కోలారు జిల్లా

(కోలార్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)

కోలారు జిల్లా: (Kolar district) (کولار ضلع ) (కన్నడ: ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ audio speaker iconpronunciation ) : కర్నాటక రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇది కర్నాటక రాష్ట్రానికి ఆగ్నేయ దిశన ఉంది. ఈ జిల్లాకు సరిహద్దులు, పశ్చిమాన బెంగళూరు జిల్లా, ఉత్తరాన చిక్కబల్లాపూర్ జిల్లా, తూర్పున ఆంధ్రప్రదేశ్కు చెందిన చిత్తూరు జిల్లా, దక్షిణాన తమిళనాడుకు చెందిన క్రిష్ణగిరి జిల్లా, వేలూరు జిల్లాలు ఉన్నాయి.

Kolar district

ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ
district
Someshwara temple
Someshwara temple
Located in the southeast part of the state
CountryIndia
రాష్ట్రంకర్ణాటక
DivisionBangalore
ప్రధాన కార్యాలయంKolar
విస్తీర్ణం
 • మొత్తం4,012 km2 (1,549 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం1,540,231
 • సాంద్రత384/km2 (990/sq mi)
భాషలు
 • అధికారకన్నడం
కాలమానంUTC+5:30 (IST)
ISO 3166 కోడ్IN-KA-KL
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుKA-07, KA-08
లింగ నిష్పత్తి0.976 /
అక్షరాస్యత74.33%
లోక్ సభ నియోజకవర్గంKolar Lok Sabha constituency
Precipitation724 మిల్లీమీటర్లు (28.5 అం.)
జాలస్థలిkolar.nic.in
Kolar district at a glance

సెప్టంబరు 10, 2007 న, కోలారు జిల్లాను విభజించి చిక్కబళ్ళాపూరు జిల్లా ఏర్పాటు చేశారు.[1] ఈ జిల్లాలో కోలారు బంగారు గనులు ఉన్నందున, దీనిని "గోల్డెన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా"గా అభివర్ణిస్తారు.

చరిత్రసవరించు

 
Kolarmma Temple, Kolar (file)
 
Someshvara temple, a frontal profile shows ornate pillared mantapa (Vijayanagara architecture)
 
Someshvara temple, the maha mantapa (main hall) to sanctum
 
The Ramalingeshvara group of temples at Avani, a 10th-century Nolamba dynasty construction
 
Someshvara temple at Kurudumale
 
Rear view of Someshvara temple at Kurudumale

పూర్వం కోలార్ పట్టణాన్ని కోలాహల, కువలాల, కోలాల అని పిలువబడింది. కోలార్ మధ్యయుగంలో కొల్హాపురి అని పిలువబడింది. తరువాత కోలార్ అయింది. కొల్హాపుర అంటే కన్నడంలో " హింసాత్మక నగరం " అని అర్ధం. ఉత్తరంలోని చాళుఖ్యులకు దక్షిణంలోని చోళులకు ఇది యుద్ధభూమిగా ఉండేది. సా.శ. 4వ శతాబ్దం వరకు ఇది గంగా చక్రవర్తులకు ఇది రాజధానిగా ఉండేది. సా.శ. 1004 లో రాజధాని మైసూరులోని తలకాడుకు మారింది. అయినప్పటికీ సా.శ. 1116 వరకు చోళులు దీనిని అంటిపెట్టుకుని ఉన్నారు. విష్ణువర్ధన (సా.శ.1108-1142) లో గంగావాడి చోళుల నుండి విడివడిన తరువాత విజయాన్ని గుర్తుచేసుకుంటూ బేలూరులో విజయనారాయణా ఆలయం (చెన్నకేశవ ఆలయం) నిర్మించబడింది.

చోళకాలంనాటి ఆలయాలుసవరించు

పట్టణంలోని ఆలయాలలో కొలరమ్మ ఆలయం, సోమేశ్వరాలయం ప్రధానమైనవి. శక్తి ప్రధానదైవంగా ఉన్న ఈ ఆలయం 2వ శతాబ్దంలో గంగాచక్రవర్తులు చోళసంప్రదాయం అనుసరించి విమానగోపురంతో నిర్మించారు. 10వ శతాబ్దంలో ఈ ఆలయం మొదటి రాజేంద్రచోళుని కాలంలో, 15వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తులు పునరుద్ధరించబడింది.[2][3] సోమేశ్వరాలయం 14వ శతాబ్ధపు విజయనగర సామ్రాజ్య నిర్మాణవైభవానికి చిహ్నంగా ఉంది.

కోలార్ పురాతన చరిత్రసవరించు

కోలార్ ఆరంభకాల చరిత్రను వాస్లేయన్ తమిళ మిషన్ పర్యవేక్షకుడు " రేవ్ ఫ్రెడ్ గుడ్ విల్ " గ్రంధస్థం చేసాడు. ఆయన కోలార్ బంగారుగనులు, బెంగుళూరు చరిత్రను గ్రంధస్థం చేసాడు. ఆయన అధ్యయనం, పరిశోధనలు " డాలీ మెమోరియల్ హాల్మిథిక్ సొసైటీ త్రైమాసిక జర్నల్స్, ఇతర అకాడమిక్ జర్నల్స్‌లో ప్రచురించబడ్డాయి.[4][5][6]

కోలార్ ప్రస్థావనసవరించు

కోలార్ బెంగుళూరు కంటే పురాతనమైనది. ఇది సా.శ. 2వ శతాబ్దం నుండి ఉనికిలో ఉంది. పశ్చిమ గంగా సామ్రాజ్యం (గంగాలు) కన్నడిగులు. వారు కోలారును రాజధానిని చేసుకుని మైసూరు, సేలం (తమిళనాడు), కోయంబత్తూరు (తమిళనాడు),త్రివేండ్రం లను పాలించారు. క్ర.శ 13వ శతాబ్దంలో భవనంది తన తమిళ గ్రంథం నన్నూలులో కోలార్ గురించి ప్రస్తావించాడు. ఆయన నన్నూలును కోలార్ లోని ఉలగమంది గుహలలో ఉండి వ్రాసాడు. అయాన గంగా పాలకుడు సీయా గంగన్ (కోలర్‌లో జన్మించాడు) ఆస్థానంలో సాహిత్య, కళాసేవలో ఉండేవాడు. అదనంగా సీయా గంగన్ శిలాశాసనాలు కోలార్ మీద తిరిగి చోళులు పట్టు సాధించిన వివరణలు లభించాయి.

