మంచాల సూర్యనారాయణ

మంచాల సూర్యనారాయణ (జనవరి 1, 1948 - జూలై 25, 2020) తెలుగు నాటకరంగ, టీవీ, సినీ నటుడు. చిన్నప్పటినుండి అనేక నాటక ప్రదర్శనల్లో నటించిన సూర్యనారాయణ 1988లో వచ్చిన వివాహభోజనంబు అనే సినిమాలో తొలిసారిగా నటించాడు.[1]

మంచాల సూర్యనారాయణ
మంచాల సూర్యనారాయణ
జననంజనవరి 1, 1948
తిమ్మాపురం, కాకినాడ (గ్రామీణ) మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణంజూలై 25, 2020
హైదరాబాద్, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాదు
విద్య.
ప్రసిద్ధితెలుగు నాటకరంగ, టీవీ సినీ నటుడు
తండ్రిపెదవెంకటరాజు
తల్లివీరరాజమ్మ

జీవిత విషయాలు

మార్చు

సూర్యనారాయణ 1948, జనవరి 1న పెదవెంకటరాజు, వీరరాజమ్మ దంపతులకు తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ (గ్రామీణ) మండలంలోని తిమ్మాపురంలో జన్మించాడు. బాల్యం, విద్యాభ్యాసం తిమ్మాపురం, కాకినాడలో జరిగింది. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[2]

1973లో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ)లో ఉద్యోగంలో చేరిన సూర్యనారాయణ, 2005లో వీఆర్‌ఎస్‌ తీసుకొని పూర్తిగా కళారంగంలోకి వచ్చాడు.

నాటకరంగం

మార్చు

చిన్నప్పటినుండి కళారంగంపై ఉన్న ఆసక్తితో నాటకరంగంలోకి వచ్చి అనేక నాటక, నాటికల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. అవార్డులు, పురస్కారాలు పొందాడు.

సామర్లకోటలోని ఆర్.వి.ఆర్. ప్రొడక్షన్స్ సంస్థతో "లాభం", "మనిషి రోడ్డున పడ్డాడు", "దేవుడే దిగివస్తే" నాటికలు, "సుడిగుండాలు" నాటకంలో నటించాడు. కాకినాడలోని ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సంస్థ నుండి "పసుపు-బొట్టు పేరంటానికి" నాటకాన్ని అనేక ప్రదర్శనలు ఇచ్చాడు.

టివిరంగం

మార్చు

1996లో దూరదర్శన్‌ లో ప్రసారమైన ఋతురాగాలు సీరియల్ లో తొలిసారిగా నటించిన సూర్యనారాయణ, 2001లో ఈటీవీలో వచ్చిన శివలీలలు సీరియల్ లో, ఎం.ఎస్. కోటారెడ్డి దర్శకత్వంలో వచ్చిన చాలా సీరియల్స్ లో నటించాడు.

  1. 1996: ఋతురాగాలు (దూరదర్శన్)
  2. 1996: శాంతి నివాసం (దూరదర్శన్‌)
  3. 2001: శివలీలలు (ఈటీవీ)
  4. ఆడది
  5. మనసు మమత
  6. 2020: వదినమ్మ
  7. 2020: రామసక్కనిసీత
  8. సీతారాం చిటపటలు

సినిమారంగం

మార్చు

జంధ్యాల దర్శకత్వంలో 1988లో విడుదలైన వివాహ భోజనంబు హాస్యచిత్రంతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి అనేక సినిమాల్లో నటించాడు.[3]

  1. 1988: వివాహ భోజనంబు
  2. 1998: ఆవారాగాడు

సూర్యనారాయణ 2020, జూలై 25న హైదరాబాదు మోతీనగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. ఈనాడు, ప్రధానాంశాలు (26 July 2020). "నటుడు మంచాల సూర్యనారాయణ మృతి". www.eenadu.net. Archived from the original on 26 July 2020. Retrieved 26 July 2020.
  2. సమయం తెలుగు, సినిమా వార్తలు (26 July 2020). "నటుడు సూర్యనారాయణ మృతి". www.telugu.samayam.com. Shaik Begam. Retrieved 26 July 2020.
  3. The Hans India, Telangana (26 July 2020). "Senior actor Manchala Suryanarayana dies of heart attack in Hyderabad". www.thehansindia.com (in ఇంగ్లీష్). Roja Mayabrahma. Archived from the original on 26 July 2020. Retrieved 26 July 2020.
  4. "Senior Actor Manchala Suryanarayana No More". www.indtoday.com. 25 July 2020. Archived from the original on 26 July 2020. Retrieved 26 July 2020.
  5. Namasthe Telangana (27 March 2021). "గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు". Archived from the original on 2021-03-27. Retrieved 30 November 2021.