మత్తు వదలరా (2019 సినిమా)

రితేష్ రానా దర్శకత్వంలో 2019లో విడుదలైన తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా

మత్తు వదలరా 2019, డిసెంబరు 24న విడుదలైన తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాణ సారథ్యంలో రితేష్ రానా[2] తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రంలోశ్రీ‌ సింహా, నరేష్ అగస్త్య, అత్యుల చంద్ర, సత్య,  బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు నటించగా,[3] కాల భైరవ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమై,[1] మంచి సమీక్షలు కూడా అందుకుంది.[4] ఈ చిత్ర ప్రదర్శనకోసం హైదరాబాదులో మరికొన్ని థియేటర్లు కూడా ఇచ్చారు.[5]

మత్తు వదలరా
మత్తు వదలరా సినిమా పోస్టర్
దర్శకత్వంరితేష్ రానా
రచనరితేష్ రానా
ఆర్. తేజ
నిర్మాతచిరంజీవి (చెర్రీ)
హేమలత
తారాగణంశ్రీ‌ సింహా
నరేష్ అగస్త్య
అతుల్య చంద్ర
సత్య
ఛాయాగ్రహణంసురేష్ సారంగం
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థ
మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీ
2019 డిసెంబరు 24 (2019-12-24)
సినిమా నిడివి
130 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹2.1 కోట్లు[1]

కథా నేపథ్యం మార్చు

బాబూ మోహన్ (శ్రీ సింహా), ఏసుదాస్ (సత్య), అభి (అగస్త్య) ముగ్గరూ స్నేహితులు. బాబూ మోహన్‌, ఏసుదాస్‌తో కలిసి డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. నెల మొత్తం కష్టపడి పనిచేసినా నాలుగైదు వేల కంటే ఎక్కువ సంపాదన లేకపోవడంతో ఏసుదాస్ సలహాతో తెలివిగా ‘తస్కరించుట’ అనే పద్ధతి ద్వారా కస్టమర్లను మోసం చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆర్డర్ ఇవ్వడానికి ఒక అపార్ట్‌మెంట్‌కి వెళ్లి అక్కడ క్రైమ్‌లో ఇరుక్కుంటాడు. అక్కడ జరిగిన మర్డర్స్‌కి బాబూ మోహన్ తనకు ఉన్న అతి నిద్ర వ్యాధి లక్షణాల వల్ల బాధ్యత వహించాల్సి వస్తుంది. నిద్ర నుండి కోలుకున్న తరువాత బాబూ మోహన్ ఈ మిస్టరి నుండి ఎలా బయటపడ్డాడు, అసలు నిందితులు ఎవరు అన్నది మిగతా కథ.[6]

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: రితేష్ రానా
  • నిర్మాత: చిరంజీవి (చెర్రీ), హేమలత
  • రచన: రితేష్ రానా, ఆర్. తేజ
  • సంగీతం: కాల భైరవ
  • సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
  • కూర్పు: కార్తీక శ్రీనివాస్
  • నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్

పాటలు మార్చు

ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు.

  • మత్తు వదలరా (టైటిల్ ట్రాక్) - ఎం.ఎం. కీరవాణి, కాల భైరవ.
  • సాలా రే సాలా - రాకేందు మౌళి, పృథ్వీ చంద్ర.

విడుదల - స్పందన మార్చు

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ చిత్రానికి 3/5 రేటింగ్ ఇచ్చింది, "ప్రేక్షకులను తమ సీట్లకు అతుక్కుపోయేలా చేసే పర్ఫెక్ట్ థ్రిల్లర్ సినిమా అని, సినిమాలో హాస్యం కూడా బాగుందని" అని పేర్కొంది.[7] "మత్తు వదలరా సినిమా మంచి ప్రయత్నమని, కొత్త టీం కొత్త అలోచనల దిశలో ఒక అడుగు ముందుకు వేసింది" అని ది హిందూ పత్రికలో రాశారు.[8]

పురస్కారాలు మార్చు

సైమా అవార్డులు మార్చు

2019 సైమా అవార్డులు

  1. సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడు (శ్రీ సింహ)

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Sharma, Bhavana (2019-12-29). "Must know! Here's what helped Rajamouli's nephews succeed at box office with Mathu Vadalara". International Business Times, India Edition. Retrieved 2020-11-29.
  2. Kumar, Hemanth (2019-12-26). "Mathu Vadalara movie review: Ritesh Rana's thriller is a superb blend of suspense and comedy". Firstpost. Retrieved 2020-11-29.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. Dundoo, Sangeetha Devi (2019-12-25). "'Mathu Vadalara' review: Till 'meth' does us apart". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-11-29.
  4. Pathi, Thadhagath (25 December 2019). "Mathu Vadalara Movie Review: A perfect thriller which makes the audience glued to their seats and also spills some laughs". The Times of India. Retrieved 2020-11-29.{{cite news}}: CS1 maint: url-status (link)
  5. Neeshita Nyayapati (28 December 2019). "'Mathu Vadalara' gets new screens and shows". The Times of India.
  6. BBC News తెలుగు (27 December 2019). ""మత్తు వదలరా.." సినిమా రివ్యూ: కొత్తదనం నిండిన సినిమా". BBC News తెలుగు. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.
  7. "Mathu Vadalara Movie Review: A perfect thriller which makes audience glued to their seats and also spills some laughs". The Times of India.
  8. Dundoo, Sangeetha Devi (25 December 2019). "'Mathu Vadalara' review: Till 'meth' does us apart". The Hindu.

ఇతర లంకెలు మార్చు