ఉత్తమ చోళుడుసవరించు

చోళుల పాలనాకాలంలో రాజా ఉత్తమ చోళుడు (సా.శ. 970) రేణుకాదేవి ఆలయం నిర్మించాడు. తరువాత రేణుకా దేవి అలతారం కోలహలమ్మ కోలాహలమ్మ పేరుతో ఇక్కడ కొల్హాపురం నిర్మిచాడు. కోలహలమ్మ దేవత పూరుతో ఈ నగరం నిర్మించబడిందని ప్రాంతీయ కథనాలు వివరిస్తున్నాయి. చోళపాలకులు వీరరాజేంద్ర చోళుడు (వీరచోళుడు), విక్రమచోళుడు, రాజేంద్రచోళుడు (రాజరాజనరేంద్రచోళుడు) స్థాపించిన శిల్పాలలో మొదటి అవని కోలార్, ముల్బగల్, సిట్టి బెట్టా, ఇతర ప్రాంతాల కొన్ని శిలాక్షరరూప వివరాలు లభిస్తున్నాయి. ఈ శిలాక్షరాలు కోలార్‌ను " నికరిలి చోళమండలం, జయం కొండ చోళమండలం అని ప్రస్తావిస్తున్నాయి. మొదటి రాజేంద్రచోళుడు కూడా కొలరమ్మ ఆలయం సందర్శించాడు. చోళుల కాలంలో మారికుప్పం గ్రామంలో ఉన్న సోమేశ్వరాలయం, శ్రీ ఉద్దండేశ్వరాలయం, ఉరుగంపేట్‌లో ఈశ్వరాలయం, మదివాల గ్రామంలో శివాలయం మొదలైన పలు శివాలయాలు కూడా నిర్మించబడ్డాయి. కోలార్‌లో సా.శ. 1116 వరకు చోళులపాలన కొనసాగింది. దురదృష్టకరంగా కోలార్ లోని చోళుల శిలాశాసనాలు నిర్లక్ష్యానికి గురైయాయి. కొన్ని సాంస్కృతిక దౌర్జన్యానికి గురయ్యాయి.

హొయశిలసవరించు

సా.శ. 1117 లో కోలార్ ప్రాంతాన్ని కన్నడ హొయశిల పాలకులు స్వాధీనం చేసుకున్నారు. 1254లో సామ్రాజ్యం మాహారాజా కుమారులైన వీరసోమేశ్వర, రామనాథాలకు పంచినప్పుడు. కోలార్, ఇతర తమిళ ప్రాంతాలు రామనాథ పాలనలోకి మారాయి. విజయమగర కన్నడిగులు హొయశిల పాలకులను ఓడించారు. కోలార్ ప్రాంతాన్ని విజయనగర పాలనలో 1336-1664 వరకు కొనసాగింది. వారి పాలనలో కోలార్‌లో సోమేశ్వరాలయం నిర్మించబడింది.

మరాఠీ పాలనసవరించు

17వ శతాబ్దంలో కోలార్ ప్రాంతాన్ని మరాఠీ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. మరాఠీలు ఈ ప్రాంతాన్ని వారి జాగీరుగా చేసుకుని 50 సంవత్సరాల కాలం పాలించారు. తరువాత ఈ ప్రాంతం మీద ముస్లిములు 70 సంవత్సరాల కాలం ఆధిక్యత సాధించారు. 1720లో కోలార్ సిరా సుభాహ్‌లో భాగం అయింది. హైదర్ అలి తండ్రి ఫతేహ్ ముహమ్మద్ ఫౌజీదార్‌గా నియమించబడ్డాడు. తరువాత కోలార్ మారాఠా సామ్రాజ్యం, కడప నవాబు, హైదరాబాదు నిజాం, హైదర్ అలి పాలనలో భాగం అయింది. 1778లో లార్డ్ చార్లెస్ క్రాన్‌విల్స్ కోలార్‌ను ఆక్రమించాడు. తరువాత 1792లో జరిగిన ఒప్పందం తరువాత మైసూర్ రాజాస్థానంలో చేర్చబడింది. అప్పటి నుండి కోలార్ మైసూర్ రాజాస్థానంలో భాగంగా ఉంది.

శిలాశాసనాలుసవరించు

కోలార్ ప్రాంతం చుట్టూ మహావాలిలు (బాణాలు), పల్లవులు, వైదుంబాలు మొదలైన వైవిధ్యమైన కాలాలకు సంబంధించిన రాజుల శిలాశాసనాలు అనేకం లభిస్తున్నాయి. [4][5][6][7]

భౌగోళికంసవరించు

జిల్లా కర్ణాటక లోని " సెమీ అరిడ్ డౌట్ రీజియన్"లో ఉంది. 77° 21' నుండ్జి 78° 35'డిగ్రీల తూర్పు రేఖాంశం, 20° 46' నుండి 130° 58 డిగ్రీల ఉత్తర రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం 8,225 చ.కి.మీ. కోలార్ జిల్లా రాష్ట్రానికి దక్షిణ భూభాగంలో ఉంది.

జిల్లా ఉత్తర దక్షిణాలుగా 135 కి.మీ పొడవు ఉంది. తూర్పు పడమతల మద్య కూడా అంతేదూరం ఉండడం ప్రత్యేకత. ఇది మైసూర్ పీఠభూమిలో ఉంది. పీఠభూమి పర్వతాలు, కొండల చేత విభజించబడి ఉంది. వీటిలో నంది దుర్గ్ పర్వతావళి ప్రధానమైనది. నంది దుర్గ్ పర్వతావళి నంది నుండి పెనుగొండ, ధర్మవరం వైపు సాగుతూ ఉంది.

