మన్మథుడు 2 2019లో విడుదలైన తెలుగు సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ల పై నాగార్జున, కిరణ్ పి నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగార్జున , రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్, సమంత, కీర్తి సురేష్, లక్ష్మి, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 09, 2019న విడుదలైంది.

మన్మథుడు 2
Manmadhudu 2 poster.jpg
దర్శకత్వంరాహుల్ రవీంద్రన్
స్క్రీన్‌ప్లేరాహుల్ రవీంద్రన్
సత్యానంద్
కథరాహుల్ రవీంద్రన్
కిట్టు విస్సాప్రగడ
(స్టోరీ /డైలాగ్స్ )
దీనిపై ఆధారితంఐ డు - 2006 ఇంగ్లీష్ సినిమా
నిర్మాతఅక్కినేని నాగార్జున
పి. కిరణ్
వయాకామ్ 18
నటవర్గం
ఛాయాగ్రహణంఎం. సుకుమార్
కూర్పుచోట కె. ప్రసాద్
బొంతల నాగేశ్వర రెడ్డి
సంగీతంచేతన్ భరద్వాజ్
నిర్మాణ
సంస్థలు
పంపిణీదారులువయాకామ్ 18 స్టూడియోస్
విడుదల తేదీలు
2019 ఆగస్టు 9 (2019-08-09)
నిడివి
152 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్30 కోట్లు
వసూళ్ళు15 కోట్లు [1]

కథసవరించు

సాంబ శివ రావు ఉరఫ్ స్యామ్ (నాగార్జున) కుటుంబం అంతా పోర్చుగల్ వచ్చి సెటిల్ అవుతారు. స్యామ్ (నాగార్జున)కు పెళ్లి అంటే దూరంగా ఉంటాడు కానీ అమ్మాయిలకు దగ్గరగా ఉంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. వయసు దాటిపోతున్నా కూడా పెళ్లి చేసుకోడు. మరోవైపు ఇంట్లో వాళ్లు ఆయనకు పెళ్లి చేయాలనుకుంటారు. దాంతో ఇంట్లో వాళ్ల పోరు తప్పించుకోడానికి పోర్చుగల్‌లో చదువు కోసం వచ్చి, ప్రియుడి చేతిలో మోసపోయి, ఇండియాలో ఉన్న ఫ్యామిలీకి దూరమైన అవంతిక (రకుల్ ప్రీత్ సింగ్) ను అద్దె ప్రియురాలుగా ఇంటికి తెచ్చి తన పెళ్లి చెడగొట్టే పనులు మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది. నిజంగానే అవంతిక, స్యామ్ ప్రేమలో పడ్డారా అనేది మిగతా కథ.[2][3]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

మూలాలుసవరించు

  1. "Tollywood Box office report - 2019: Highest grossing Telugu movies of the year". International Business Times. 22 December 2019.
  2. Sakshi (9 August 2019). "'మన్మథుడు 2‌‌' మూవీ రివ్యూ". Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.
  3. The Indian Express (9 August 2019). "Manmadhudu 2 movie review: Nagarjuna, Rakul Preet deliver the goods" (in ఇంగ్లీష్). Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.