మద్దిశెట్టి వేణుగోపాల్

మద్దిశెట్టి వేణుగోపాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో దర్శి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

మద్దిశెట్టి వేణుగోపాల్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం దర్శి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1 జనవరి1966
లక్ష్మినరసింహపురం గ్రామం, పామూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కస్తూరమ్మ , శ్రీనివాసులు
జీవిత భాగస్వామి పద్మ
సంతానం లహరీ, రాజీవ్‌

జననం, విద్యభాస్యం మార్చు

మద్దిశెట్టి వేణుగోపాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, పామూరు మండలం, లక్ష్మినరసింహపురం గ్రామంలో జన్మించాడు. ఆయన 1982లో లింగసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో పదవ తరగతి, 1989లో మహారాష్ట్ర, కొల్హాపూర్ లోని శివాజీ యూనివర్సిటీ నుండి బిటెక్, 1992లో అమెరికాలోని న్యూపోర్ట్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.[2]

వృత్తి జీవితం మార్చు

మద్దిశెట్టి వేణుగోపాల్ పేస్ గ్రూప్ అఫ్ కంపెనీస్ ని స్థాపించి, సీఈఓగా ఉన్నాడు. ఆయన వల్లూరులో పేస్ ఇంజినీరింగ్ కాలేజ్ ను స్థాపించాడు. వేణుగోపాల్ యూనివర్సిటీ అఫ్ సౌత్ అమెరికా డాక్టర్స్ అఫ్ లెటర్స్ నుండి పట్టా అందుకున్నాడు.

రాజకీయ జీవితం మార్చు

మద్దిశెట్టి వేణుగోపాల్ 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2019, జనవరి 18న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3] మద్దిశెట్టి వేణుగోపాల్ 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి శాసనసభ నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కదిరి బాబూరావు పై 38,653 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీ లోకి అడుగుపెట్టాడు.[4]

ఎమ్మెల్యేగా మార్చు

ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అక్రమాలపై ఆయన కేసు వేశాడు.[5]

మూలాలు మార్చు

  1. TV9 Telugu (17 March 2019). "వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధుల పూర్తి జాబితా -". TV9 Telugu. Archived from the original on 7 June 2021. Retrieved 7 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (18 March 2019). "ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలు". Archived from the original on 16 September 2021. Retrieved 17 September 2021.
  3. The Hans India (18 January 2019). "Maddisetty joins YSRCP". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2021. Retrieved 7 June 2021.
  4. Sakshi (2019). "Darsi Constituency Winner List in AP Elections 2019 | Darsi Constituency MLA Election Results 2019". www.sakshi.com. Archived from the original on 7 June 2021. Retrieved 7 June 2021.
  5. The News Minute (22 June 2020). "AP Fibernet project: YSRCP MLA's firm alleges favouritism in tender, files complaint". The News Minute (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2021. Retrieved 7 June 2021.