  • జిల్లాలో వర్షాధారితమైన పాలార్, ఉత్తర, పినాకిని, దక్షిణ పినాకిని మొదలైన చిన్న నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి సమీపంలోని పర్వతాలలో జన్మించి ప్రవహిస్తున్నాయి.

సరిహద్దులుసవరించు

సరిహద్దు వివరణ జిల్లా
పశ్చిమ సరిహద్దు బెంగుళూరు గ్రామీణ
ఉత్తర సరిహద్దు చిక్కబళ్ళాపూర్
తూర్పు సరిహద్దు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
దక్షిణ సరిహద్దు క్రిష్ణగిరి జిల్లా తమిళనాడు

తాలూకాలుసవరించు

Kolar District Map

కోలార్సవరించు

కోలార్ జిల్లాలో " అంతతంగంగె కోలార నగర సారిగె "ను ఉప ముఖ్యమంత్రి మైరియు హోం మంత్రి అశోక్ చేత 2002 జూలైలో ప్రారంభించబడింది.

నరసాపురా ఇండస్ట్రియల్ ప్రాంతం ఇంఫ్రాస్ట్రక్చర్, హోండా, మహీంద్రా ఎయిరోస్పేస్, వొల్వొ, ఇతర మోటర్ వాహన తయారీ సంస్థలకు ప్రసిద్ధి చెంది ఉంది. నరసాపురా ఇండస్ట్రియల్ ప్రాంతం కోలార్ నుండి 20 కి.మీ దూరంలో ఉంది. జాతీయరహదారి 4 ద్వారా బెంగుళూరుతో అనుసంధానించబడి ఉంది.

కోలార్ జిల్లాలో టెలిఫోన్ ఆపరేటర్లకు అద్భుతమైన అవకాశంఉంది. అలాగే టెలిఫోన్ ఆపరేటర్లకు గ్రామీణ, అటవీ ప్రాంతాలలో అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

విద్యాసంస్థలుసవరించు

  • డిఆర్.టి.టి ఐ.టి (గతంలో జి.వి.ఐ.టి. అనే వారు) కోలార్ నుండి 28 కి.మీ.
  • సి.బి.ఐ.టి సి. బైరగౌడ ఎజ్యుకేషన్, కల్చరల్ ట్రస్ట్, తొరదేవందహళ్ళి గ్రామం : కోలార్ నుండి 7 కి.మీ దూరంలో ఉంది. శ్రీనివాసపురా మెయిన్ రోడ్డుతో అనుసంధానితమై ఉంది.
  • ఎస్.డి.యు.ఎం.సి. జలప్ప హాస్పిటల్ సమీపంలో.కోలార్ నుండి 5కి.మీ దూరంలో.
  • ప్రపంచంలో అతి పెద్ద కేర్ హాస్పిటల్ " వాసన్ ఐ కేర్ హాస్పిటల్ " (కోలార్ ఎం.జి. రోడ్డు వద్ద ఉంది)

హార్టికల్చర్ సిసైటీలుసవరించు

  • ది కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ 2009లో స్థాపించబడింది. కోలార్ నుండి 5 కి.మీ దూరంలో ఇది జలప్ప మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ పక్కన ఉంది.

బంగారుపేటసవరించు

  • కోలార్ జిల్లాలోని బంగారుపేట తాలూకా పానీపూరి వంటి చాట్ ఆహారాలకు ప్రసిద్ధి.
  • బెంగుళూరు నగర రైల్వే జంక్షన్ తరువాత రైల్వే జంక్షన్ బంగారుపేటలో ఉంది.
  • ఆరంభంలో బంగారుపేట " బౌరింగ్‌పేట " అని పిలువబడేది. ఇది వ్యాపార ముఖ్యత్వం ఉన్న నగరం. ఈ తాలూకాలో హైదర్ అలి జన్మస్థలం బుదికోటే గ్రామం ఉంది.

ముళబాగిలుసవరించు

ముళబాగిలు తాలూకా జిల్లాలోని వెనుకబడిన తాలూకాలలో ఒకటి. తాలూకలో వ్యవసాయానికి అవసరమైన నీటిపారుదల వసతులు లేనప్పటికీ ప్రజలు అధికంగా వ్యవసయం మీద ఆధారపడి జీవిస్తున్నారు.

  • అనుకూల పరిస్థితులు
  • ఇక్కడ ఉన్న గ్రానైట్ పరిశ్రమకు అనుకూలమైన పెద్ద రాళ్ళు ఉన్నాయి.
  • కూరగాయల మార్కెటుకు ప్రసిద్ధి చెందింది.
  • ముళబాగిలు తాలూకాలోని వడ్డహళ్ళి టొమేటో మొదలైన మార్కెట్ కూరగాయల మార్కెటుకు ప్రసిద్ధి చెందింది.
  • ప్రధానంగా పాలౌత్పత్తులు, పట్టు ఉత్పత్తి, సెరికల్చర్, హార్టి కల్చర్, మామిడి, చింతపండు ఉత్పత్తి చేయబడుతుంది.
  • నంగలి వద్ద ఇసుక తవ్వకాలు.
  • 4 వరుసల జాతీయ రహదారి 4 (బేంగుళూరు - ముంబయి) ఉంది.
  • ముళబాగిలు తాలూకాలో కురుడుమలె, ముళబాగిలు ఆంజనేయ, ఆవని, పాదరాజ మఠం, దుర్గ, సోమేశ్వరాలయం, లేపాక్షి ఆలయం మొదలైన ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి.
  • ఆవని, బైరకూరు పర్వతారోహణకు ఇది అనుకూలంగా ఉన్నాయి. (చీకూరు హిల్స్)

అననుకూలపరిస్థితులుసవరించు

  • అకాలం, అరుదైన వర్షాలు.
  • జిల్లాలో సహజ నదులు కాని కృత్రిమ నదీ కాలువల వంటి నీటిపారుదల వసతులు కానీ లేవు.
  • కోలార్ భౌగోళిక పరిస్తితుల వలన ఋతుపవనాధారిత వర్షాలు కూడా లేవు.
  • సారవంతమైన భూమి లేదు.
  • నైపుణ్యమైన శ్రామికుల కొరత.

