బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ బెంగళూరు, కొత్త డిల్లీ మధ్య నడిచే రాజధాని రైలు.
![]() | |
సారాంశం | |
---|---|
రైలు వర్గం | రాజధాని ఎక్స్‌ప్రెస్ |
స్థానికత | కర్ణాటక, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ & ఢిల్లీ |
తొలి సేవ | 01 నవంబరు 1992 |
ప్రస్తుతం నడిపేవారు | నైరుతి రైల్వే జోన్ |
మార్గం | |
మొదలు | బెంగుళూరు |
ఆగే స్టేషనులు | 10 |
గమ్యం | హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ |
ప్రయాణ దూరం | 2,365 కి.మీ. (1,470 మై.) |
సగటు ప్రయాణ సమయం | 33 గంటల 30 నిమిషాలు |
రైలు నడిచే విధం | ప్రతిరోజూ |
రైలు సంఖ్య(లు) | 22691 / 22692 (Mon, Wed, Thu, Sun) & 22693 / 22694 (Tue, Fri, Sat) |
సదుపాయాలు | |
శ్రేణులు | ఏ.సి 1,2,3 |
కూర్చునేందుకు సదుపాయాలు | లేదు |
పడుకునేందుకు సదుపాయాలు | కలదు |
ఆహార సదుపాయాలు | పాంట్రీకార్ కలదు |
చూడదగ్గ సదుపాయాలు | LHB rakes No of rakes = 4 |
బ్యాగేజీ సదుపాయాలు | Available |
సాంకేతికత | |
పట్టాల గేజ్ | Broad Gauge |
వేగం | 72 km/h (45 mph) average with halts; 130 km/h (81 mph) max |
నేపధ్యము
మార్చుబెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ బెంగళూరు, కొత్త డిల్లీ మధ్య నడిచే అత్యంత వేగంగా నడిచే రైళ్ళలో రెండవ వేగవంతమయిన రైలు.ఈ రైలు ప్రతి రోజు రాత్రి 08గంటలకు 22691 నెంబరుతో బయలుదేరి మూడవ రోజు ఉదయం 5గంటల 55నిమిషాలకు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరుతుంది.తిరుగుప్రయాణంలో 22692 నెంబరుతో ప్రాయాణిస్తుంది.
చరిత్ర
మార్చుబెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను నవంబర్ 1 1992 లో ఒక వారంతపు రైలుసర్వీసుగా ప్రారంభించారు.తరువాత దీనిని వారానికి రెండుమార్లు, తరువాత మూడుమార్లు, నాలుగుమార్లకు పొడిగించడం జరిగింది.జూలై 1 2017 నుండి బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను రోజువారి సర్వీసుగా మార్చడం జరిగింది.
ప్రయాణ సమయం
మార్చుబెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ బెంగళూరు, కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని అధిగమింఛడానికి 33గంటల 55నిమిషాల సమయం తీసుకుంటుంది.
సగటు వేగం
మార్చుబెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ బెంగళూరు, కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని 70కిలో మీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తుంది.
కోచ్ల అమరిక
మార్చుబెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ఎ.సి మొదటి తరగతి భోగి ఒకటి, రెండవ తరగతి భోగీలు 5, మూడవ తరగతి ఎ.సి భోగీలు 11,1 పాంట్రీకార్,2జనరేటర్ల భోగీలు కలిగివుంటుంది.
Loco | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
EOG | H1 | A5 | A4 | A3 | A2 | A1 | PC | B11 | B10 | B9 | B8 | B7 | B6 | B5 | B4 | B3 | B2 | B1 | EOG |
ట్రాక్షన్
మార్చుబెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభంలో ఖాజీపేట లోకోషెడ్ అధారిత WDM-3A డీజిల్ ఇంజన్ ను సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను వరకు, అక్కడినుండి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వరకు ఘజియాబాద్ లోకోషెడ్ అధారిత WAP-1 లేదా WAP-4 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగంచేవారు.2010 సంవత్సరం నుండి కృష్ణరాజపురం లోకోషెడ్ అధారత WDM-3A డీజిల్ ఇంజన్ ను, సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను వరకు ఉపయోగించేవారు.తరువాత 2013వ సంవత్సరం నుండి WDM-4 డీజిల్ ఇంజన్ ను, సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను వరకు ఉపయోగించేవారు.అక్కడినుండి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వరకు తుగ్లకబాద్ లేదా లాల్ గుడా అధారిత WAP 7 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగంచేవారు.2017 జూన్ 30 న గుంతకల్లు -బెంగళూరు రైలుమార్గం పూర్తిస్థాయిలో విద్యుతీకరణ జరిగిన తరువాత ఘజియాబాద్ లేదా లాల్ గుడా లేదా తుగ్లకబాద్ అధారిత WAP 7 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.
చిత్రమాలిక
మార్చు-
Banglore Rajdhani Express trainboard
-
Banglore Rajdhani Express 3 tier coach
-
Greeting Poster on Banglore Rajdhani