు చేసింది. ఇది రాణిపేట జిల్లాలోని నెమిలి తాలూకాలో చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే వెంట పొనపంతంగల్ - పనపాక్కం రహదారికి సమీపంలో ఉంది. ఇక్కడి రియల్ ఎస్టేట్ ధరలు 25 రెట్లు పెరిగాయి.
నిర్మాణం
మార్చు258 కి.మీ. పొడవున ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులను NHAI మొత్తం 10 ప్యాకేజీలతో 3 దశలుగా విభజించింది. 6 నిర్మాణ సంస్థలు ఏకకాలంలో నిర్మాణం చేస్తారు.
సర్. నం | ప్యాకేజీ | కిమీలో పొడవు | కాంట్రాక్టర్ |
---|---|---|---|
1. | హోస్కోటే - మలూరు | 18 | దిలీప్ బిల్డ్‌కాన్ [9] |
2. | మాలూరు - బంగారపేట | 27.1 | దిలీప్ బిల్డ్‌కాన్ [9] |
3. | బంగారుపేట - బేతమంగళ | 17.5 | KCC బిల్డ్‌కాన్ |
ఫేజ్-2
మార్చుసర్. నం | ప్యాకేజీ | కిమీలో పొడవు | కాంట్రాక్టర్ |
---|---|---|---|
1. | బేతమంగళ - బైరెడ్డిపల్లె | 25.0 | మోంటెకార్లో కన్‌స్ట్రక్షన్ |
2. | బైరెడ్డిపల్లె - బంగారుపాలెం | 31.0 | ఆప్కో ఇన్‌ఫ్రాటెక్ [10] |
3. | బంగారుపాలెం - గుడిపాల | 29.0 | దిలీప్ బిల్డ్‌కాన్ |
ఫేజ్-3
మార్చుసర్. నం | ప్యాకేజీ | కిమీలో పొడవు | కాంట్రాక్టర్ |
---|---|---|---|
1. | గుడిపాల - వాలాజాపేట | 24.0 | మోంటెకార్లో కన్‌స్ట్రక్షన్ |
2. | వాలాజపేట్టై - అరక్కోణం | 24.5 | KCC బిల్డ్‌కాన్ |
3. | అరక్కోణం - కాంచీపురం | 25.5 | DP జైన్ & కో. |
4. | కాంచీపురం - శ్రీపెరంబుదూర్ | 32.1 | రామలింగం కన్‌స్ట్రక్షన్ కంపెనీ |
ఇది కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Sharma, Anurakti (6 January 2023). "Bengaluru-Chennai Expressway to be completed by March 2024". Times Now (in ఇంగ్లీష్). Retrieved 10 January 2023.
- ↑ "Project report on Chennai Expressway may get ready by March". The Hindu. 21 October 2011. Archived from the original on 2 May 2012. Retrieved 16 August 2012.
- ↑ Gazette notification dated 1 January 2021
- ↑ Akram Mohammed (December 18, 2018). "Expressway to reduce travel time between Bengaluru, Chennai". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved March 23, 2023.
- ↑ Vivan, Sridhar (7 December 2023). "Bengaluru-Chennai Expressway to be ready only by July 2025". Bangalore Mirror. Retrieved 26 January 2024.
- ↑ "Bangalore–Chennai Expressway – Information & Status". Metro Rail Guy. Retrieved 26 January 2024.
- ↑ "Bengaluru-Chennai Expressway to be operational in January 2024: Nitin Gadkari". The Hindu. Retrieved 26 January 2024.
- ↑ "Real Estate in Bangalore & Chennai to get elevated with the upcoming Bangalore-Chennai Expressway!". www.sulekha.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-05-05.
- ↑ 9.0 9.1 "Dilip Buildcon declared L1 bidder for projects worth Rs 2,439 crores". Business Standard. 24 February 2021.
- ↑ "Apco will build NHAI's Bangalore-Chennai Expressway segment". Construction World. 18 March 2021.