శ్రీనివాసపురాసవరించు

కోలార్ జిల్లాలోని తాలూకాలలో శ్రీనివాసపురా ఒకటి. జిల్లాలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో శాశ్వత జలవనరులు లేవు.

  • అనుకూల పరిస్తితులు.
  • పండ్లలో రాజాగా కీర్తించబడుతున్న మామిడి పడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధిచెందింది.
  • తాలూకాలో ప్రధానంగ పాలౌత్పత్తి, పట్టు, సెరికల్చర్, హార్టికల్చర్, మామిడి తోటల పెంపకం చేపడుతున్నారు.
  • గవర్నమెంటు బాయ్స్ పి.యు కాలేజి (శ్రీనివాసపూర్) ఇది ఉత్తమశ్రేణి కాలేజీగా గుర్తించబడుతుంది.
  • ఆశ్రయ నీల్బాగ్ స్కూల్ :- ఇది శ్రీనివాసపూర్‌లో ఉత్తమశ్రేణి స్కూలుగా గుర్తించబడుతుంది. 2013లో ఈ స్కూల్ " ఎకో - పాఠశాల " అవార్డును పొందింది.

నిర్వహణసవరించు

కోలార్ జిల్లాలో ఒక రెవెన్యూ విభాగం ఉంది.

ఆర్ధికంసవరించు

జిల్లాలలో అధికంగా వ్యవసాయం, పాల ఉత్పత్తులు, సెరికల్చర్, ఫ్లోరి కల్చర్ మీద ఆధారపడి ఉన్నారు. కోలార్ " లాండ్ ఆఫ్ సిల్క్, మిల్క్, గోల్డ్ "గా వర్ణించబడుతుంది. కోలార్ ప్రజలు నీటిపారుదల, త్రాగునీటికి గొట్టం బావుల మీద ఆధారపడుతున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో బంగారు గనులు 2003 నుండి మూసివేయబడ్డాయి. ఇక్కడ బంగారు నిల్వలు క్షీణించడం, ఉత్పత్తి ఖర్చులు అధికరించడం అందుకు కారణం.

కోలార్ జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాలుసవరించు

కోలార్ జిల్లాలో 2 బృహత్తర, 1 మీడియం, 1 మైనర్ ఇండస్ట్రియల్ ప్రాంతాలు ఉన్నాయి.

  • నరసపురా పారిశ్రామిక ప్రాంతం :- నసపురా గ్రామం వద్ద ఉంది. నరసపురా ఇండస్ట్రియల్ ప్రాంతంలో హెచ్.ఎం.ఎస్, వొల్వొ, వోల్స్‌వాగన్ ఇండియా, స్కానియా ఎ.బి,మహీంద్రా ఎయిరోస్పేస్ మొదలైన పరిశ్రమలు ఉన్నాయి. ఇది కోలార్‌కు 12 కి.మీ దూరంలో జాతీయరహదారి 4 సమీపంలో ఉంది.
  • వెమగళ్ ఇండస్ట్రియల్ ఏరియా - చిక్కబల్లాపురా రోడ్డు, వెమగళ్ వద్ద హీరో మోటోకార్ప్, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఉన్నాయి. ఇది కోలార్ నుండి 17 కి.మీ దూరంలో ఉంది.
  • తమక ఇండస్ట్రియల్ ఏరియా :- ఇది చెన్నై రోడ్డులో జాతీయరహదారి 4 సమీపంలో ఉంది. ఇక్కడ చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇది కోలార్ నుండి 5 కి.మీ దూరంలో ఉంది.
  • మాలూర్ ఇండస్ట్రియల్ ఏరియా :- హోసూర్ రోడ్డులో ఉంది. ఇది కోలార్ నుండి 35 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి.
  • ప్రధాన నివాస గృహ సముదాయాలు ఉన్నాయి. పరాటస్ బిల్డ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నివాస గృహ సముదాయ నిర్మాణాలు చేపట్టారు.

కోలార్ జిల్లా పారిశ్రామిక ప్రాంతాల లోని ప్రధాన పరిశ్రమలుసవరించు

  • హోండా మోటార్సైకిల్ తయారీ (1300 కోట్ల) యూనిట్ ప్రారంభించబడింది..[8] కర్ణాటక ప్రభుత్వం అనుమతించిన " హోండా మోటార్ సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్.ఎం.ఎస్), కోలార్ జిల్లా నరసాపూర్ తాలూకాలో స్థాపించబడిన " టూవీలర్ తయారీ ప్లాంటు " కొరకు 1350 కోట్ల పెట్టుబడి పెట్టబడింది.[9]
  • భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బి.ఇ.ఎం.ఎల్):- భారతప్రభుత్వం కె.జి.ఎఫ్ వద్ద పి.ఎస్.యు యూనిట్ ప్రారంభించబడింది. డిఫెంస్ ఎర్త్ మూవర్, వాహనాలు, మెట్రో కోచెస్ తయారు చేయబడుతున్నాయి.
  • భారతీయ రైల్వే :- 2012లో కోలార్ జిల్లాలో " రైలు పెట్టెల తయారీ యూనిట్ "కు అనుమతించింది. కర్ణాటక ప్రభుత్వం సంస్థ స్థాపనకు ముల్బబగల్ తాలూకాలోని కురుదమలె, శ్రీనివాసపురా తాలూకాలలో రైలుపెట్టెల తయారీ సంస్థ స్థాపనకు అనుమతించింది.
  • భారత్ ప్రభుత్వం బంగారం ఉత్పత్తి చేయడానికి జిల్లాలో భారత్ బంగారు గనులు (బి.జి.ఎల్) 2003 నుండి పనిచేస్తుంది.
  • కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కె.ఎం.ఎఫ్) స్వంతమైన మిల్క్ డైరీ ఉంది. కోలారులో " కోలార్ డిస్ట్రిక్ మిల్క్ ప్రొడ్యూసత్స్ " సొసైటీ యూనియన్ లిమిటెడ్ (కె.ఒ.ఎం.యు.ఎల్) ఉంది. చిక్కబల్లాపూర్ జిల్లా విభజన తరువాత (కె.ఒ.ఎం.యు.ఎల్) ను కోచీముల్ అని పిలువబడింది.
  • అరహవిల్లి గ్రామంలో " పవర్ గ్రిడ్ కార్పొరేషన్ " సబ్‌స్టేషను ఏర్పాటు చేసింది. కోలార్- చింతామణి - స్టేట్ హైవే-5 (కోలార్) సమీపంలో ఉంది.[10]
  • బంగారుపేట వద్ద ఆల్ ఇండియా మిషన్ టబ్లెట్ ఇండస్ట్రీ ఉంది.
  • వాల్వో మాన్యుఫ్యాక్చర్ ట్రక్కులు, బసులు, ఎర్త్ మూవింగ్ ఎంక్విప్‌మెంట్లు (డోజర్లు, ఎక్స్కెవేటర్లు, బేఖో లోడర్లు, మోటార్ గ్రేడర్లు మొదలైనవి) తయారుచేయబడుతున్నాయి.

