భలేవాడివి బాసు 2001లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో బాలకృష్ణ, అంజలా జవేరీ, శిల్పా శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించాడు. పిఎ అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. మణి శర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రం నరసింహ నాయుడు అద్భుతమైన విజయం తరువాత వచ్చిన సినిమా కావడంతో దీనికి చాలా హైప్ వచ్చింది. నందమూరి బాలకృష్ణకు యాక్షన్ హీరో నుండి ఫ్యామిలీ హీరోగా ఇమేజిలో మార్పు తేవాలని అనుకున్నారు.

భలేవాడివి బాసు
(2001 తెలుగు సినిమా)
దర్శకత్వం అరుణ్ ప్రసాద్
నిర్మాణం అనితాకృష్ణ
తారాగణం నందమూరి బాలకృష్ణ
అంజలా ఝవేరి
శిల్పా శెట్టి
సంగీతం మణిశర్మ
సంభాషణలు రాజేంద్రకుమార్
నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్
భాష తెలుగు

సాగర్ (నందమూరి బాలకృష్ణ) అటవీ రేంజర్. శ్వేత (శిల్పా శెట్టి) సాగర్ బాస్. నెమలి (అంజల జావేరి) ఒక గిరిజన మహిళ. ఈ చిత్రం మొదటి సగం నెమలి, శ్వేతలు సాగర్ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం చుట్టూ తిరుగుతుంది. కాని ఒక అంతు తెలియని మహిళ కనిపించి అటవీ రేంజర్ పేరు సాగర్ కాదనీ, అతను మోసగాడనీ చెబుతుంది.

ఈ చిత్రం రెండవ భాగం ఫ్లాష్‌బ్యాక్‌లో మోసగాడితో మొదలవుతుంది, అతని అసలు పేరు ప్రభు అని అతను ఒక చిన్న దొంగ అని తెలుస్తుంది. అతను తెలివైన నిరుద్యోగి సాగర్ అనే వ్యక్తిని కలుస్తాడు. సాగర్కు ఒక తల్లి, సోదరి ఉన్నారు. అతను గ్రాడ్యుయేట్ అయ్యేందుకు వాళ్ళు త్యాగాలు చేశారు. సాగర్, ఇప్పుడు ఫారెస్ట్ రేంజరయ్యాడు. ప్రభుకు సన్నిహితుడౌతాడు. సాగర్ తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు ఆమెకు వైద్యానికి లక్ష రూపాయలు అవసరం అయినప్పుడు, ప్రభు కోర్టులో తప్పుడు వాంగ్మూలం ఇచ్చి డబ్బును పొందటానికి ఏర్పాట్లు చేస్తాడు. కాని ఇది మిస్‌ఫైర్‌ అయి అతనిని జీవిత ఖైదుపడుతుంది. కానీ అతను పోలీసుల నుండి తప్పించుకొని అడవిలోకి ప్రవేశిస్తాడు, అక్కడ కారు ప్రమాదంలో సాగర్ తీవ్రంగా గాయపడతాడు. తన తల్లిని, సోదరినీ జాగ్రత్తగా చూసుకోమని సాగర్ ప్రభును అడుగుతాడు.

నిజమైన సాగర్ గుర్తింపు ఎవరికీ తెలియదు కాబట్టి, ప్రభు తానే అటవీ రేంజర్‌గా నటిస్తాడు. అక్కడ అతను గిరిజన ప్రజల జీవితాన్ని మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తాడు. వేటగాళ్ళు, జంతువుల హంతకులను అడ్డుకుంటాడు. అదే సమయంలో, సాగర్‌గా నటిస్తూ సాగర్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటాడు.

ఈ నకిలీ సాగర్, సాగర్ సోదరి పెళ్ళి చెయ్యడం వగైరాలు మిగతా సినిమాలో చూదవచ్చు.

తారాగణం

మార్చు

సినిమాలో కిందినటీనటుడ్లు ముఖ్య పాత్రలు ధరించారు.[1]

సాంకేతిక సిబ్బంది

మార్చు

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."యహీ హై రైట్ చాయిస్"కులశేఖర్శంకర్ మహదేవన్4:38
2."అమ్మమ్మో బ్రహ్మా"భువనచంద్రశంకర్ మహదేవన్, గోపిక పూర్ణిమ4:19
3."అయ్యారే అయ్యారే"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర5:06
4."రయ్యి రయ్యి మంది"భువనచంద్రఉదిత్ నారాయణ్, స్వర్ణలత4:18
5."కుకుకు అంటే"భువనచంద్రఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కవితా సుబ్రహ్మణ్యం4:38
6."బావా బావా"వెన్నెలకంటిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర, సుజాత5:37
మొత్తం నిడివి:28:38

మూలాలు

మార్చు
  1. తెలుగు న్యూస్ 18, సినిమాలు (15 May 2020). "శిల్పాశెట్టి తెలుగులో చేసిన సినిమాలు ఇవే." www.telugu.news18.com. Retrieved 22 June 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)