మంత్రి గారి వియ్యంకుడు

(మంత్రిగారి వియ్యంకుడు నుండి దారిమార్పు చెందింది)

మంత్రిగారి వియ్యంకుడు, 1983లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది చిరంజీవికి 63వ సినిమా. మనవూరి పాండవులు తరువాత మళ్ళీ బాపు దర్శకత్వంలో చిరంజీవి ఈ సినిమాలో నటించాడు.

మంత్రి గారి వియ్యంకుడు
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
నిర్మాణం జయకృష్ణ
చిత్రానువాదం ముళ్లపూడి వెంకటరమణ
తారాగణం చిరంజీవి (బాబ్జీ),
పూర్ణిమ భాగ్యరాజ్ (అనూరాధ),
అల్లు రామలింగయ్య (సుబ్బారాయుడు),
శుభలేఖ సుధాకర్ (శివరాం) ,
తులసి (సుశీల),
నూతన్ ప్రసాద్,
రాళ్లపల్లి,
శ్రీలక్ష్మి,
రావికొండలరావు (రామభద్రయ్య),
నిర్మలమ్మ (రావులపాలెం అన్నపూర్ణమ్మ),
కైకాల సత్యనారాయణ, తార,
కన్నడ ప్రభాకర్,
పొట్టి ప్రసాద్,
ధమ్,
సుత్తి వీరభద్రరావు
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,
ఎస్.జానకి
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
సంభాషణలు ముళ్లపూడి వెంకటరమణ
ఛాయాగ్రహణం లోక్ సింగ్
కూర్పు అనిల్ మల్నాడ్
నిర్మాణ సంస్థ ముద్దు ఆర్ట్ మూవీస్
విడుదల తేదీ 4 నవంబర్ 1983
భాష తెలుగు

సుబ్బారాయుడు (అల్లు రామలింగయ్య), రామభద్రయ్య (రావి కొండలరావు) చిన్ననాటి స్నేహితులు. కాలక్రమంలో ధనికుడైన సుబ్బారాయుడు తన స్నేహితుడిని మరచిపోతాడు. సుబ్బారాయుడి కొడుకు శివరాం (శుభలేఖ సుధాకర్) రామభద్రయ్య కూతురు సుశీల (తులసి) తో ప్రేమలో పడతాడు. అందుకు ఇష్టంలేని సుబ్బారాయుడు రామభద్రయ్యను తూలనాడుతాడు. తన కూతురును ఒక మంత్రి ఇంటి కోడలిని చేస్తానంటాడు. అప్పుడు రామభద్రయ్య కొడుకు బాబ్జీ (చిరంజీవి) పూనుకొని సుబ్బారాయుడికి గుణపాఠం నేర్పడమే ఈ సినిమా కథాంశం.

పాటలు

మార్చు
  • మనసా శిరసా నీ నామమే పాడెద ఈవేళ - జానకి, బాలు
  • కోకోనట్ మనకు దోస్తీ ఒకటే ఆస్థిరా జబరుదస్థిరా - బాలు
  • చీ చీ పో పాపా ఒప్పులకుమ్మా - బాలు
  • ఏమని నీ చెలి పాడెదనూ - బాలు, జానకి రచన: వేటూరి సుందర రామమూర్తి.
  • కొలువైనాడే ఊరికి కొలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడు - బాలు
  • అమ్మకాదె బుజ్జి కాదె నాపై కోపమా దానికదే దీనికిదే అంటే నేరమా - బాలు, జానకి
  • సలసలా నను కవ్వించవేల మిలమిలా - బాలు, జానకి

విశేషాలు

మార్చు
  • తమిళ, మలయాళ భాషలలో మంచి గుర్తింపు పొందిన పూర్ణిమా జయరామ్‌కు ఇది మొదటి, ఒకేఒక తెలుగు సినిమా.
  • ఇందులో చిరంజీవి తండ్రి వెంకటరావు మంత్రిగా ఒక చిన్న పాత్ర పోషించాడు.
  • ఇది ఒక మలయాళం సినిమాకు రీమేక్. కథ రీమేక్ హక్కులు రూ. 40,000కు కొన్నారట. ఇతర రెమ్యూనరేషన్లు - ఇళయరాజా 60,000; లోక్ సింగ్ 50,000; చిరంజీవి 1,50,000; పూర్ణిమాజయరాం 60,000 [1]
  • సినిమా బడ్జెట్ 22 లక్షలు. షూటింగ్ 40 రోజుల్లో పూర్తి చేశారు.
  • ఆరు కేంద్రాలలో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకొంది.

మూలాలు, వనరులు

మార్చు
  1. తెలుగు సినిమా సైటు Archived 2009-08-26 at the Wayback Machine లో వ్యాసం - రచన: నవ్య, శ్రీ, విజయభాస్కర్