మాన్యుఫ్యాక్చర్ యూనిట్ తవరెకెరె సమీపంలోని యలచహళ్ళి వద్ద ఏర్పాటు చేయబడింది.

  • కోలార్ లోని నరసపురా ఇండస్ట్రియల్ ఏరియాలో వొల్క్స్‌ వాగన్ సబ్సిడరీ స్కానియా పూర్తిస్థాయి నాక్ డౌన్ అసెంబ్లీ యూనిట్ స్థాపించాలని యోచిస్తుంది.
  • కోలార్ లోని నరసపురా ఇండస్ట్రియల్ ఏరియాలో మహీంద్రా ఎయిరోస్పేస్ 2013 అక్టోబర్ 21 న స్థాపించింది.
  • కోలార్ లోని నరసపురా ఇండస్ట్రియల్ ఏరియాలో వోల్స్ వాగన్ ఇండియా 4 వీలర్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్ ప్రారంభించాలని యోచిస్తుంది.
  • కోలార్ లోని వెమగళ్ ఇండస్ట్రియల్ ఏరియాలో హీరో హోండా 2 వీలర్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్ ప్రారంభించాలని యోచిస్తుంది.

ప్రఖ్యాత వ్యాపార కేంద్రాలుసవరించు

  • ముల్‌బగల్ తాలూకాలోని వడహళ్ళి వద్ద ఉన్న టొమాటో మార్కెట్.
  • కోలార్ జిల్లా లోని కొండరాజహళ్ళి వద్ద ఉన్న కోలార్ సెరికల్చర్, అగ్రికల్చర్ (టొమాటో, కూరగాయలు) మార్కెట్.
  • శ్రీనివాసపురా వద్ద ఉన్న మామిడి వ్యాపార మార్కెట్.
  • కోలర్ గోల్డ్ ఫీల్డ్ వద్ద ఉన్న స్వర్ణాభరణాల షాపులు

ప్రయాణవసతులుసవరించు

రహదారిసవరించు

  • జాతీయరహదారి 4 జిల్లాలోని నరసపురా- కోలార్- ముల్బగల్ గుండా పయనిస్తుంది. రాష్ట్రీయ రహదారులు ఇతర తాలూకాలను చిన్న గ్రామాలను అనుసంధానిస్తున్నాయి. ఇతర రహదారులు కూడా జిల్లాలోని తాలూకాలను జిల్లా కేంద్రంతో అనుసంధానిస్తున్నాయి.
  • జాతీయరహదారి 4 బెంగుళూరు తూర్పు నుండి నరసాపురా, కోలార్, ముల్బగల్, చిత్తోర్ లను కలుపుతూ ఒక దారి తిరుపతికి చేరుకుంటుంది. రెండవ దారి చెన్నై చేరుకుంటుంది.
  • కోలార్ డిస్ట్రిక్ రోడ్డు సమ్మరీ టేబుల్ ఫ్రం పి.డబల్యూ.డి డిపార్ట్మెంట్ ఆఫ్ కర్ణాటక " 2002 మార్చి నివేదికలు:- [11]
సంఖ్య క్ర కోలార్ జిల్లా నేషనల్ హైవే రాష్ట్ర రహదారి మేజర్ Dist రోడ్ మొత్తం పొడవు
01 కోలార్ జిల్లా 137 NH-4 308 1083 1528
02 ముల్బగల్ 68 0 354 422
03 మాలూర్ 8 68 94 170
04 బంగారుపేట 0 77 201 278
05 శ్రీనివాసపురా 30 72 217 319

బెంగుళూరు నుండి ముల్బగల్కు చేరడానికి నాలుగు వరుసల జాతీయరహదారి 4 ద్వారా 90 నిముషాలు పడుతుంది. మోటర్ ప్రయాణీకులు 6 వరుసల రహదారి మార్గం ద్వారా కె.ఆర్ పురం నుండి హోస్‌కోటె చేరుకుని అక్కడి నుండి ముల్బగల్ చేరుకోవచ్చు. తూర్పు బెంగుళూరు వాసులు ఈ మార్గం ద్వారా దేవనహళ్ళి విమానాశ్రయం చేరుకుంటారు.[12]

రైల్వేలుసవరించు

కోలార్ రైల్వే " సౌత్ వెస్టర్న్ రైల్వే "లో భాగంగా ఉంది. కోలార్ జిల్లాలో పలు రైలు స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలో బంగారు పేట వద్ద పెద్ద రైల్వే జంక్షన్ ఉంది. ఈ స్టేషన్లు అన్నీ చెన్నై సెంట్రల్ - బెంగుళూరు సిటీ లైన్ - చెన్నై బెంగుళూరు మెయిన్ లైన్ రైలు మార్గంలో, దాని బ్రాంచి మార్గంలో ఉన్నాయి. సమీపంలోని రైల్వే స్టేషన్లు తకల్, బంగారు పేట వద్ద ఉన్నాయి. ప్రధాన రైల్వే స్టేషను బెంగుళూరు రైల్వే స్టేషను. సమీపంలోని విమానాశ్రయం " బెంగుళూరు విమానాశ్రయం ".

