మధు యాష్కీ గౌడ్ (జ: 15 డిసెంబర్ 1960) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. ఇతడు 2004లో 14వ, 2009లో 15వ లోక్‌సభకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మధు యాష్కీని తెలంగాణ పీసీసీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా 2021 జూన్ 26లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది.[1][2] ఆయన 2023 జూలై 14న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ (టీ-పీసీసీ) ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[3]

మధు యాష్కీ గౌడ్
మధు యాష్కీ గౌడ్


తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ & మాజీ పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గం నిజామాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం (1960-12-15) 1960 డిసెంబరు 15 (వయసు 63)
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి శుచీ మధు
సంతానం 2 కూతుర్లు
నివాసం హైదరాబాదు
వెబ్‌సైటు http://www.madhuyaskhi.com
మూలం [1]

వ్యక్తిగత విషయాలు

మార్చు

మధు యాష్కీ గౌడ్ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో డిసెంబరు 15, 1960 కృష్ణయ్య, సులోచన దంపతులకు జన్మించాడు. ఇతన్ని చిన్నాన్న పోచయ్య, అనసూయ దంపతులు పెంచుకున్నారు.[4] మధు యాష్కీకి ముగ్గురు అన్నదమ్ములు, ఆరుగురు అక్క చెల్లెలు. వారి తల్లితండ్రులకు ఆయన నాల్గొవ సంతానం. ఆయన పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నాడు. హైదరాబాద్ సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. యాష్కీ 1982లో నిజాం కళాశాల నుండి బి.ఎ., 1985లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి. 1989లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.ఎమ్. పట్టాలు పొందారు.[5] ఆయన 1991 జూన్ 20లో డా. సుచీ దేవిని వివాహమాడాడు. వీరికి ఇద్దరు కూతుర్లు కోమలి, గగన.

రాజకీయ జీవితం

మార్చు

మధు యాష్కీ 2004 లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నుండి 2004లో నిజామాబాదు స్థానం నుండి పోటీ చేసి పార్లమెంట్ లోకి తొలిసారి అడుగు పెట్టాడు. ఆయన రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒక్కడు. 2007లో ఏఐసిసి కార్యదర్శిగా నియమితుడయ్యాడు. 2009 లో నిజామాబాదు స్థానం నుండి తిరిగి లోక్ సభకు ఎన్నికయ్యాడు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. తెలంగాణ వాణిని ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళేవాడు. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అనంతరం 2015లో ఆయనను ఏఐసీసీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ హై కమాండ్ నియమించింది. ఆయనను 2023 సెప్టెంబరు 20న కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో స్థానం కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.[6]

 

జీవిత విశేషాలు

మార్చు
  • మధు యాష్కీ న్యూయార్క్ అటార్నీ, అంతర్జాతీయ న్యాయం, వ్యాపారంలో కన్సల్టంట్ గా అమెరికాలోని ప్రవాస భారతీయులకు సహాయపడుతున్నారు.
  • మధు యాష్కీ 2004 లో భారత పార్లమెంటుకు ఎన్నికోబడిన ప్రథమ, ఏకైక ప్రవాస భారతీయుడు.


పురస్కారాలు

మార్చు
  • ప్రవాస భారతీయునిగా 2005లో ఎన్నుకోబడ్డారు.

సంఘ సేవ

మార్చు
  • మధు యాష్కీ ఫౌండేషన్ అనే సేవా సంస్థను 2003లో స్థాపించి, పేదలకు ఆర్థిక సాయం, పేద విద్యార్ధులకు విద్య చెప్పిస్తున్నారు.

మూలాలు

మార్చు
  1. Outlook India. "Cong MP A Revanth Reddy appointed new Telangana PCC chief". Outlook India. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
  2. Andhrajyothy (27 June 2021). "టీపీసీసీలో జిల్లా నేతలకు కీలక పదవులు". andhrajyothy. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
  3. Mana Telangana (14 July 2023). "టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీగౌడ్". Archived from the original on 15 July 2023. Retrieved 15 July 2023.
  4. Mana Telangana (16 April 2024). "మధుయాష్కీగౌడ్ కు మాతృవియోగం.... రేవంత్ రెడ్డి సంతాపం". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  5. V6 Velugu (24 September 2023). "లక్షల ఆదాయం వదులుకొని : పాలిటిక్స్​లోకి ప్రొఫెషనల్స్". Archived from the original on 24 September 2023. Retrieved 24 September 2023. {{cite news}}: zero width space character in |title= at position 35 (help)CS1 maint: numeric names: authors list (link)
  6. Sakshi (20 September 2023). "ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీలో కోమటిరెడ్డి, మధుయాష్కీలకు చోటు". Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.