మరీచి మహర్షి (మరీచి అనగా ఒక కాంతి పుంజము) బ్రహ్మ మానసపుత్రులలో ఒక్కరు అని చెప్పబడింది. మొదటి మన్వంతరములోని ఏడుగురు బ్రహ్మ మానసపుత్రులలో మరీచి ఒక్కరు. మిగిలిన వారు అత్రి, అంగీరసుడు, పులహు, క్రతు, పులస్త్యుడు, వశిష్టుడు[1]. వేరొక మతము ప్రకారము మరీచి బ్రహ్మదేవుడు సృష్టించిన పదిమంది ప్రజాపతులలో ఒక్కడు.[2]

ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని మరీచి మహర్షి వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
మరీచి
మరీచి మహర్షి
మరీచి మహర్షి, బ్రహ్మమానసపుత్రుడు
పిల్లలుకశ్యపుడు

జైనుల సంప్రదాయము ప్రకారము ఇరవయ్యోవ తీర్థంకరుడైన మహావీరుని  పూర్వావతారములలో ఒక్కడైన భరత చక్రవర్తిగా చెప్పబడినవాడు మరీచి.

సప్తర్షి మార్చు

సప్తర్షి అనగా ఏడుగురు మహర్షులు అని సంస్కృత శబ్దార్థము.వీరు ఏడుమంది భారతీయ వాజ్మయమైన వేదం, పురాణేతిహాసములలో కీర్తింపబడినారు. వేద సంహితములలో పలు చోట్ల వీరి ప్రస్తావన తేబడింది. వేదములలోనే కాక పురాణములలో కూడా సప్తర్షుల ప్రస్తావన ఉంది. వేదవాజ్మయములో మరీచి సప్తర్షులలో ఒక్కడుగా ఎక్కువగా చెప్పబడలేకపోయినా మహాభారతములో చెప్పబడింది. భారతదేశములోని కొన్ని చోట్ల సప్తర్షి మండలములో మరీచిని ఒక్కరుగా పరిగణిస్తారు. కర్మకాండకు మరీచి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చెప్పబడింది. సంపూర్ణ సంఘ పరిత్యాగము కాక కర్మల ద్వారా యోగ సాధనను మరీచి సమర్థించారు. మరీచికి ఉన్న అనేకమంది సంతానములో కశ్యప మహర్షి అగ్రగణ్యులు. అలాగే ధర్మవ్రత మరీచి యొక్క భార్యలలో పేరెన్నికగన్నది. ఒక సందర్భములో ఆమె మహర్షి కోపానికి గురై రాతిగా రూపాంతరము చెందినది. అప్పుడు ఆమె తన తప్పు లేదని మునీశ్వరున్ని ప్రార్థించి తనను తాను అగ్నికి ఆహుతి కావించుకొన్నది. శ్రీమహావిష్ణువు ఆమె భక్తికి ప్రసన్నుడై ఆమెను శాప విముక్తురాలిని చేయబోగా ఆమె వారించి తనను ఇప్పటినుండి దేవశిలగా ప్రతి ఒక్క ఇంటిలో పూజలందుకొనే విధముగా చేయమని ప్రార్థించింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ఆ వరమును ప్రసాదించినాడని ఒక కథనము.[3]

ప్రజాపతులు మార్చు

సృష్టి మొదలైన తరువాత బ్రహ్మదేవుడు తన సృష్టిని కొనసాగించడానికి కొందరు అవసరమని భావించాడు. ఆ తలపు వచ్చిన తడవే తన మనస్సునుంచి పదిమంది ప్రజాపతులను, తొమ్మిది మందిని తన శరీరము నుంచి సృష్టించాడు. అలా మనస్సునుండి సృష్టింపబడిన పది మందిలో మరీచి ఒక్కడు. మిగిలిన వారు:[2]

  1. మరీచి
  2. అత్రి
  3. అంగీరసుడు
  4. పులహుడు
  5. పులస్త్యుడు
  6. క్రతు
  7. వశిష్టుడు
  8. ప్రచేతసుడు
  9. భృగు
  10. నారదుడు

జీవితం మార్చు

మరీచి మహర్షి యొక్క జీవితము ఆయన సంతతి వల్ల ఎక్కువగా తెలియబడుతుంది. ముఖ్యంగా ఆయన కుమారుడైన కశ్యపమహర్షి వల్ల. మరీచి మహర్షి కళ అను యువతిని పెండ్లియాడి కళ వల్ల కశ్యపునికి శ్రీమహావిష్ణువు అంశగా జన్మనిచ్చాడు. (కశ్యప మహర్షి తన తండ్రినుండి ప్రజపతిత్వాన్ని కూడా పొందినట్టు చెప్పబడినది).[2] రాజస్తాను రాష్ట్రములోని పుష్కర్ ప్రాంతములో బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినట్టు, ద్వాపరయుగములో మహాభారత కాలములో భీష్మునికి అంపశయ్య మీదనుండగా దర్శనమిచ్చినట్టు కూడా చెప్పబడింది. బ్రహ్మాండపురాణము తదితర పురాణములలో మరీచి ప్రస్తావన ఉంది. కృతయుగమునందు ధ్రువునికి తపస్సు చేయమని సలహా ఇచ్చినవాడు మరీచి.[3]

గమనికలు మార్చు

  1. Inhabitants of the Worlds Mahanirvana Tantra, translated by Arthur Avalon, (Sir John Woodroffe), 1913, Introduction and Preface. The Rishi are seers who know, and by their knowledge are the makers of shastra and "see" all mantras. The word comes from the root rish Rishati-prapnoti sarvvang mantrang jnanena pashyati sangsaraparangva, etc. The seven great Rishi or saptarshi of the first manvantara are Marichi, Atri, Angiras, Pulaha, Kratu, Pulastya, and Vashishtha. In other manvantara there are other sapta-rshi. In the present manvantara the seven are Kashyap, Atri, Vashishtha, Vishvamitra, Gautama, Jamadagni, Bharadvaja. To the Rishi the Vedas were revealed. Vyasa taught the Rigveda so revealed to Paila, the Yajurveda to Vaishampayana, the Samaveda to Jaimini, Atharvaveda to Samantu, and Itihasa and Purana to Suta. The three chief classes of Rishi are the Brah-marshi, born of the mind of Brahma, the Devarshi of lower rank, and Rajarshi or Kings who became Rishis through their knowledge and austerities, such as Janaka, Ritaparna, etc. Thc Shrutarshi are makers of Shastras, as Sushruta. The Kandarshi are of the Karmakanda, such as Jaimini.
  2. 2.0 2.1 2.2 Wilkins, W.J (2003). Hindu Mythology. New Delhi: D.K. Printworld (P) Limited. p. 370. ISBN 81-246-0234-4.
  3. 3.0 3.1 Sathyamayananda, Swami. Ancient sages. Mylapore, Chennai: Sri Ramakrishna Math. pp. 14–16. ISBN 81-7505-356-9.
"https://te.wikipedia.org/w/index.php?title=మరీచి&oldid=4010906" నుండి వెలికితీశారు