ఋషి మరీచి, రిషి మరీచి లేదా మరీచి లేదామరీచి మహర్షి (RSI Marīci, ऋषि मरीचि) (ఒక కాంతి రేఖ అని అర్థం) బ్రహ్మ కుమారుడు. సృష్టి కార్యము నకు తనకు సాయముగా శక్తి సంపన్నులగు 10 మంది ప్రజాపతులను ఈ క్రింద సూచించిన వారిని బ్రహ్మ దేవుడు జనింప జేసెను. వారిలో మరీచి ఒకరు. అందులో తొమ్మండుగురిని తన శరీరము ద్వారా ఒకరు మానసము నుండి ఉద్భవించారు. మరీచి బ్రహ్మ మానస పుత్రుడు. బ్రహ్మ మానస పుతృలలో మరీచి ఒకరు. మరీచి భార్య కళ. మరీచి కుమారుడు కశ్యపుడు లేదా కశ్యప ప్రజాపతి.

  1. మరీచి మహర్షి
  2. అత్రి
  3. అంగీరసుడు
  4. పులహుడు
  5. పులస్త్యుడు
  6. క్రతు మహర్షి
  7. వశిష్ట మహర్షి
  8. ప్రాచేతస మహర్షి
  9. భృగు మహర్షి
  10. నారద మహర్షి
  11. అధర్వుడు
మరీచి వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
బ్రహ్మ కుమారుడైన మరీచి .

వివాహము మార్చు

  • శ్రీహరి నాభినుండి బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ తనకు సహాయకారులుగా నవబ్రహ్మలను సృష్టించాడు. వారిలో మరీచి ఒకడు. మరీచి తండ్రికి సహాకుడుగా ఉంటూ తపస్సు చేయుచూ కాలక్షేపం చేస్తున్నాడు యుక్తవయస్సు రాగానే మరీచి కర్ధముని కుమార్తెయగు కళను వివాహం చేసికొన్నాడు. కళ మరీచి హాయిగా సుఖంగా గృహస్థ జీవితం గడుపుతున్నారు. కర్దమ ప్రజాపతి, దేవహుతి లకు తొమ్మిది మంది సంతానం. వీరిలో దివ్య సుందరి కర్దమ ప్రజాపతి పెద్ద కుమార్తె ఐన కళను మరీచి కిచ్చి వివాహ మొనర్చెను.

సంతానం మార్చు

  • ఒకనాడు కళ మనసులోని మాటను తన భర్తతో; మనకన్నా మిన్న అయిన, సర్వ జీవ రాశులను సృష్టించ గల సామర్ద్యము గల ఓక పుత్రుడు కనాలని కోరిక అన్నది . కొంత కాలమునకు మరీచి అనుగ్రహంతో కళ గర్భవతి అయింది. మాసములు నిండగానే ఒక పుత్రుని కన్నది. ఆ తదుపరి కొంత కాలమునకు కశ్యపుడు పెద్దవాడయి, దక్షప్రజాపతి పుత్రికలను పెండ్లాడి సృష్టి ప్రారంభించాడు. సమస్త లోకముల యందు కీర్తి నీయురాలు అగు ఒక ఉత్తమ పుత్రికను ప్రసాదించమని, కోరుకోవడము జరుగుతుంది. అనంతరం కొంతకాలమునకు కళ మరల గర్భవతి అయినది.నవమాసములు పూర్తికాగానే పూర్ణిమ అను కుమార్తె కళకు కలిగింది.

మరీచిస్మృతి మార్చు

  • మరీచి మహర్షి మహాతపస్వి, విరాగి, మహాజ్ఞాని, స్మృతికర్త. మరీచి మహర్షి పేరున ఒక ధర్మశాస్త్రము మరీచి స్మృతి ఉంది. మరీచి స్మృతి మనకు లభించుట లేదు. పరమ పవిత్రుడు. నవ బ్రహ్మలలో ఒకడు, కశ్యపుని తండ్రియగు మరీచి మనకు ప్రాత:స్మరణీయమైనది.

మూలాలు మార్చు