కోలార్, బంగారుపేట రైల్వే స్టేషన్లు :- [13]

  • కోలార్ -కె.క్యూ.ఎల్
  • బి.ఇ.ఎం.ఎల్. నగర్ ట్రైన్ - బి.ఇ.ఎం.ఎల్.
  • బంగారంపేట -బి.డబల్యూ.టి
  • ఊర్గం - ఒ.జి.ఎం.
  • మల్లూర్- ఎం.ఎల్.ఒ
  • బిసనాట్టం- బి.ఎస్.ఎం
  • బ్యాత్రాయణ హళ్ళి హళ్లీ -బి.ఎఫ్.డబల్యూ
  • చాంపియన్ - చు
  • కోరమండల్ - సి.ఒ.ఎల్
  • కామసముద్రం- కె.ఎస్.ఎం.
  • మకలి దుర్గ్ - ఎం.కె.ఎల్.
  • మారికుప్పం - ఎం.కె.ఎం
  • త్యాకల్- టికె.ఎల్

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,540,231,[14]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[15]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం..[16]
640 భారతదేశ జిల్లాలలో. 324 వ స్థానంలో ఉంది.[14]
1చ.కి.మీ జనసాంద్రత. 384 [14]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.04%.[14]
స్త్రీ పురుష నిష్పత్తి. 976:1000 [14]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 74.33%.[14]
జాతియ సరాసరి (72%) కంటే.

కర్ణాటక రాష్ట్ర జనసంఖ్య అభివృద్ధిసవరించు

జనసంఖ్య అభివృద్ కర్ణాటక
1901 392651
1911 429193
1921 436066
1931 469811
1941 555545
1951 650807
1961 721822
1971 826563
1981 1044394
1991 1211858
2001 1387062
అంచనా 1571700
అంచనా సంవత్సరం 2010
మూలాలు కోలార్ జిల్లా అధికారిక వెబ్‌సైట్ [17]
  • జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి :- కోలార్, బెంగుళూరు, మాలౌర్, ముల్బగల్, శ్రీనివాసపూర్.
  • జిల్లాలో 15 పట్టణాలు, 3,321 గ్రామాలు (2889 నివాసిత గ్రామాలు, 432 నిర్జన గ్రామాలు) ఉన్నాయి.2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 2,536,069. వీరిలో నగర వాసులు 24.67% %.[18]
  • ప్రాంతం చ.కి.మీ. - 3969
  • జనసంఖ్య - 13,87,062
  • స్త్రీ: పురుష 977 : 1000
  • అక్షరాస్యత - 74.01%

సంస్కృతిసవరించు

జిల్లా మూడు రాష్ట్రాల కూడలిప్రాంతంలో ఉంది. అందువలన ఇక్కడ పలు సంప్రదాయాలకు చెందిన ప్రజలతో మినీ ఇండియాను తలపింపజేస్తుంది. జిల్లాలో ప్రధానంగా కన్నడ భాష వాడుకలో ఉంది. విస్త్రుతంగా వాడుకలో ఉన్న ఇతరభాషలలో ఉర్ధూ ప్రథమ స్థానంలో ఉంది. జిల్లాలో తెలుగు, తమిళం మాట్లాడే ప్రజలు గుర్తించతగినంతగా ఉన్నారు.

కోలారు గోల్డ్ ఫీల్డ్స్ (కె.జి.ఎఫ్) కోలార్ జిల్లాలోని ఒక పట్టణం. ఒకప్పుడు ఇది భారతదేశంలోని ప్రధాన బంగారుగనిగా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ ప్రభుత్వం చేత స్థాపించబడిన ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్కు సమీపంలో ఉంది. ఇక్కడ తమిళ, తెలుగు, ఆంగ్లో ఇండియన్ ప్రజలు అధికంగా ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం బంగారు గనులలో పనిచేయడానికి తమిళ ప్రజలను తీసుకు వచ్చారు.

పండుగలుసవరించు

  • కరగ
  • తెప్పోత్సవ
  • ద్యావర

మాలూర్ కరగసవరించు

కరగ ఉత్సవం జిల్లాకు మకుటాయమానం అని చెప్పవచ్చు. ఇది మాలూర్ పట్టణంలో నిర్వహించబడుతుంది. ఇది బెంగుళూరు - చెన్నై రహదారి మార్గంలో బెంగుళూరుకు 30 కి.మీ దూరంలో ఉంది. తిగ్లా వంశస్థులు ద్రౌపది ఆరాధనలో భాగంగా కరగ ఉత్సవం జరుపుకుంటారు. మలూర్ లోని కరగ పండుగ 13 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఇది సాధారణంగా ఉగాది తరువాత వచ్చే మొదటి శుక్రవారం రోజున నిర్వహించబడుతుంది.

కోలార్ జిల్లా సందర్శకులకు ఆకర్షణలుసవరించు

కోలార్ జిల్లాలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. బెంగుళూర్ నుండి km. 68 కి.మీ ప్రయాణించి కోలార్‌ను చేరుకోవచ్చు.

