విద్యుల్లేఖ రామన్

విద్యుల్లేఖ రామన్ సినిమా, నాటకరంగ నటి. విద్యుల్లేఖ తొలిసారిగా 2012లో దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ఎటో వెళ్ళిపోయింది మనసు' & "నీతానే ఎన్ పోన్ వసంతం" తమిళ చిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.[1]

విద్యుల్లేఖ రామన్
జననం (1991-11-04) 4 నవంబరు 1991 (వయస్సు 29)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
ఇతర పేర్లువిద్యుల్లేఖ
వృత్తినటి, కమెడియన్
క్రియాశీల సంవత్సరాలు2012 – ప్రస్తుతం
తల్లిదండ్రులుమోహన్ రామన్

జననంసవరించు

విద్యుల్లేఖ 1991, నవంబరు 4న చెన్నైలో జన్మించింది. ఆమె తమిళ క్యారెక్టర్‌ నటుడు, సినిమా జర్నలిస్ట్‌ మోహన్‌ రామన్‌ కుమార్తె. ఆమె చెన్నైలోని విద్య మందిర్ సీనియర్ సెకండరీ స్కూల్, చిదంబరం చేటీయార్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో తన ప్రాధమిక విద్యను పూర్తి చేసింది.

సినీ ప్రస్థానంసవరించు

విద్యుల్లేఖ మొదట థియేటర్‌ ఆర్టిస్టుగా ఏడేళ్ల పాటు పలు నాటకాల్లో నటించింది.[2] 2010లో వచ్చిన స్వామి & ఫ్రెండ్స్ నాటకానికి కోస్యూమే డిజైర్ గా పని చేసింది. 2021లో దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు', "నీతానే ఎన్ పోన్ వసంతం" (తమిళం) ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. 2020 ఆగ‌స్టు 26న ఫిట్‌నెస్, న్యూట్రీష‌న్ నిపుణుడు సంజ‌య్‌ను ప్రేమ‌ వివాహమాడింది.[3]

మూలాలుసవరించు

  1. "A Gene To Inherit". Behindwoods.com. Retrieved 11 April 2021.
  2. "the short story blog". Storywheel. 2010-11-03. Retrieved 11 April 2021.
  3. సాక్షి, హోం » సినిమా (1 September 2020). "పెళ్లి పీట‌లెక్క‌నున్న లేడీ క‌మెడియ‌న్‌". Sakshi. Archived from the original on 29 సెప్టెంబర్ 2020. Retrieved 11 April 2021. Check date values in: |archivedate= (help)CS1 maint: discouraged parameter (link)

బాహ్య లంకెలుసవరించు