భద్రాచలం మండలం
భద్రాచలం మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1]
భద్రాచలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఖమ్మం, భద్రాచలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°40′N 80°53′E / 17.67°N 80.88°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం |
మండల కేంద్రం | భద్రాచలం |
గ్రామాలు | 62 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 89,048 |
- పురుషులు | 44,029 |
- స్త్రీలు | 45,019 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 57.7% |
- పురుషులు | 63.48% |
- స్త్రీలు | 51.81% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో భద్రాచలం ఒక్క రెవెన్యూ గ్రామం మాత్రమే ఉంది.ఇది పూర్వపు జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉంది. గోదావరి నది దక్షిణ తీరాన ఉన్న మండల కేంద్రమైన భద్రాచలం అక్కడ ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కారణంగా ప్రసిద్ది చెందింది. భద్రాచలం మండలానికి భద్రాచలం పట్టణం పరిపాలనా కేంద్రం. దీనిని శ్రీరామ దివ్యక్షేత్రం, భద్రాద్రి అనికూడా అంటారు. భద్రాద్రి జిల్లా లోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కి.మీ., మణుగూరు 35 కి.మీ., కొత్తగూడెం 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి. భద్రాచలం తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి.
మండల/పట్టణ జనాభాసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 89,048 - పురుషులు 44,029 - స్త్రీలు 45,019
మండలం లోని పట్టణాలుసవరించు
- భద్రాచలం (జనగణన పట్టణం)
మండలం లోని గ్రామాలుసవరించు
రెవెన్యూ గ్రామాలుసవరించు
- భద్రాచలం (ఒకటి మాత్రమే)
ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన పోలవరం ముంపు గ్రామాలుసవరించు
తెలంగాణ విభజనకు ముందు ఈ మండలంలో 73 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3] అందులో 8 నిర్జన గ్రామాలు.2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, పోలవరం ఆర్డినెన్స్ ప్రకారం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపింది.అయితే అందులో భాగంగా ఈ మండలంలోని భద్రాచలం (జనగణన పట్టణం) మినహా నిర్జన గ్రామాలతో కలుపుకుని 73 రెవెన్యూ గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో కలిసాయి.[4][5][6]ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గ్రామాలను రెవెన్యూ గ్రామంగా ఉన్న ఎటపాక మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన ఎటపాక మండలం లో చేర్చింది.
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 237, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ "Villages and Towns in Bhadrachalam Mandal of Khammam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-12-09. Retrieved 2022-01-11.
- ↑ "Ordinance on Khammam Villages Deserves to be Scrapped". The New Indian Express. Retrieved 2022-01-11.
- ↑ https://prsindia.org/files/bills_acts/bills_parliament/2014/AP_Reorganisation_(A)_Bill,_2014_0.pdf
- ↑ "THE ANDHRA PRADESH REORGANISATION (AMENDMENT) BILL, 2014" (PDF). prsindia.org. Archived from the original (PDF) on 2022-09-07. Retrieved 2022-09-07.