కోలార్ జిల్లాలో ఉన్న పర్యాటక ఆకర్షణల జాబితా:-

కోలార్ తాలూకాసవరించు

  • అంతరా గంగే
  • సోమేశ్వర ఆలయం, సోమేశ్వర ఆలయం
  • మార్కండేయ కొండ
  • తేర్ హళ్ళి
  • కోటేశ్వర
  • గుట్టహళ్ళి ఆలయం, ఉత్తహళ్ళి ఆలయం
  • చౌడేశ్వరి ఆలయం (బెగ్లిహోసహళ్ళి)
  • దర్గా ఉస్మ షా వాలి కొండ పైన
  • దర్గా ఖుతుబ్ గౌరి క్లాక్ టవర్
  • దర్గా క్లాక్ టవర్ లో టిప్పు గ్రాండ్ తల్లిదండ్రులు
  • దర్గా షాబాజ్ షా ఖలందర్

బంగారంపేట లేదా కె.జి.ఎఫ్సవరించు

  • బుడికోటే
  • బెతమంగళ
  • కోటేశ్వర
  • బైతరయప్పన మెట్ట
    • దొడ్డ కరి

మాలూర్సవరించు

  • చిక్క తిరుపతి
  • మారికంబ ఆలయం
  • ధర్మరాయ స్వామి ఆలయం
  • గుట్టమ్మ ఆలయం, దొడ్డకడత్తూర్
  • తీర్థ బందే, మస్తీ
  • తెకల్ లోని ప్రసిద్ధ 101 ఆలయ సమూహం
  • శివరపట్టణ
  • తెకల్
  • పుదెషెతహళ్ళి

Mulbagalసవరించు

  • ఆంజనేయ స్వామి ఆలయం
  • సాయి మందిర్
  • ( (గరుడ ఆలయం)) - పురాణ సంబంధిత ఆలయం, కొలదేవి, ముల్బగల్.
  • బైరకూర్
  • గుట్టహళ్ళి
  • శ్రీ వీరరాజస్వామి ఆలయం ఉత్తనూర్
  • కురుదుమలె
  • అవని
  • దర్గ హజ్రత్ హైదర్-అది-సబ్దర్

చింతామణి (చిక్కబల్లాపూర్ జిల్లా)సవరించు

  • కైవార కైలాసగిరి, భీమ బాస్కర మెట్ట

మదనపల్లి (ఆంధ్రప్రదేశ్ - చిత్తూరు జిల్లా)సవరించు

  • హోసేరి హిల్స్

ప్రముఖ వ్యక్తులుసవరించు

  • డి. వి. గుండప్ప - ప్రముఖ కన్నడ కవి
  • ఆర్.గణేష్ - బహుభాషా శతావధాని.
  • కె. సి. రెడ్డి- మొదటి ముఖ్యమంత్రి కర్ణాటక
  • మాస్తి వెంకటేష్ అయ్యంగార్ - కన్నడ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత.
  • శ్రీ ది.బైరెవ్. గౌడ మాజీ మంత్రి వ్యవసాయ మంత్రి జనతా పరివార్ నాయకుడు.
  • కె.హెచ్. మునియప్ప కేంద్ర మంత్రి, భారతీయ రైల్వే రాష్ట్ర, రికార్డు ఆరవ కాలవ్యవధిలో భారతదేశం పార్లమెంట్ కోలార్ సూచిస్తుంది.
  • ఎన్.ఆర్. నారాయణ మూర్తి- చైర్మన్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ముఖ్య గురువు.
  • సౌందర్య- బహుముఖ దక్షిణ భారత చలనచిత్ర నటి, ముల్బగల్
  • హైదర్ ఆలీ - టిప్పు సుల్తాన్ యొక్క తండ్రి.
  • శ్రీ సి. క్రిష్ణ బైరె గౌడ, వ్యవసాయ శాఖ మంత్రి, బాగా ఎజ్యుకేటెడ్, కెపిసిసి యువత నాయకుడు.
  • వి.ఆర్. సుదర్శన్ ఎం.ఎల్.సి. వెంగళ్
  • బలువన్నాథ్హళ్ళి, బంగారుపేట్, బి.ఆర్ తాలుకాలో సురేష్ బాబు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, జనంచంద్ర శిక్షక అవార్డు గ్రహీత ఉంది.
  • ఎ.ఎన్ ప్రహ్లాద రావు రావు అత్యధిక క్రాస్వర్డ్ రచయిత భారతదేశం

కోలార్ జిల్లా నుండి శాసన సభ సభ్యుడుసవరించు

  • వర్తూర్ ప్రకాష్ - కోలార్ శాసన సభ్యులు
  • కె.ఎస్. మంజునాథ్ గౌడ, మాలౌర్
  • వై.రామక్క (వై.ఎస్.సంపంగి యొక్క తల్లి), కె.గి.ఎఫ్
  • కే.ఎం నారాయణస్వామిలను, బంగార్‌పేట
  • జి.మంజునాథ్, ముల్బగల్
  • అర్.ఆర్. రమేష్ కుమార్, శ్రీనివాస్పూర్

