బెల్లయ్య నాయక్
డా.తేజావత్ బెల్లయ్య నాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు.కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి,తెలంగాణ ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్,లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు.తెలంగాణా గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ట్రైకార్) చైర్మన్ గా నియమించబడ్డాడు[1] [2][3].
డా. తేజావత్ బెల్లయ్య నాయక్ | |||
| |||
తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 08 జూలై 2024 నుండి - ప్రస్తుతం | |||
టిపిసిసి అధికారి ప్రతినిధి తెలంగాణ
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 01 జులై 1971 ధర్మారావు పేట ఖానాపూర్ మండలం వరంగల్ జిల్లా, ఇండియా | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | ఇచ్చానాయక్,
మారోణిబాయి | ||
జీవిత భాగస్వామి | తేజావత్ సుజాత సహాయ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, | ||
సంతానం | భవిష్య నాయక్ బి.టెక్,
సృష్టి నాయక్ బి.టెక్ | ||
నివాసం | వివి నగర్, హబ్సిగూడ, |
జననం,విద్యాభ్యాసం
మార్చుడా.తేజావత్ బెల్లయ్య నాయక్ 1971 జులై 01న ఇచ్చా నాయక్ మారోణి బాయి దంపతులకు తెలంగాణ రాష్ట్రం,వరంగల్ జిల్లా,ఖానాపూర్ మండలంలోని ధర్మారావు పేట తండాలో జన్మించాడు. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాదులో బి.టెక్ ఉత్తీర్ణులై ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదు నుండి గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుడా.తేజావత్ బెల్లయ్య నాయక్ కు నల్గొండ జిల్లా కోదాడ మండలంలోని గోల్తండాకు చెందిన సుజాత తో 15 ఫిబ్రవరి 1998లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు భవిష్య నాయక్,సృష్టి నాయక్ ఉన్నారు.
రాజకీయ జీవితం
మార్చుడా.తేజావత్ బెల్లయ్య నాయక్ హైదరాబాదు లోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో బి.టెక్ చదువుతున్న సమయంలో విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ రాజకీయానికి ఆకర్శీతులై కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అతని సేవలను గుర్తించి జూలై 2016 లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికా ప్రతినిధి గా నియమించింది[4][5].ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 2017 లో ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ కు వైస్ చైర్మన్ గా నియమించింది[6]. అనంతరం 2011లో తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మెన్ గా వ్యవహరించాడు.డిసెంబర్ 2023లో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో తెలంగాణాలో అధికారంలో రావడం కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రారంభించిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలసి బెల్లయ్య నాయక్ జోడో యాత్రలో కాశ్మీర్ వరకు పాల్గొన్నాడు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రైకార్ చైర్మన్ గా నియమించడంతో తెలంగాణ గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు[7].
మూలాలు
మార్చు- ↑ "Hyderabad: తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్ల నియామకం". EENADU. Retrieved 2024-09-03.
- ↑ Anjali (2024-07-10). "తెలంగాణా గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన బెల్లయ్య నాయక్". www.dishadaily.com. Retrieved 2024-09-03.
- ↑ Uploader3 (2024-07-15). "తేజావత్ బెల్లయ్య నాయక్ ను మర్యాద పూర్వకంగా కలిసిన సకృ నాయక్ -" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-09-03.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Srikanth, Gantepaka (2024-05-31). "తెలంగాణ గీతం చరిత్రలో నిలిచిపోతుంది: బెల్లయ్య నాయక్". www.dishadaily.com. Retrieved 2024-09-03.
- ↑ Global, Telugu (2022-12-12). "కాంగ్రెస్ లో పెరుగుతున్న కమిటీల చిచ్చు... అధికార ప్రతినిధి పదవికి బెల్లయ్య నాయక్ రాజీనామా". Telugu Global (in ఇంగ్లీష్). Retrieved 2024-09-03.
- ↑ Velugu, V6 (2024-01-05). "పదేండ్లు దోచుకొని.. కాంగ్రెస్ను 420 అంటరా : బెల్లయ్య నాయక్". V6 Velugu. Retrieved 2024-09-03.
{{cite web}}
: zero width space character in|title=
at position 30 (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Velugu, V6 (2024-08-31). "చెంచుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం : ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్". V6 Velugu. Retrieved 2024-09-03.
{{cite web}}
: zero width space character in|title=
at position 48 (help)CS1 maint: numeric names: authors list (link)