మగమహారాజు

(మగ మహారాజు నుండి దారిమార్పు చెందింది)

మగ మహారాజు 1983 లో విజయ బాపినీడు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ నిర్మించిన తెలుగు చిత్రం.[1] చిరంజీవి, సుహాసిని మణిరత్నం, రావు గోపాలరావు, ఉదయ్‌కుమార్, అన్నపూర్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.

మగమహారాజు
దర్శకత్వంవిజయ బాపినీడు
రచనఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ (కథ), కాశీవిశ్వనాథ్ (మాటలు), వేటూరి (పాటలు)
నిర్మాతమాగంటి రవీంద్రనాథ చౌదరి
తారాగణంచిరంజీవి ,
సుహాసిని
ఛాయాగ్రహణంఎం. వి. రఘు
కూర్పుకె. సత్యం
సంగీతంకృష్ణ చక్ర
నిర్మాణ
సంస్థలు
శ్యాంప్రసాద్ ఆర్ట్స్, లక్ష్మీ ఫిలింస్
సినిమా నిడివి
145 ని
భాషతెలుగు

రాజు ఒక నిరుద్యోగ యువకుడు. రాజుకు కుటుంబ బాధ్యతలు చాలా ఉంటాయి. అతనికి ఒక పెళ్ళి కాని చెల్లెలు ఉంటుంది. తల్లిదండ్రులు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాళ్ళు అతను ఓ గౌరవప్రదమైన ఉద్యోగంలో స్థిరపడి తమను బాగా చూసుకోవాలని భావిస్తూ ఉంటారు. ఈ పరిస్థితులలో, రాజు మంచి కుటుంబానికి చెందిన సుహాసిని అనే యువతిని కలుస్తాడు. ఆమె అతనితో ప్రేమలో పడుతుంది. రాజు, డబ్బు సంపాదించడానికి, సైకిల్ రేసులో పాల్గొంటాడు, సైకిల్ నడుపుతాడు, పగలు, రాత్రి 8 రోజులు నాన్స్టాప్, డబ్బును గెలుస్తాడు. తరువాత, సుహాసిని అతన్ని వివాహం చేసుకుని అతని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది.

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాకు కృష్ణ - చక్ర సంగీతం అందించారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, పి. సుశీల, ఎస్. జానకి, వాణీ జయరాం, ఎస్. పి. శైలజ, రమణ పాటలు పాడారు.

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "నీదారి పూలదారి"     
2. "అన్నలో అన్న"     
3. "సీతే రాముడి కట్నం"     
4. "నీలాలు నిండే"     
5. "మా అమ్మ చింతామణీ"     

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. tollymasala.com. "Megastar Chiranjeevi Hits And Flops - Tollywood News- tollymasala.com updates". Archived from the original on 2021-02-09. Retrieved 2020-08-20.