విద్యాసంస్థలుసవరించు

  • Ashraya Neelbagh పాఠశాల, Rayalpad (NGO)
  • ప్రభుత్వ కళాశాలలో కోలార్ బాయ్స్ కోసం
  • ప్రభుత్వ పు కాలేజ్; శ్రీనివాసపూర్ బాయ్స్ కోసం
  • మెథడిస్ట్ పాఠశాల అండ్ కాలేజ్, కోలార్
  • ప్రభుత్వ కళాశాలలో కోలార్ మహిళలకు
  • ప్రభుత్వ లా కళాశాల, కోలార్
  • గుప్తా ఇంటర్నేషనల్ పాఠశాల
  • విద్యా జ్యోతి పాఠశాల, బసవనాథ, కోలార్
  • శ్రీ దేవరాజ్ ఆర్స్ మెడికల్ కాలేజ్, కోలార్[permanent dead link]
  • నర్సింగ్ శ్రీ దేవరాజ్ ఆర్స్ పాఠశాల, కోలార్
  • సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఉన్నత పాఠశాల, కోలార్
  • శ్రీ మంజునాథ స్కూల్ Byrakur, Mulbagal తాలూకా
  • శ్రీమతి దనమ్మ చన్నబసవయ్య, డిగ్రీ కళాశాల, కోలార్
  • మహిళా Samaja పాఠశాల, కోలార్
  • సెయింట్ అన్నే యొక్క కాన్వెంట్ ఉన్నత పాఠశాల, కోలార్
  • Dr.T. ఇంజనీరింగ్ Thimmaiah కళాశాల, KGF[permanent dead link]
  • టెక్నాలజీ C.ByreGowda ఇన్స్టిట్యూట్, కోలార్[permanent dead link]
  • మొదటి గ్రేడ్ కాలేజ్, కె.గి.ఎఫ్
  • సెయింట్ జోసఫ్స్ కాన్వెంట్, ఛాంపియన్ దిబ్బలు, కె.జి.ఎఫ్
  • సెయింట్ మేరీ యొక్క ఉన్నత పాఠశాల, ఛాంపియన్ దిబ్బలు, కె.జి.ఎఫ్
  • బి.ఇ.ఎం.ఎల్ ఉన్నత పాఠశాల, బి.ఇ.ఎం.ఎల్ నగర్
  • కేంద్రీయ విద్యాలయ, బి.ఇ.ఎం.ఎల్ నగర్
  • పార్కిన్సన్ మెమోరియల్ పాఠశాల, కె.జి.ఎఫ్
  • శ్రీ భగవాన్ మహావీర్ జైన్ కళాశాల, కె.జి.ఎఫ్
  • శ్రీ బైరవేశ్వర విద్యా సమస్తె, శ్రీనివాసపూర్
  • నేషనల్ ఉన్నత పాఠశాల, యెల్దూర్
  • జాతీయ ఉన్నత పాఠశాల, ముదియనూర్
  • వివేకానంద ఉత్తమ కాన్వెంట్, మాలూర్
  • చిన్మయ విద్యాలయ, కోలార్
  • సువర్ణ సెంట్రల్ పాఠశాల, కోలార్
  • సాయి విద్యానికేతన్, ముల్బగల్
  • సిఇఎ పాఠశాల, ముల్బగల్
  • నీల్ బాగ్ శ్రీనివాస పూర్

మీడియాసవరించు

  • కోలార పత్రికె - మొదటి కన్నడ ఆవర్తక.
  • కోలారవాణి - కన్నడ డైలీ న్యూస్ పేపర్, 32 సంవత్సరాల వయస్సు Kolaravani నాలుగు జిల్లాలలో వార్తలు సంబంధించిన ప్రధానంగా వార్తలు ప్రచురిస్తుంది [19].
  • కన్నడ తిలక , కన్నడ దినపత్రిక.[20]
  • సంచికె , కన్నడ, రోజువారీ కోలార్.
  • అధినాయక , కోలార్ కన్నడ రోజువారీ
  • ఇ- ముంజానె , కోలార్ కన్నడ రోజువారీ

రాబోయే రెస్టారెంట్లుసవరించు

  • కె.ఎఫ్.సి - వాసుదేవ్ అదిగాస్ రెస్టారెంటు, ఎదురుగా: జాతీయరహదారి, అంజప్పన్ హళ్ళి, (కోలార్)
  • ఎం.సి. డొనాల్డ్స్ : వాసుదేవ్ అదిగాస్ రెస్టారెంటు ఎదురుగా, కె.ఎఫ్.సి పక్కన, జాతీయరహదారి, అంజప్పన్ హళ్ళి, (కోలార్)

రాబోయే సంస్థలుసవరించు

  • క్రిస్ట్ యూనివర్శిటీ :-కేంద్ర జిల్లా గ్రంథాలయం (డిస్ట్రిక్ సెంట్రల్ లైబ్రరీ) ఎదురుగా, మెథడాలజిస్ట్, డి.విజి రోడ్డు (కోలార్) పక్కన
  • బాల్డ్వింస్ మెథడాలజిస్ట్ కాలేజ్ - క్రిస్ట్ యూనివర్శిటీ డి.వి. జి రోడ్డు (కోలార్) పక్కన

మూలాలుసవరించు

  1. "A Handbook of Karnataka - Administration" (PDF). Government of Karnataka. pp. 354, 355. Archived from the original (pdf) on 8 అక్టోబరు 2011. Retrieved 16 November 2010.
  2. "A green view". The Hindu. Chennai, India. 11 March 2006. Archived from the original on 23 ఆగస్టు 2006. Retrieved 23 December 2010.
  3. "Temples of Karnataka - Kolar". templenet.com. Retrieved 23 December 2010.
  4. 4.0 4.1 Mythic Society (Bangalore, India) (1918). "Nandiroog". The Quarterly Journal of the Mythic Society. 9–10: iv, 5, 8, 300.
  5. 5.0 5.1 Goodwill, Fred (1918). "Nandidroog". The Quarterly Journal of the Mythic Society. 9–10: 300. Retrieved 27 August 2014.
  6. 6.0 6.1 Goodwill, Fred (1921). "The Religious and Military Story of Nudydurga". KGF Mining and Metallurgical Society (5).
  7. Srikumar, S (2014). Kolar Gold Field: (Unfolding the Untold) (International ed.). Partridge India. pp. 40–46. ISBN 9781482815078. Retrieved 27 August 2014.మూస:Self-published source
  8. Honda Unit at Narasapura, Kolar
  9. "Karnataka showers Honda with concessions - The Times of India". The Times Of India.
  10. Power Grid [1][permanent dead link], Kolar
  11. Kolar Roads[permanent dead link]
  12. Bangalore-Mulbagal Road (NH-4)Mulbagal[permanent dead link]
  13. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-21. Retrieved 2015-02-10.
  14. 14.0 14.1 14.2 14.3 14.4 14.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  15. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gabon 1,576,665
  16. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301
  17. "Kolar district at a glance" (PDF). Archived from the original (pdf) on 12 మార్చి 2011. Retrieved 22 December 2010.
  18. "Kolar Total population". Archived from the original on 2015-04-25. Retrieved 2015-02-10.
  19. Kolaravani[permanent dead link]
  20. "కన్నడ తిలక". Archived from the original on 2016-03-05. Retrieved 2015-02-10.

వెలుపలి లింకులుసవరించు